Telugu Movie Release Dates – Upcoming Tollywood Films
Check Telugu Movie Release Dates with upcoming Tollywood films, latest schedules, cast details, trailers, and official updates in one place.

తెలుగు సినిమా Telugu Cinema పరిశ్రమ తాజాగా వరుసగా విజయాలతో కళకళలాడుతోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మూడు సినిమాల్లో Sankranthiki Vasthunam మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఈ మూవీలో విక్టరీ Venkatesh Daggubati హీరోగా నటించగా యువ అందాల నటీమణులు Meenakshi Chaudhary Aiswarya Rajesh హీరోయిన్స్ గా నటించారు. యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ కామెడీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది.
Sankranthiki Vasthunam Total Worldwide Collection రూ. 310 కోట్లు. దీనితో పాటు రిలీజ్ అయిన Ram Charan హీరోగా తెరకెక్కిన Game Changer డిజాస్టర్ గా నిలవగా Nandamuri Balakrishna హీరోగా యువ దర్శకుడు బాబీ తీసిన Daaku Maharaaj మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తరువాత వచ్చిన Naga Chaitanya Sai Pallavi ల Thandel మూవీ రిలీజ్ అయి పెద్ద విజయవంతం అయింది.
ఆ తరువాత వచ్చిన యువ నటుడు Siddu Jonnalagadda హీరోగా రూపొందిన Tillu Square తో పాటు Mad Square మూవీస్ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాయి. ఇక ఆ తరువాత టాలీవుడ్ స్టార్ యాక్టర్ JrNTR Hrithik Roshan కలిసి నటించిన War2 తో పాటు Superstar Rajinikanth హీరోగా Lokesh Kanagaraj తీసిన Coolie సినిమాలు రెండూ ఆగష్టు 14న రిలీజ్ అయ్యాయి.
Telugu Movie Release Dates Latest Updates
వీటిలో వార్ 2 యావరేజ్ విజయం అందుకోగా కూలీ ఎబోవ్ యావరేజ్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల యువ నటుడు TejaSajja హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ Mirai తో పాటు యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన Kishkindhapuri సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయి ప్రస్తుతం మంచి సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి.
వీటితో పాటు ఇటీవల Mouli Tanuj Prasanth Shivani Nagaram ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన Little Hearts మూవీ కూడా భారీ సక్సెస్ తో ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఇక అసలు విషయం లోకి వెళితే ప్రస్తుతం సెట్స్ మీదున్న కొన్ని చిన్న, పెద్ద సినిమాల యొక్క రిలీజ్ డేట్ లు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. అయితే అవి ఏంటి, వాటి యొక్క రిలీజ్ డేట్స్, ప్రస్తుత షూటింగ్ పరిస్థితి చూద్దాం.
SSMB29 :
సూపర్ స్టార్ Mahesh Babu హీరోగా స్టార్ డైరెక్టర్ SS Rajamouli దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాణ కేఎల్ నారాయణ దాదాపుగా రూ. 1000 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తుండగా M M Keeravani సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటులు Prithviraj Sukumaran Priyanka Chopra కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం Hyderabad లో జరుగుతోంది. ఐతే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ ప్రతిష్టాత్మక మూవీని 2027 ప్రథమార్ధంలో రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోందట. నవంబర్ లో ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
AA22 :
Pushpa2: The Rule మూవీతో హీరోగా గొప్ప విజయం సొంతం చేసుకున్నారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ Allu Arjun. నేషనల్ క్రష్ Rashmika Mandanna హీరోయిన్ గా నటించిన Pushpa 2 Total Box office Collection రూ. 1850 కోట్లు సొంతం చేసుకుంది. అయితే దీని అనంతరం ప్రస్తుతం Jawan మూవీ డైరెక్టర్ Atlee Kumar తో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ మూవీలో Bollywood నటి Deepika Padukone తో పాటు టాలీవుడ్ అందాల నటి Mrunal Thakur హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తాజాగా ముంబైలో లేటెస్ట్ షెడ్యూల్ జరుపుకుంటోంది ఈ మూవీ. ఇక లేటెస్ట్ Tollywood వర్గాల న్యూస్ ప్రకారం AA22 మూవీ 2027 ద్వితీయార్ధంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట.
Upcoming Tollywood Movie Releases Schedules
Ntr Neel Movie (Dragon) :
ఇటీవల RRR, Devara, War2 సినిమాల ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చి మంచి విజయాలు సొంతం చేసుకుని పాన్ ఇండియన్ హీరోగా గొప్ప క్రేజే, మార్కెట్ దక్కించుకున్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ NT Rama Rao Jr. ఇక ఆ మూవీస్ అనంతరం ప్రస్తుతం KGF, Salaar మూవీస్ డైరెక్టర్ Prashanth Neel తో చేస్తున్న భారీ పాన్ ఇంటర్నేషనల్ మూవీ Dragon. ఈ మూవీలో కన్నడ అందాల నటి Rukmini Vasanth హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఇది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ మూవీని 2026 జూన్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.
Peddi :
RRR, GameChanger మూవీస్ అనంతరం ప్రస్తుతం యువ దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న మూవీ Peddi. ఈ మూవీకి Oscar Award సంగీత దర్శకుడు AR Rahman మ్యూజిక్ అందిస్తుండగా Bollywood బ్యూటీ Jahnvi Kapoor హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ నటుడు Shiva Raj Kumar అలానే Amazon Prime వారి Mirzapur సిరీస్ లో ప్రధాన పాత్ర చేసిన Divyenndu మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2026 మార్చి 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తప్పకుండా Peddi తో తమ హీరో పెద్ద విజయం అందుకోవడం ఖాయం అని రామ్ చరణ్ ఫ్యాన్స్ గట్టిగా నమ్మకంతో ఉన్నారు.
The Rajasaab :
Pan Indian Star Prabhas హీరోగా ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ యాక్షన్ హర్రర్ మూవీ The Rajasaab. ఈ మూవీలో Nidhhi Agerwal, Malavika Mohanan, Riddhi Kumar హీరోయిన్స్ గా నటిస్తుండగా People Media Factory సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో Sanjay Dutt కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ది రాజాసాబ్ మూవీ వాస్తవానికి డిసెంబర్ 5 న రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని టెక్నీకల్ సమస్యల రీత్యా దీనిని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
Latest Tollywood Telugu Cinema News
OG Ustaad Bhagat Singh :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం OG, Ustaad Bhagat Singh సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన హీరోగా రూపొందిన Hari Hara Veera Mallu మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక Hari Hara Veera Mallu Total Collection చాలా ఏరియాల్లో తక్కువ రాబట్టి నిర్మాత, బయ్యర్లకి నష్టాల్లోకి నెట్టింది. దానితో ఎలాగైనా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పెద్ద సక్సెస్ లు కొట్టాలని ఫిక్స్ అయ్యారు Pawan Kalyan.
వీటిలో పాన్ ఇండియన్ మాస్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా రూపొందుతున్న They Call Him OG మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో Priyanka Mohan హీరోయిన్ గా నటిస్తోంది. ఇక పవన్ హీరోగా Harish Shankar తీస్తున్న Ustaad Bhagat Singh Release Date ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో తాజాగా పవన్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నారు. యువ అందాల నటీమణులు Raashi Khanna, Sreeleela హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని Mythri Movie Makers సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది.
Tollywood Upcoming Movies Cast Trailers & Release Details
The Paradise :
ఇటీవల Saripodhaa Sanivaaram, HIT The Third Case సినిమాల ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చి రెండు భారీ విజయాలు సొంతం చేసుకున్నారు నాచురల్ స్టార్ Nani. కాగా వాటి అనంతరం తాజాగా యువ దర్శకుడు Srikanth Odela తో ఆయన చేస్తున్న మూవీ The Paradise. ఇందులో సీనియర్ నటుడు Mohan Babu కీలక పాత్ర చేస్తుండగా దీనిని SLV Cinemas సంస్థ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.
రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో Sonali Kulkarni హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో Jadal అనే విభిన్నమైన పాత్రలో నాని నటిస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక The Paradise మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 సమ్మర్ కానుకగా మార్చి 26న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తప్పకుండా ఈ మూవీ పెద్ద విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Latest Tollywood Updates & Rumors
Rowdy Janardhan VD 14 :
ఇటీవల యువ దర్శకుడు Gowtham Thinnanuri దర్శకత్వంలో తెరకెక్కిన Kingdom మూవీ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చి యావరేజ్ విజయం అందుకున్నారు యువ నటుడు Vijay Deverakonda. ఈ మూవీ అనంతరం తాజాగా ఆయన నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ RowdyJanardhan. దీనిని యువ దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తుండగా మరొక్కసారి దీనిలో విజయ్ తో కలిసి National Crush Rashmika Mandanna హీరోయిన్ గా నటిస్తోంది.
అగ్ర నిర్మాత Dil Raju తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనిని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. దీనితో పాటు తాజాగా విజయ్ అనౌన్స్ చేసిన మూవీ VD14. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీని రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించనుంది. ఈ మూవీని 2027 లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు క్రేజీ ప్రాజక్ట్ పై విజయ్ ఫ్యాన్స్ తో పాటు అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
What's Your Reaction?






