“Hari Hara Veera Mallu First Review: Pawan Kalyan’s Mass Comeback Shocks Fans
The first review of Hari Hara Veera Mallu praises the trailer visuals and Pawan Kalyan’s power-packed performance. The historical epic hits theaters worldwide on July 24, 2025.

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలు చేస్తుండడంతో పాటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు. తన జనసేన పార్టీ తరపున ఇటీవల రాజకీయాల్లో పోటీ చేసి పిఠాపురం ఎమ్యెల్యేగా గెలిచిన పవన్, తన నియోజకవర్గ ప్రజలతో పాటు ఉప ముఖ్యమంత్రిగా కూడా విరివిగా సేవలందిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన చేస్తున్న మూడు సినిమాల్లో హరి హర వీర మల్లు మూవీ పూర్తిగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ నెల 24న రిలీజ్ కి రెడీ కాగా మరోవైపు సుజీత్ తీస్తున్న ఓజి మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటోంది. అలానే వీటితో పాటు హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఇటీవల షూటింగ్ ప్రారంభం అయింది. అయితే గతంలో ఈ మూవీని విజయ్ హీరోగా రూపొందిన హిట్ మూవీ తేరికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు పూర్తిగా కొత్త కథతో హరీష్ తీస్తున్నారని తెలుస్తోంది. అయితే వీటిలో హరి హర వీర మల్లు రిలీజ్ కి రెడీ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ టీజర్స్ తో పాటు సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
హరి హర వీరమల్లు – మొదటి సమీక్ష & విడుదల తేదీ
అలానే తాజాగా హరి హర వీర మల్లు ట్రైలర్ కూడా రిలీజ్ అయి ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసిందని చెప్పాలి. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు యాక్టింగ్, ఫైట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వంటివి ఎంతో బాగున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ సీన్స్ తో పాటు భారీ సన్నివేశాలు వంటివి ట్రైలర్ లో అలరించి అందరిలో మూవీ పై హైప్ ఏర్పరిచాయి.
ఇక ఈ మూవీ మొత్తంగా రెండు పార్ట్స్ గా రూపొందుతుండగా ఫస్ట్ పార్ట్ ని క్రిష్ జాగర్లమూడితో కలిసి జ్యోతి కృష్ణ తీస్తున్నారు. ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రముఖ సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గజదొంగ వీర మల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండగా యువ అందాల కథానాయిక నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Hari Hara Veera Mallu Release Date
ఇటీవల ఆనిమల్ మూవీతో ఆకట్టుకుని సౌత్ ఆడియన్స్ నుండి కూడా మంచి పేరు సొంతం చేసుకున్న బాబీ డియోల్ ఇందులో నెగటివ్ పాత్ర చేస్తున్నారు. ఇక జులై 24న రిలీజ్ కానున్న ఈ మూవీ తప్పకుండా భారీ విజయం ఖాయం అని, ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ కూడా హరి హర వీర మల్లు తుడిచిపెట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ సృష్టించడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇక బడ్జెట్ పరంగా రూ. 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మూవీ రూపొందింది. వాస్తవానికి ఎపుడో పట్టాలెక్కయిన ఈ మూవీ మధ్యలో పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో పలుమార్లు వాయిదా పడి మొత్తంగా ఇటీవల పూర్తి కాబడి ఫైనల్ గా ఈ నెలాఖరులో రిలీజ్ కాబోతోంది. ఇక అజ్ఞాతవాసి అనంతరం పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న స్ట్రైట్ మూవీ కావడం అలానే భీమ్లా నాయక్ అనంతరం మూడేళ్ళ తరువాత మూడేళ్లకు వస్తున్న మూవీ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆయనని స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
Hari Hara Veera Mallu Review in Telugu
ముఖ్యంగా సాధారణ ప్రేక్షకులతో పాటు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఈ మూవీ ప్రత్యేకమైన ఐ ఫీస్ట్ గా నిలుస్తుందని దర్శకుడు జ్యోతి కృష్ణ ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యంగా ఈమూవీలో పవన్ పెర్ఫార్మన్స్ ప్రధాన హైలైట్ అని ఆయన అన్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ తో పలు రికార్డ్స్ సొంతం చేసుకున్న హరి హర వీర మల్లు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా అదరగొట్టింది.
పలు ఏరియాల్లో ఈ మూవీ మంచి ధరకు అమ్ముడైంది. ఇక ఈ మూవీలో ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక పలు సినీ వర్గాల సమాచారం ప్రకారం ఫస్ట్ రివ్యూ చెప్పాలి అంటే ఓవరాల్ గా హరి హర వీర మల్లుతో హీరోగా పవన్ మంచి హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు. హీరోగా పవన్ పెర్ఫార్మన్స్ ప్రధాన హైలైట్ కానున్న ఈ మూవీ కథానుసారంగా సాగే కథనం ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారట.
ట్రైలర్ బాదం బావుంది – ప్రేక్షకుల మొదటి స్పందనలు
పలు భారీ యాక్షన్ సీన్స్ తో పాటు విజువల్స్ కూడా ప్రధానంగా ఆకట్టుకుంటాయని, గజదొంగ వీర మల్లు గా పేదసాదలను రక్షిస్తూ సనాతన ధర్మాన్ని ఆయన కాపాడే పాత్రలో పవన్ ఆకట్టుకున్నారట. సినిమా ప్రారంభ సన్నివేశం మొదలుకుని క్లైమాక్స్ వరకు కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్. ఇక హీరోయిన్ గా పంచమి పాత్రలో నటిస్తున్న నిధి అగర్వాల్ ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పిస్తుందని, కేవలం అలా వచ్చి ఇలా వెళ్లే పాత్ర కాకుండా ఆమె పాత్రకు మూవీలో ఎంతో మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు.
తప్పకుండా ఈ మూవీతో ఆమె నటిగా మంచి బ్రేక్ అందుకుంటారని చెప్తున్నారు. ఇక ఔరంగజేబుగా నెగటివ్ పాత్ర చేస్తున్న బాబీ డియోల్ పెర్ఫార్మన్స్ కూడా ఎంతో బాగుంటుందట. పలు కీలక సీన్స్ లో ఆయన అదరగొట్టారని, ఆనిమల్ తరువాత డాకు మహారాజ్ మూవీలో ఆకట్టుకున్న బాబీ మరొక్కసారి హరి హర వీర మల్లుతో మరింత మంచి పేరు అందుకోవడం ఖాయం అంటున్నారు.
ఇక ఇతర కీలక పాత్రలు చేస్తున్న నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, సత్యరాజ్, విక్రమ్ జీత్ విర్క్, పూజిత పొన్నాడ ల పాత్రలు కూడా బాగుంటాయని చెప్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. కొల్లగొట్టినాదిరో, అసుర హననం సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకోగా అవి రేపు థియేటర్స్ లో ఆకట్టుకుంటాయని టాక్.
వీటితో పాటు ముఖ్యంగా ఈ మూవీకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్స్ జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంసల పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనట. సినిమా అంతా ఎంతో గ్రాండియర్ గా రిచ్ గా ఉండడంతో పాటు పలు కీలక సీన్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయని టాక్. అలానే విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా ప్రత్యేకంగా టీమ్ ఎంతో శ్రద్ద తీసుకుని మంచి అవుట్పుట్ రాబట్టారని, రేపు వెండితెరపై విజువల్స్, గ్రాఫిక్స్ ఎంతో రియలిస్టిక్ గా ఉంటాయని అంటున్నారు.
జూలై 24, 2025 – ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో రన్
ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో పాటు కీలక యాక్షన్, ఫైట్ సన్నివేశాలు హరి హర వీర మల్లు కి ముఖ్య బలం అని, అలానే క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ అందిస్తాయని, ఆడియన్స్ ఆ సీన్స్ కి ఎంతో థ్రిల్ అవుతారని చెప్తున్నారు. ముఖ్యంగా దర్శకులు క్రిష్ తో పాటు జ్యోతికృష్ణ ఇద్దరూ కూడా ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి తీశారని టాక్.
అలానే నిర్మాత ఏ ఎమ్ రత్నం ఖర్చు విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అవసరం అయిన ప్రతిచోటా బాగా ఖర్చు చేసారని, పలు సీన్స్ నిర్మాణ విలువలు రేపు తెరపై ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. ఆ విధంగా దాదాపుగా మూడేళ్లపాటు ఎంతో శ్రమపడ్డ హరి హర వీర మల్లు మూవీ త్వరలో రిలీజ్ అనంతరం అందరినీ ఆకట్టుకుని మొదటి రోజు నుండి మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.
Hari Hara Veera Mallu Movie Review
హీరోగా పవన్ కళ్యాణ్ తో దీనితో మరింత క్రేజ్ సొంతం చేసుకోవడంతో పాటు దీనితో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ సహా పలు ఇతర అన్ని భాషల ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందట. మరోవైపు ఓటిటి బిజినెస్ పరంగా కూడా మంచి ధరకు అమ్ముడైన హరి హర వీర మల్లు మరి రిలీజ్ అనంతరం ఎంత మేర ఆకట్టుకుంటుందో, ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తుందో తెలియాలి అంటే మరొక ఇరవై రోజుల వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది. మరి ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, న్యూస్, గాసిప్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, రివ్యూస్, గ్యాలెరీస్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని చూస్తూ ఫాలో అవుతూ ఉండండి
What's Your Reaction?






