Allu Arjun’s Surprising Look in Atlee’s Movie – First Glimpse & Latest Updates
Allu Arjun’s stunning transformation in Atlee’s upcoming movie is creating a buzz! Check out his surprising look, first glimpse, and latest updates

పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించింది.
What’s Special About Allu Arjun’s Look in Atlee’s Film?
అంతకముందు పుష్ప ది రైజ్ మూవీలో తన అద్భుత నటనకు గాను ఏకంగా బెస్ట్ యాక్టర్ గా భారత ప్రభుత్వం నుండి నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఇక పుష్ప 2లో కూడా మరొక్కసారి తన అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించారు అల్లు అర్జున్. ముఖ్యంగా అస్సలు తగ్గేదేలే అంటూ ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అల్లు అర్జున్ ఆకట్టుకున్న ఈ మూవీ ఇండియా మొత్తం కూడా బాక్సాఫీస్ సెన్సేషన్ సృష్టించింది.
అలానే ఓవర్సీస్ లో కూడా పుష్ప 2 బాగా కలెక్షన్ కొల్లగొట్టింది. అటు నార్త్ లో అయితే ఆడియన్స్ ని ఆకట్టుకుని అతి పెద్ద సెన్సేషన్ సృశించి టాప్ స్థానంలో నిలిచింది. అన్ని బాలీవుడ్ మూవీస్ ని దాటేసిన పుష్ప ప్రస్తుతం ఇండియా వైడ్ అత్యధిక నెట్ కలెక్షన్ అందుకున్న మూవీగా నిలిచి పెద్ద రికార్డు సృష్టించింది.
ఇక ఇందులో శ్రీవల్లిగా రష్మిక మందన్న పెర్ఫార్మన్స్ కి కూడా బాగా పేరు లభించింది. ఇక సుకుమార్ సూపర్ టెక్జింగ్, నిర్మాతల భారీ నిర్మాణ విలువలు, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్ వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.
Allu Arjun’s Role in Atlee’s Movie – Character Details
ఇక ఈమూవీ మొత్తంగా రూ. 1870 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని అల్లు అర్జున్ కి హీరోగా అత్యద్భుతమైన క్రేజ్ ని అలానే మార్కెట్ ని అందించింది. అయితే దీని అనంతరం గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ అల్లు అర్జున్ చేయాల్సి ఉంది.
అత్యంత భారీ వ్యయంతో మైథలాజి అంశంతో రూపొందనున్న ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎంతో సమయం పట్టనుండడంతో ఈలోపు కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కుమార్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా ఇప్పటికే ఈ క్రేజీ కాంబో మూవీ విషయమై పలుమార్లు అల్లు అర్జున్ ని అట్లీ కలవడం కథ, కథనాలు లాక్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీని ఎవరు నిర్మించనున్నారు అనే దాని పై ఇటీవల పలు నిర్మాణ సంస్థల పేర్లు వైరల్ అయ్యాయి.
Alu Arjun Atlee Movie Shooting Updates & Production Details
కాగా లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో నిర్మించేందుకు సిద్దమైందట. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ కి యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ సంగీతం సమకూర్చనున్నట్లు టాక్.
అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో తన పాత్ర కోసం ఇప్పటికే కొద్దిరోజులుగా విదేశాల్లో తన స్టైలింగ్, బాడీ విషయమై కొత్త వర్కౌట్ చేసిన అల్లు అర్జున్ తాజాగా ఇండియాకి తిరిగి వచ్చారు. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్ ఎంతో సర్ప్రైజింగ్ గా ఉండనున్నట్లు టాక్. గతంలో అట్లీ తీసిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ అనేది తెల్సిందే.
అదే విధంగా ఈ మూవీని కూడా భారీ సక్సెస్ చేసే విధంగా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ సిద్ధం చేసుట అట్లీ. తన మార్క్ యాక్షన్ అంశాలతో పాటు అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ స్టోరీ తయారుచేశారట. అలానే త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్న ఈ మూవీలో పలువురు టాలీవుడ్ ప్రముఖ నటులు కీలక పాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా త్వరలో ఈ మూవీని ప్రారంభించి వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అలానే ఇటు అట్లీ మూవీ చేస్తూ చాలా వరకు ఇది పూర్తి అయిన అనంతరం మరోవైపు త్రివిక్రమ్ మూవీ కూడా ప్రారంభించేలా అల్లు అర్జున్ భావిస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఈ క్రేజీ ప్రాజక్ట్ పైన నేషనల్ వైడ్ గా అన్ని భాషల ఆడియన్స్ లో అప్పుడే ఎంతో క్రేజ్ వచ్చేసింది. మరి ఈ మూవీ గురించిన పూర్తి వివరాల కోసం మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
What's Your Reaction?






