Top Tollywood Directors 2025: Most Successful Telugu Film Makers

Discover the top Tollywood directors of 2025 who delivered blockbuster hits and gained critical acclaim. Get the complete list now.

Top Tollywood Directors 2025: Most Successful Telugu Film Makers

1. ఎస్ ఎస్ రాజమౌళి : (SS Rajamouli)

 ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన రాజమౌళి, ఆ సినిమాతో మంచి హిట్ కొట్టారు. గజాల హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించారు. ఆ తరువాత మరొక్కసారి ఎన్టీఆర్ తో ఆయన తీసిన సింహాద్రి మూవీ భారీ సక్సెస్ కొట్టి దర్శకుడుగా రాజమౌళి కి మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా మంచి ఛాన్స్ లు దక్కించుకుంటూ కొనసాగిన రాజమౌళి, ఆ తరువాత నుండి చేసిన ప్రతి ఒక్క సినిమాతో కూడా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో తిరుగులేని దర్సకుడిగా ముందుకు దూసుకెళ్లారు. అయితే ఆ తరువాత ప్రభాస్ తో రాజమౌళి తీసిన బాహుబలి మూవీస్ రెండూ కూడా దేశవిదేశాల్లో సైతం ఎంతో గొప్ప విజయాలు సొంతం చేసుకుని టాలీవుడ్ క్రేజ్ ని హాలీవుడ్ రేంజ్ కి వినిపించేలా చేసాయి. ఆ తరువాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ పేట్రియాటిక్ మూవీ ఆర్ఆర్ఆర్ తీశారు రాజమౌళి. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్ర చేయగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ఈ మూవీలో చరణ్ కి జోడీగా అలియా భట్, అలానే ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద విజయం అందుకోవడంతో పాటు ఇందులో నాకు నాటు సాంగ్ కి ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు లభించడం విశేషం. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ 2027 సమ్మర్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కూడా సక్సెస్ కొడితే దర్శకుడిగా రాజమౌళి ఎవరూ అందుకోలేని ఎత్తుకు ఎదగడం ఖాయంగా చెప్పాలి.


2. త్రివిక్రమ్ శ్రీనివాస్ : (Trivikram Srinivas)


తెలుగు సినిమా పరిశ్రమకు శ్రియ, తరుణ్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమా ద్వారా మెగాఫోన్ పట్టిన కథ, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, దానితో మంచి విజయం అందుకున్నారు. అంతకముందు పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు కథా రచన చేయడంతో పాటు ఆకట్టుకునే స్టైల్ లో మాటలు అందించి తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న త్రివిక్రమ్ తన సెకండ్ మూవీని సూపర్ స్టార్ మహేష్ తో తీశారు. ఆ విధంగా వీరిద్దరి కలయికలో వచ్చిన మూవీ అతడు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ కొట్టింది. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జల్సా మూవీ తీసి మరొక సక్సెస్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆపైన మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఖలేజా సినిమా తీశారు. అయితే అది మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం చెందింది. అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తొలిసారిగా ఆయన తీసిన జులాయి మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన త్రివిక్రమ్, ఇటీవల పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి మూవీతో కెరీర్ పరంగా పెద్ద డిజాస్టర్ అందుకున్నారు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి ఆయన తీసినా అరవింద సమేత, ఇక గత ఏడాది రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న అలవైకుంఠపురములో సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టాయి. వీటి అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం మూవీ మంచి విజయవంతం అయింది. ఇక త్వరలో అల్లు అర్జున్ తో తొలిసారిగా పాన్ ఇండియన్ మైథలాజి మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

3. కొరటాల శివ : (Koratala Siva)

ఫస్ట్ మూవీ మిర్చి తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన కొరటాల శివ దానితో పెద్ద సక్సెస్ కొట్టారు. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ తో శ్రీమంతుడు మూవీ తీసి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నారు కొరటాల శివ. గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి పలు కమర్షియల్ హంగులు అద్ది కొరటాల శివ తీసిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ద్వారా టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ వారు టాలీవుడ్ కి నిర్మాతలుగా అడుగుపెట్టారు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల తీసిన సినిమా జనతా గ్యారేజ్. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఆ తరువాత మరొక్కసారి తనకు ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ మహేష్ బాబు తో భరత్ అనే నేను మూవీ తీసిన కొరటాల ఆ సినిమాతో కూడా కూడా మరొక సూపర్ డూపర్ హిట్ కొట్టారు. వాటి అనంతరం చిరంజీవి, రామ్ చరణ్ లతో ఆయన తీసిన ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాని తరువాత టాలీవుడ్ పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల తీసిన మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. గత ఏడాది సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం దానికి సీక్వెల్ అయిన దేవర పార్ట్ 2 మూవీ తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు కొరటాల శివ. 

2025లో టాప్ టాలీవుడ్ డైరెక్టర్లు ఎవరు?


4. అనిల్ రావిపూడి : (Anil Ravipudi)

ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన అనిల్ రావిపూడి, ఆ సినిమాతో భారీ సక్సెస్ కొట్టారు.మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. అనంతరం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం మూవీ తీసి దానితో కూడా సక్సెస్ కొట్టిన అనిల్ర్ ఆపై, మాస్ మహారాజ రవితేజ తో రాజా ది గ్రేట్ మూవీ తీసి మరొక హిట్ కొట్టారు. అనంతరం వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఆయన తీసిన ఫన్ ఎంటర్టైనర్ మూవీ ఎఫ్ 2. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కూడా పెద్ద విజయం సొంతం చేసుకుంది. వీటి అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు మూవీ తీశారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2020వ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న విష్యం తెల్సిందే. ఆ తరువాత ఎఫ్ 3 మూవీ తీసి పెద్ద హిట్ కొట్టిన అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వెంకటేష్ తో తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి కెరీర్ పరంగా అతి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక త్వరలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రతిష్టాత్మక మూవీ చేసేందుకు సిద్దమవుతున్నారు అనిల్. 


5. సుకుమార్ : (Sukumar)

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య మూవీ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్, ఆ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టారు. అను మెహతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లోని సాంగ్స్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే ఆ తరువాత రామ్ తో సుకుమార్ తీసిన జగడం మూవీ ఫ్లాప్ కావడం, ఆపై ఆయన మరొక్కసారి ఆర్య కి సీక్వెల్ గా అల్లు అర్జున్ తో తీసిన ఆర్య 2 మూవీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తరువాత కొంత గ్యాప్ అనంతరం నాగ చైతన్య, సమంత లతో సుకుమార్ తీసిన 100% లవ్ మూవీ సూపర్ హిట్ కొట్టి సుకుమార్ కి బాగా పేరు తెచ్చిపెట్టింది. అనంతరం ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ తో వన్ నేనొక్కడినే అనే మూవీ తీసిన సుకుమార్, ఆ మూవీ తో ఊహించనివిధంగా భారీ పరాజయాన్ని చవి చూసారు. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో ఆయన తీసిన నాన్నకు ప్రేమతో , అలానే ఆపైన రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టాయి. అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తొలిసారిగా తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ పెద్ద విజయం అందుకుని అందులో అద్భుత నటన కనబరిచిన అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అనంతరం గత ఏడాది డిసెంబర్ లో ఆ మూవీకి సీక్వెల్ అయిన పుష్ప 2 ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఇండియన్ సినిమా హిస్టరీలో అతి పెద్ద విజయం తన ఖాతాలో వేసుకున్నారు సుకుమార్. ఇక త్వరలో మెగా గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తో ఒక భారీ యాక్షన్ మూవీ చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు సుకుమార్. 


6. బోయపాటి శ్రీను: (Boyapati Srinu)

 
మొదటి సారిగా రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమైనబోయపాటి శ్రీను, ఆ సినిమా తో పెద్ద సక్సెస్ కొట్టారు. మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. ఆ తరువాత వెంకటేష్ తో తులసి, బాలయ్య తో సింహా సినిమాలు తీసి మరొక రెండు భారీ  సొంతం చేసుకున్నారు బోయపాటి. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆయన తీసిన దమ్ము మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వాటి తరువాత మరొక్కసారి బాలయ్యతో బోయపాటి తీసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లెజెండ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. అనంతరం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన సరైనోడు మూవీ కూడా విజయాన్ని అందుకుంది. అయితే దాని తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో బోయపాటి తీసిన జయ జానకి నాయక మాత్రం యావరేజ్ గా నిలిచింది. దాని అనంతరం తనకు ఇష్టమైన బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి బోయపాటి శ్రీను తీసిన యాక్షన్ ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ అఖండ. నాలుగేళ్ళ క్రితం మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి అతిపెద్ద విజయం అందుకుంది ఈ మూవీ. దాని తరువాత ఉస్తాద్ రామ్ తో ఆయన తీసిన పాన్ ఇండియన్ మూవీ స్కంద పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం నాలుగవసారి బాలయ్యతో బోయపాటి తీస్తున్న సినిమా అఖండ 2. అందరిలో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంతపెద్ద సక్సెస్ కొడుతుందో చూడాలి.

టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాలు తీసిన దర్శకుల వివరాలు

7. హరీష్ శంకర్ : (Harish Shankar)

తొలిసారిగా రవితేజ, జ్యోతిక ల కలయికలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన షాక్ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ తరువాత మరొక్కసారి రవితేజ తో హరీష్ శంకర్ మిరపకాయ్ మూవీ తీసి మంచి సక్సెస్ కొట్టారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ తీసి పెద్ద సక్సెస్ కొట్టి కెరీర్ లో అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అందుకున్నారు. దాని అనంతరం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో హరీష్ తీసిన రామయ్య వస్తావయ్యా మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తో తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సక్సెస్ అవ్వగా, అనంతరం అల్లు అర్జున్ తో హరీష్ తీసిన డీజే మూవీ ఎబోవ్ యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో హరీష్ శంకర్ తీసిన గద్దలకొండ గణేష్ సినిమా కూడా సక్సెస్ కొట్టగా తాజాగా మరొక్కసారి తన అభిమాన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని అయన తీసే పనిలో ఉన్నారు. మరి ఈ సినిమా ఆయనకు ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.


8. శేఖర్ కమ్ముల : (Sekhar Kammula)

తొలిసారిగా డాలర్ డ్రీమ్స్ మూవీతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన శేఖర్ కమ్ముల ఆ తరువాత ఆనంద్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయిన ఈ మూవీ క్లాస్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత సుమంత్ తో తీసిన గోదావరి మూవీ తో మరొక విజయం సొంతం చేసుకున్న శేఖర్, ఆపై వరుణ్ సందేశ్, వంశి, టైసన్, నిఖిల్, తమన్నా లతో తీసిన హ్యాపీ డేస్ మూవీ తో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు. ఆ తరువాత రానా ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన లీడర్, అలానే అంతా కొత్తవారితో తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలు కూడా బాగానే ఆడాయి. అయితే తరువాత నయనతార తో ఆయన తీసిన అనామిక మాత్రం ఫెయిల్ అయింది. అనంతరం వరుణ్ తేజ్, సాయి పల్లవి లతో శేఖర్ కమ్ముల తీసిన ఫిదా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి కెరీర్ పరంగా ఆయనకు మంచి టర్నింగ్ పాయింట్ ని అందించింది. అనంతరం నాగ చైతన్య, సాయి పల్లవి లతో శేఖర్ తీస్తున్న లవ్ స్టోరీ మూవీ మంచి విజయవంతం అవగా, కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్నారు శేఖర్ కమ్ముల. ఇక తాజాగా అక్కినేని కింగ్ నాగార్జున తో పాటు ధనుష్, రష్మిక మందన్న ల కలయికలో శేఖర్ కమ్ముల తీస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ కుబేర. ఈ మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా జూన్ లో దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. 


9. వి వి వినాయక్ : (V V Vinayak)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆది సినిమా తీసి దానితో దర్శకుడిగా పరిచయం అయిన వివి వినాయక్ ఆ సినిమా ద్వారా భారీ సక్సెస్ కొట్టి మాస్ ఆడియన్స్ లో బాగా క్రేజ్ దక్కించుకున్నారు. అనంతరం బాలయ్య తో చెన్నకేశవ రెడ్డి మూవీ తీసి మరొక విజయం అందుకున్న వినాయక్, ఆ తరువాత నితిన్ తో దిల్, ఆపై ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో ఠాగూర్ సినిమాలు తీసి మరొక రెండు భారీ సక్సెస్ లు అందుకున్నారు. ఆ తరువాత ఆయన నుండి వచ్చిన సాంబ, బన్నీ సినిమాల కూడా బాగానే ఆడగా, ఆపై వెంకటేష్ తో లక్ష్మి మూవీ తో భారీ సక్సెస్ కొట్టారు వినాయక్. అయితే అనంతరం ప్రభాస్ తో వినాయక్ తీసిన యోగి ఫ్లాప్ అవ్వగా, ఆపైన రవితేజ తో తీసిన కృష్ణ, అలానే ఎన్టీఆర్ తో తీసిన అదుర్స్ సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టాయి. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 సినిమా తీసి పెద్ద సక్సెస్ కొట్టిన వినాయక్, అనంతరం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తెలుగు లో ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ఛత్రపతి ని హిందీ లో రీమేక్ చేసారు, అయితే అది పెద్దగా ఆడలేదు. అలానే మరొకవైపు శీనయ్య అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు వినాయక్. అయితే తదుపరి మంచి స్క్రిప్ట్ దొరికితే దర్శకుడుగా మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు వినాయక్.  

టాలీవుడ్ లో ప్రభావం చూపిన 2025 బెస్ట్ డైరెక్టర్స్


10. శ్రీను వైట్ల : (Srinu Vaitla)

తెలుగు సినిమా పరిశ్రమకి రవితేజ హీరోగా తెరకెక్కిన నీకోసం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన శ్రీను వైట్ల, ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత రేఖ, ఆకాష్ లతో ఆయన తీసిన ఆనందం మూవీ భారీ సక్సెస్ కొట్టి దర్శకుడిగా శ్రీను వైట్ల కి బాగా పేరు తెచ్చిపెట్టింది. తరువాత కొన్నాళ్ల అనంతరం రవితేజ మరొక్కసారి తీసిన వెంకీ సినిమా సూపర్ సక్సెస్ శ్రీను కి బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై ఆయన తీసిన దుబాయ్ శ్రీను, ఢీ, రెడీ, కింగ్ సినిమాలు అన్ని కూడా ఒక దానిని మించి మరొకటి ఎంతో పెద్ద సక్సెస్ లు సాధించి శ్రీను వైట్ల కెరీర్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. తరువాత వెంకటేష్ తో నమో వెంకటేష్ మూవీ తీసి మరొక హిట్ కొట్టిన శ్రీనువైట్ల, ఆపైన ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు మూవీ తీసి భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ తో ఆయన తీసిన బాద్షా కూడా మంచి విజయం అందుకుంది. అయితే ఆ పైన ఆయన తీసిన ఆగడు, బ్రుస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అనంతరం ఇటీవల యాక్షన్ హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల తీసిన మూవీ విశ్వం. మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక త్వరలో విష్ణు తో ఆయన ఢీ 2 మూవీ తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow