10 Hidden Facts About Allu Arjun You Never Knew

Explore 7 rare and hidden facts about Stylish Star Allu Arjun that fans are shocked to discover – from his personal life to career secrets.

10 Hidden Facts About Allu Arjun You Never Knew

టాలీవడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు భాషలో మాత్రమే కాదు నేషనల్ వైడ్ అన్ని భాషల ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న స్టార్ యాక్టర్. అలానే పలు ఇతర దేశాల్లో కూడా ఆయనకు నటుడిగా విశేషమైన పేరు ఉందనేది తెలిసిందే. 


ఇటీవల ఆయన నటించిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించి ఏ స్థాయి బాక్సాఫీస్ కలెక్షన్ సాధించిందో మనకు అందరికీ తెల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఆ మూవీని సుకుమార్ తెరకెక్కించారు. ఇక నటుడిగా తొలిసారిగా గంగోత్రి మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. 

Allu Arjun Unknown Facts


ఆ మూవీని కె. రాఘవేంద్రరావు తెరకెక్కించగా దివంగత నటి ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ అందులో హీరోయిన్ గా నటించారు. అప్పట్లో రిలీజ్ అనంతరం గంగోత్రి మూవీ బాగానే సక్సెస్ అయింది. దాని అనంతరం దిల్ రాజు నిర్మాతగా సుకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన మూవీ ఆర్య. 

అల్లు అర్జున్ గురించి మీకు తెలియని రహస్యాలు


ఆ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా అనురాధ మెహతా నటించారు. వన్ సైడ్ లవ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఆర్య మూవీలోని సాంగ్స్ తో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్ కి అందరి నుండి విశేషమైన క్రేజ్ లభించి మూవీ భారీ విజయవంతం అయింది. దాని తరువాత వి వి వినాయక్త్ తో అల్లు అర్జున్ చేసిన మూవీ బన్నీ, అనంతరం ఏ. కరుణాకరన్ తో హ్యాపీ మూవీ చేసి మారాక విజయం అందుకున్న అల్లు అర్జున్ కి ఆ తరువాత పూరి జగన్నాథ్ తీసిన దేశముదురు మూవీ విజయం హీరోగా పెద్ద బ్రేక్ అందించింది. 


ఇక అక్కడి నుండి నటుడిగా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ ని ఎందరో ఫ్యాన్స్ ని అలరిస్తూ కొనసాగిన అల్లు అర్జున్ కెరీర్ లో అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు రెండూ కూడా మంచి విజయవంతం అయి ఆయన కెరీర్ కి బాగా బూస్ట్ ఇచ్చారు. అయితే ఇటీవల 2020లో మరొక్కసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ చేసిన మూవీ అలవైకుంఠుమురలో ఎంతో పెద్ద విజయం అందుకుని హీరోగా అల్లు అర్జున్ కి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందించింది. 

Hidden Facts about Allu Arjun


ఆ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అందులోని సాంగ్స్ నేషనల్ వైడ్ గా ఎంతో పాపులర్ అవ్వడంతో పాటు యూట్యూబ్ సహా పలు మ్యూజిక్ మాధ్యమాల్లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుని హీరోగా అల్లు అర్జున్ రేంజ్ విపరీతంగా పెంచేసాయి. అయితే దాని తరువాత సుకుమార్ తో తొలిసారిగా అల్లు అర్జున్ చేసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్. 


ఈ మూవీ 2021 చివర్లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా ఆడియన్స్ ని ఎంతో అలరించింది. కాగా ఆ మూవీలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనబరిచిన సహజ నటనకు గాను ఎందరో ప్రేక్షకాభిమానుల నుండి ప్రసంశలు దక్కడంతో పాటు ఏకంగా భారత ప్రభుత్వం నుండి ఆయనకు ఉత్తమ జాతీయ నటుడిగా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. 

అల్లు అర్జున్ చిన్ననాటి జీవితం లోని ఆసక్తికరమైన విషయాలు


అనంతరం తాజాగా అల్లు అర్జున్ చేసిన మూవీ పుష్ప 2 ది రూల్. అయితే ఈ మూవీ పార్ట్ 1 ని మించేలా మరింత భారీ విజయం అందుకుని దేశవిదేశాల్లో సైతం అల్లు అర్జున్ కీర్తి ప్రతిష్టలు పెంచడంతో పాటు అమాంతంగా ఆయన మార్కెట్ రేంజ్ ని కూడా అమాంతం పెంచేసింది. 


ఇక ప్రస్తుతం దీపికా పదుకొనె హీరోయిన్ గా అల్లు అర్జు హీరోగా యువ కోలీవుడ్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న AA22 మూవీ ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మితం అవుతోంది. 2026లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ క్రేజీ ప్రాజక్ట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం అల్లు అర్జున్ గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. 

Stylish Star Allu Arjun Secrets


1. వాస్తవానికి అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ 1985 లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన విజేత మూవీలో తన నాలుగేళ్ళ వయసులో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసారు అల్లు అర్జున్. ఆ తరువాత మెగాస్టార్ తో కె. విశ్వనాధ్ తీసిన స్వయంకృషిలో కూడా అల్లు అర్జున్ బాలనటుడిగా నటించారు. ఇక కొన్నేళ్ల అనంతరం 2001లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ తీసిన డాడీ మూవీలో ఒక అద్భుతమైన డ్యాన్స్ నెంబర్ తో క్యామియో అఫియరెన్స్ ఇచ్చారు. అప్పట్లో ఆ సీన్ కి థియేటర్స్ లో అల్లు అర్జున్ డ్యాన్స్ కి మంచి అప్లాజ్ లభించింది. 


2. ఇక నటుడిగా ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప క్రేజ్ తో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఇండియా వైడ్ ప్రముఖ సంస్థ ఫోర్బ్స్ వారు ప్రకటించిన టాప్ 100 సెలబ్రిటీస్ లో స్థానం సంపాదించారు. ముఖ్యంగా నటుడిగా మంచి పేరుతో పాటు ఒక్కో సినిమాతో హీరోగా తన మార్కెట్ వాల్యూ ని పెంచుకుంటూ వెళ్తున్నారు అల్లు అర్జున్. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ విధంగా అందరికీ అల్లు అర్జున్ అంతగా చేరువయ్యారు. 

స్టైలిష్ స్టార్ కెరీర్ వెనుక దాగిన నిజాలు


3. ఇటీవల త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో మూవీతో భారీ విజయం అందుకున్న అల్లు అర్జున్, అనంతరం పుష్ప ది రైజ్ సక్సెస్ తో మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇటీవల పుష్ప ది రైజ్ తో అత్యద్భుత విజయం అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ అందుకున్నారు. అందులో రెండు పాన్ ఇండియన్ మూవీస్ తో ముఖ్యంగా పుష్ప 2 మూవీతో భారీ పాన్ ఇండియన్ సక్సెస్ మూవీ బాహుబలి 2 కి దగ్గరగా బాక్సాఫీస్ కలెక్షన్ సొంతం చేసుకున్నారు. 


4. కాగా పుష్ప 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ తో పాటు పలు ఇతర ప్రాంతాలు మాత్రమే కాదు మరీ ముఖ్యంగా నార్త్ లో మరింతగా అదరగొట్టింది. అల్లు అర్జున్ సూపర్ యాక్టింగ్ తో పాటు సుకుమార్ టేకింగ్ కి హిందీ ఆడియన్స్ ఎంతో ఫిదా అయ్యారు. నార్త్ థియేటర్స్ లో అదరగొట్టిన పుష్ప ది రైజ్ మూవీ ఏకంగా బాలీవుడ్ మూవీస్ అన్నిటినీ కూడా తలదన్ని ఏకంగా ఇండియా వైడ్ అత్యధిక నెట్ కలెక్షన్ అందుకున్న టాప్ మూవీగా కొనసాగుతోంది. 


5. అలానే ఏకంగా మన భారత దేశ ప్రభుత్వం నుండి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తెలుగు నటుడిగా నిలిచారు అల్లు అర్జున్. ఆయన నటించిన పుష్ప పార్ట్ 1 మూవీ అటు బాక్సాఫీస్ వద్ద ఎంతో బాగా ఆకట్టుకునే విషయం తెలిసిందే. అలానే హీరోగా పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనబరిచిన సహజ నటన ఆడియన్స్ తో పాటు విమర్శకులని సైతం ఎంతో అలరించింది. పుష్ప 
తగ్గేదేలే అంటూ ఆయన చెప్పే మ్యానరిజం డైలాగ్ సైతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. 


6. ఇక తన సినిమాల సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ గురించి కూడా ఓపెంగ్ గా మాట్లాడతారు అల్లు అర్జున్. వాస్తవానికి తన నుండి వచ్చిన ఏదైనా మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిందంటే అది పూర్తిగా తన తప్పని ఆయన అంటారు. తాను ఒప్పుకోకుంటే ఆ ప్రాజక్ట్ తెరకెక్కేది కాదు కదా అంటారు. అలానే ఏదైనా తన మూవీ బాగా సక్సెస్ అయితే అది టీమ్ వర్క్ ఫలితం అని, దానిని అందరితో పంచుకుంటారు అల్లు అర్జున్. 

Allu Arjun Personal Life Stories


7. ఇక నటుడిగా ఎంత పెద్ద ఎత్తుకి ఎదిగినప్పటికీ తన తాతయ్య దింవంగత కమెడియన్ అల్లు రామలింగయ్యతో పాటు తండ్రి అల్లు అర్జున్, మావయ్య మెగాస్టార్ చిరంజీవి గార్ల గురించి ఎంతో గొప్పగా చెప్తారు అల్లు అర్జున్. తాను ఎప్పటికీ మూలాలు మర్చిపోనని, తనకు లభిస్తున్న ప్రతి సక్సెస్ కోట్లాదిమంది ఆడియన్స్, ఫ్యాన్స్ యొక్క ఆదరణతో వచ్చిందని చెప్పే అల్లు అర్జున్, తనకు లభించే అవార్డులని ఫ్యాన్స్ కి ముఖ్యంగా అల్లు అర్జున్ ఆర్మీకి అంకితం చేసినవి చూసాము. 


8. అయితే ఎక్కువగా తనకు తన సినీ వర్క్ మీదనే సమయం కేటాయించే అల్ల్లు అర్జున్, ఒకవేళ ఖాళీ దొరికితే ఎక్కువగా ఫ్యామిలీ తోనే టైంని గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఎక్కువగా తన సినిమాల షూటింగ్స్ గ్యాప్ లభిస్తే హ్యాపీగా ఫ్యామిలీని తీసుకుని విదేశాలకు అల్లు అర్జున్ టూర్స్ వెళ్తుంటారు. తన భార్య స్నేహా రెడ్డి తనకు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటారని, ఫ్యామిలీ సపోర్ట్, హ్యాపీనెస్ ఉంటె మనిషి ఎంతటి పని సుసాధ్యం చేయవచ్చని ఆయన అంటారు. 


9. తన కెరీర్ లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అల్లు అర్జున్, ప్రత్యేకంగా గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాలో నటించారు. అందులో ఆయన పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకు పలికిన డైలాగ్స్, మ్యానరిజమ్స్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన రుద్రమదేవి మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాగా అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర మంచి ప్లస్ పాయింట్ గా నిలిచి బాగా కలెక్షన్ రాబట్టింది. 


10. నటుడిగా ఒక్కో సినిమాతో ఎంతో ఉన్నత స్థాయికి దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ప్రత్యేకంగా తన కోసం ఒక స్పెషల్ వ్యానిటీ వ్యాన్ డిజైన్ చేయించారు. అప్పట్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచిన ఆ వ్యాన్ యొక్క ఖరీదు దాదాపుగా రూ. 7 కోట్లవరకు ఉంటుందని, షూటింగ్స్ సమయంలో పలు లొకేషన్స్ లో ఇబ్బంది లేకుండా ఆయన దానిని ప్రత్యేకంగా పలువురు నిపుణులతో డిజైన్ చేయించారట. కాగా దాని మీద AA అంటూ అల్లు అర్జున్ బ్రాండ్ లోగో కూడా ఉండడం చూడవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow