Hari Hara Veera Mallu Trailer Review – Pawan Kalyan Steals The Show
Hari Hara Veera Mallu trailer highlights: Pawan Kalyan’s royal look, epic action & dialogues promise a mass feast. Read our Telugu trailer review

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మొత్తం మూడు సినిమాల్లో హరి హర వీర మల్లు ఒకటి. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఓజి ఒక మూవీ కాగా మరొకటి హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వేరొకరి. అయితే వీటిలో హరి హర వీర మల్లు ముందుగా ఆడియన్స్ ముందుకి రానుండగా దాని అనంతరం ఓజి, ఆపైన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుంది.
అయితే వీటిలో ఓజి మూవీ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీగా రూపొందుతుండగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇక హిస్టారికల్ పాన్ ఇండియన్ మూవీ హరి హర వీర మల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం గ్రాండ్ గా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
హరి హర వీర మల్లు ట్రైలర్ సమీక్ష – పవన్ కళ్యాణ్ మెస్మరైజింగ్ లుక్
మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఆనిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర చేస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, అనసూయ భరద్వాజ్, పూజితా పొన్నాడ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడితో కలిసి ఏ ఎం రత్నం గ్రాండ్ గా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా జ్ఞానశేఖర్ వి ఎస్, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు. అయితే సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం కాకుండా మంచి ప్రాధాన్యత కలిగిన పాత్ర చేస్తున్నారని, తప్పకుండా అది ఆడియన్స్ తో పాటు ఆమె ఫ్యాన్స్ ని కూడా ఎంతో అలరిస్తుందని చెప్తున్నారు.
ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకుని ఆపైన రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్స్, అలానే సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మరింతగా మూవీ పై ఇంట్రెస్ట్ ఏర్పరిచాయి. దాదాపుగా పవన్ కళ్యాణ్ నుండి సినిమా వచ్చి మూడేళ్లవుతుండడంతో పాటు అజ్ఞాతవాసి అనంతరం ఆయన నుండి డైరెక్ట్ మూవీ కావడంతో హరి హర వీర మల్లు కోసం ఆయన ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఉన్నారు.
ట్రైలర్ హైలైట్స్: యాక్షన్, మ్యూజిక్, పవన్ డైలాగ్స్ అదిరిపోయాయి
ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గజదొంగ పాత్ర చేస్తుండగా ఆయన పాత్ర అదిరిపోతుందని చెప్తోంది టీమ్. అలానే దర్శకులు ఇద్దరూ కూడా ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారట. వాస్తవానికి మొత్తంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు మూవీ యొక్క సెకండ్ పార్టీ యొక్క లీడ్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో అద్భుతంగా కుదిరిందని, ఆ సీన్స్ కి థియేటర్స్ లో గూస్ బంప్స్ ఖాయం అంటున్నారు.
కాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన హరి హర వీర మల్లు పార్ట్ 1 మూవీ ఫైనల్ గా రిలీజ్ డేట్ ని జులై 24 గా ఫిక్స్ చేసుకుంది. అయితే ఇకపై రిలీజ్ డేట్ లో ఏమాత్రం మార్పు ఉండదని టీమ్ మరొక్కసారి క్లారిఫై చేసింది. దర్శకుల దగ్గరి నుండి ప్రతి ఒక్క విభాగం వారు కూడా మూవీ పై ఎప్పటి నుండో ఎంతో కష్టపడుతున్నారట.
Hari Hara Veera Mallu Updates
సంగీత దర్శకుడు కీరవాణి సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై మరింతగా శ్రద్ధ పెట్టారని, గ్రాండ్ అవుట్పుట్ తో మూవీ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అని సమాచారం. ఇక ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని జులై 4న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. అలానే అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయబడ్డ థియేటర్స్ లో కూడా దీనిని ఫ్యాన్స్ సమక్షంలో ముందుగా అందించనున్నారు.
మరోవైపు దీని కోసం హరి హర వీర మల్లు టీమ్ ఇప్పటికే పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ మూవీ యొక్క ట్రైలర్ కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశారట టీమ్. కొద్దిసేపటి క్రితం దర్శకనిర్మాతలతో కలిసి దానిని ప్రత్యేకంగా చూసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారిని ఎంతో అభినందించారట.
ఫ్యాన్స్ రియాక్షన్స్, సోషల్ మీడియాలో ట్రెండ్స్
దాదాపుగా రెండున్నర నిమిషాల నిడివి గల హరి హర వీర మల్లు ట్రైలర్ లో యాక్షన్ కమర్షియల్ అంశాలతో పాటు గ్రాండియర్ విజువల్స్, ఫైట్స్ వంటివి అదిరిపోతాయని అంటున్నారు. అలానే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారికల్ యోధుడి స్టైల్ కాస్ట్యూమ్స్ తో పాటు ఆయన చేసే యాక్షన్ సీన్స్, పలికే డైలాగ్స్ తప్పకుండ మూవీ పై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెంచడం ఖాయం అంటున్నారు.
ఇక సినిమాటోగ్రాఫర్ తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందించారని అంటున్నారు. మొత్తంగా అయితే దీనిని బట్టి హరి హర వీర మల్లు ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ పై అమాంతం హైప్ పీక్స్ కి వెళ్లడం ఖాయం అని అర్ధం అవుతోంది. అయితే ఆ హైప్ ని అందుకుని తమ మూవీ అటు ఆడియన్స్ ని ఇటు పవన్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకోవడం తథ్యం అని టీమ్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Hari Hara Veera Mallu Review
అయితే ట్రైలర్ రిలీజ్ తరువాత మూవీకి సంబంధించి ఒక్కొక్కటిగా అప్ డేట్ ని అందించడం తో పాటు మిగిలిన ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారట. మరోవైపు హరి హర వీర మల్లు బిజినెస్ డీల్స్ కూడా వేగంగా జరుగుతుండడంతో ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అందరిలో మంచి హైప్ ఏర్పర్చిన ఈ మావోయి రిలీజ్ తరువాత ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో ఎంత మేర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.
What's Your Reaction?






