Guardian Movie Review (Telugu): Hansika's Horror Thriller Now Streaming on Aha
Read the Telugu review of Hansika Motwani's horror thriller 'Guardian', now streaming on Aha. Explore the plot, performances, and audience reactions.

సినిమా పేరు : గార్డియన్ (Guardian)
ఓటిటి విడుదల తేదీ : 26 మార్చి 2025
ఓటిటి మధ్యమం : ఆహా ఓటిటి (Aha OTT)
నటీనటులు : హన్సిక మోత్వానీ, సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్, బేబీ కృషితా, రాజేంద్రన్, ప్రదీప్ బెనెట్టో రాయన్, టైగర్ గార్డెన్ తంగదురై, అభిషేక్ వినోద్, ఎం జె శ్రీరామ్ తదితరులు
దర్శకులు : గురు శరవణన్, శబరి
నిర్మాత : విజయ్ చందర్
సంగీతం : సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ : కె ఏ శక్తివేల్
ఎడిటర్ : ఎం త్యాగరాజన్
రేటింగ్ : 2. 5 / 5
గార్డియన్ మూవీ రివ్యూ: హన్సిక మోత్వానీ హారర్ థ్రిల్లర్
అందాల కథానాయిక హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ హర్రర్ యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ గార్డియన్. ఈ మూవీని యువ దర్శకుడు గురు శరవణన్ శబరి తెరకెక్కించారు. గత ఏడాది మార్చి 8 న తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాగానే విజయవంతం అయింది. ఈ మూవీలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్, రాజేంద్రన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతం అందించారు.
అయితే ఏడాది అనంతరం ఓటిటిలోకి వచ్చిన ఈమూవీ తాజాగా తెలుగులో ప్రముఖ ఓటిటి మాధ్యమం ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ఈ మూవీ ఓటిటిలో బాగానే రెస్పాన్స్ అందుకుంటోంది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
యువతి అయిన అపర్ణ (Hansika Motwani) ని అందరూ కూడా అన్ లక్కీ అపర్ణ అంటూ ఏడిపిస్తుంటారు. దానికి ప్రధాన కారణం పాపం చిన్నప్పటి నుండి అపర్ణ కోరుకున్నది ఏది కూడా ఆమెకు దక్కకపోవడం. ఎంతో ప్రాణాన్మ్గా ప్రేమించిన ప్రభ ఆమె నుండి దూరరమవుతాడు.
తన కాలేజీ విద్యని పూర్తి అనంతరం ఆర్కిటెచర్ అయిన అపర్ణకు జాబ్ కూడా రాదు. ఎంత ప్రయత్నించినప్పటికీ తనకు జాబ్ రాకపోవడంతో అనంతరం తన ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా అక్కడి ఒక కంస్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరకు రావడం, అక్కడే అంకు అనుకోకుండా ఒక మెరుపు రంగు రాయి దొరకడం జరుగుతుంది.
దానితో ఒక్కసారిగా అపర్ణ జాతకం మొత్తం కూడా మారిపోతుంది. వెంటనే ఆమెకు పెద్ద కంస్ట్రక్షన్ కంపెనీలో జాబ్ రావడంతో పాటు ఆమె కోరుకున్నవి అన్ని కూడా వెంటనే జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా తాను ప్రేమించిన ప్రభ కూడా వెనక్కి తిరిగివస్తాడు.
అనంతరం కొన్ని సంఘటనల కారణంగా తన కంపెనీ ప్రాజక్ట్ మేనేజర్ తో పాటు కంపెనీ హెడ్ తమ్ముడు కూడా చనిపోవాలని కోరుకుంటుంది అపర్ణ. అనంతరం వారిద్దరూ కూడా ఆమె కాళ్ళ ముందే దారుణంగా చనిపోతారు. అసలు ఆ మెరుపు రంగు రాయిలో ఏమి ఉంది, అపర్ణ కోరిన వెంటనే అన్ని ఎందుకు జరిగిపోతున్నాయి, ఆ రాయి వెనుక ఏదైనా రహస్యం ఉందా, ఆమెకు సైకాలజిస్ట్ రుద్రన్ పరిష్కారం చూపాడా, ఆపై అపర్ణ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది, కథ ఏ విధంగా ముందుకు సాగిందనేది మొత్తం కూడా మనం వెండితెరపై చూడాల్సిందే.
గార్డియన్ మూవీ కథా సారాంశం మరియు నటన విశ్లేషణ
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా అపర్ణ పాత్రలో ఆకట్టుకునే నటి హన్సిక మొత్వానీ తన పాత్రలో ఆడియన్స్ ని అలరించారు అని చెప్పాలి. గతంలో కూడా ఇటువంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసి తన అందంతోనే కాదు అభినయంతో కూడా అందరినీ అలరించే నటిగా మరొక్కసారి గార్డియన్ లో అపర్ణ పాత్ర ద్వారా ప్రూవ్ చేసుకున్నారు హన్సిక.
ఇక ఇతర కీలక పాత్రలు చేసిన శ్రీమాన్, సురేష్ చంద్రమీనన్, బేబీ కృషితా సహా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా మూవీలో హర్రర్ తో పాటు అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ లో కూడా ఆయా పాత్రధారుల యొక్క నటన బాగుంది.
కథ కథనాల విషయం ప్రక్కన పెడితే నటీనటుల నుండి సందర్భం సన్నివేశాల పరంగా దర్శకుడు వారి నుండి అలరించే నటనని రాబట్టారు. సాధారణంగా దెయ్యం సినిమాల్లో చనిపోయిన ప్రేతాత్మని ఏదైనా గాజు సీసాలో బంధించడం చూస్తుంటాం, అయితే ఈ మూవీలో మాత్రం దానిని రంగురాయిలో బంధించడం చూడవచ్చు.
విశ్లేషణ :
వాస్తవంగా ఇటువంటి రివెంజ్ హర్రర్ డ్రామా స్టోరీలు గతంలో ఎప్పటి నుండి మనం చూస్థున్నవే. ఒక వ్యక్తిని కొందరు కక్షగట్టి చంపడం, అనంతరం ఆ మరణించిన వ్యక్తి దెయ్యంగా మారి తిరిగి తనను చంపినా వారి పై ప్రతీకారం తీర్చుకోవడం అనేది కొంత అంశం కాదు.
అయితే తన కథకు ఇదే రొటీన్ అంశాన్ని తీసుకున్న దర్శక ద్వయం గురు శరవణన్, శబరి కథనాన్ని అంత ఆసక్తికరంగా అయితే నడపలేకపోయారు. ప్రత్యేకించి ఇటువంటి హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ కి ఒకింత ఆసక్తితో ఇంట్రెస్టింగ్ గా సాగె స్క్రీన్ ప్లే అవసరం, అలానే మధ్యలో కొద్దిపాటి ట్విస్టులు ఉంటె ఆడియన్స్ కథ, కథనాలకు కనెక్ట్ అవుతారు. అయితే చాలావరకు ఆ విధంగా మూవీని నడిపించడంలో దర్శకద్వయం విఫలం అయ్యారు.
రివెంజ్ అంశం అని తెలియగానే మనకు చాలా వరకు కథ తెలిసిపోతూ ఉంటుంది. అయితే మధ్యలో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. మొత్తంగా అయితే గార్డియన్ మూవీ పర్వాలేదనిపిస్తుంది అంతే. అయితే సినిమాలో విజువల్స్ బాగానే ఉన్నాయి. ఇక సామ్ సీఎస్ అందించిన సాంగ్స్ పర్వాలేదంతే. అయితే సినిమాకి ఖర్చు మేరకు నిర్మాతల నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.
ఆహా లో స్ట్రీమింగ్ మరియు ప్రేక్షకుల స్పందనలు
ప్లస్ పాయింట్స్ :
హన్సిక మోత్వానీ నటన
కొన్ని హర్రర్ సీన్స్
ఫోటోగ్రఫి
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
ఊహించే విధంగా సాగె కథనం
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
తీర్పు :
మొత్తంగా తాజాగా తెలుగు ఓటిటి మాధ్యమం ఆహాలో ఆడియన్స్ ముందుకి వచ్చిన లేటెస్ట్ హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గార్డియన్ కేవలం ఆడియన్స్ ని పర్వాలేదనిపించే తీరున మాత్రమే ,ఆకట్టుకుంటుందంతే. ముఖ్యంగా హీరోయిన్ హన్సిక మోత్వానీ, ఇతర కీలక పాత్రధారుల యొక్క నటన, అక్కడక్కడా కొంత హర్రర్ సీన్స్, ఫోటోగ్రఫి తప్ప పెద్దగా ఇతర అంశాలు ఏవి ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. అయితే ఈవారం తమ ఫ్యామిలీతో కలిసి సరదాగా ఓటిటిలో ఒక మూవీ చూసేయాలి అనుకునేవారు ఒక లుక్ అయితే వేయొచ్చు.
What's Your Reaction?






