First Six Pack Hero in Tollywood: Actor Name and Fitness Journey
Discover who introduced six-pack abs trend in Tollywood! Know the actor's journey, fitness secrets, and his impact on Telugu cinema.

తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ కి తగ్గట్లుగా స్టార్స్ వ్యవహరిస్తూ ఆడియన్స్, ఫ్యాన్స్ లో తమకంటూ ప్రత్యేక క్రేజ్ అందుకుంటూ కొనసాగుతుంటారు. ఆ విధంగా ఎన్నో క్రితం స్టార్స్ లో క్రేజీ గా ఏర్పడింది సిక్స్ ప్యాక్ ట్రెండ్. వాస్తవానికి ఎన్నో ఏళ్ళ క్రితం ఈ సిక్స్ ప్యాక్ ట్రెండ్ ని పలువురు స్టార్ నటులు తమ సినిమాల్లో వినియోగించి బాగా పేరు, క్రేజ్ అందుకున్నారు.
అయితే అసలు ఈ ట్రెండ్ తెలుగు సినిమాల్లో ఎవరు మొదలెట్టారు, ఎవరి ద్వారా మన సినిమాల్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ ప్రాచుర్యంలోకి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.అయితే ఈ ట్రెండ్ ని బాగా యువతలో అప్పటి సినీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తీసుకువచ్చింది అల్లు అర్జున్ అని చెప్పాలి.
టాలీవుడ్‌లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో ఎవరు?
నిజానికి ఆయన చేసిన దేశముదురు మూవీ ద్వారా సిక్స్ ప్యాక్స్ అనేవి ఆడియన్స్, ఫ్యాన్స్ లో కూడా ఒక సరికొత్త క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇక టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఒక్కో సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా భారీ క్రేజ్, మార్కెట్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
సిక్స్ ప్యాక్ సాధన కథ మరియు ఇన్‌స్పిరేషన్
తొలిసారిగా 2007 జనవరిలో రిలీజ్ అయిన దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీని చూసిన అనేకమంది ప్రసంశలు కురిపించారు. ఎందుకంటే ఆ విధంగా కష్టపడి అది సాధించడం మాములు విషయం కాదని పలువురు ఇతర సినీ నటులు సైతం అప్పట్లో అల్లు అర్జున్ ని పొగిడారు. ముఖ్యంగా దేశముదురులో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీని దర్శకుడు పూరి జగన్నాథ్ పలు సీన్స్, ఫైట్స్, సాంగ్స్ లో బాగా చూపించారు.
బయట పలువురు ఆడియన్స్ సైతం అల్లు అర్జున్ సిక్స్ పాక్ కోసం పడిన శ్రమని మెచ్చుకున్నారు. అయితే అంతకముందు కొన్నేళ్ల నుండి ఈ ట్రెండ్ అనేది అందరికీ తెలిసినప్పటికీ మన సినిమాలో దీనికి బీజం వేసి ట్రెండ్ సెట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాను ఆ బాడీ కోసం చాలా కష్టపడ్డానని, పక్కాగా టైం టు టైం జిం చేయడంతో పాటు పక్కాగా డైట్ తీసుకోవడం కూడా మెయింటెయిన్ చేసినట్లు చెప్పుకొచ్చారు అల్లు అర్జున్
టాలీవుడ్ మీద సిక్స్ ప్యాక్ ప్రభావం
ముఖ్యంగా హీరోయిన్ తో మంచి డ్యూయెట్స్ తో పాటు షడ్ సాంగ్స్ విషయంలో పలువురు డైరెక్టర్స్ హీరోల యొక్క సిక్స్ ప్యాక్స్ ని వాడుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సైతం అప్పట్లో ఈ ట్రెండ్ ని పాటించి తమ సినిమాల ద్వారా ఫ్యాన్స్ ని అలరించారు.
ఇక మన తెలుగులో కూడా పలువురు స్టార్స్ తో పాటు కమెడియన్ సునీల్ వంటి వారు కూడా పాటించారు. అయితే రాను రాను ఈ ట్రెండ్ అనేది సినిమాల్లో మెల్లగా సర్వసాధారణం అయింది. అప్ కమింగ్ హీరోస్ సైతం ఈ ట్రెండ్ ని ఫాలో అవుతుండడంతో ఆడియన్స్ కూడా దీనికి అలవాటు పడిపోయారు.
What's Your Reaction?






