F1 Movie Review in Telugu – A High-Speed Hollywood Thriller
Check out the Telugu review of the Hollywood F1 movie. A gripping racing drama filled with speed, emotion, and edge-of-the-seat moments

F1 మూవీ రివ్యూ తెలుగు : ఆకట్టుకునే రేసి యాక్షన్ డ్రామా
సినిమా పేరు : F1 Film 2025
విడుదల తేదీ : 2025 జూన్ 27
నటీనటులు : బ్రాడ్ పిట్, డామ్సన్ ఐడ్రిస్, కెర్రీ కాండాన్, జేవియర్ బార్డమ్, జేవియర్ మెంజీస్, కిమ్ బోడ్నియా తదితరులు
దర్శకుడు : జోసెఫ్ కోసిన్స్కి
నిర్మాతలు : జార్రీ బ్రక్హీమర్, జోసెఫ్ కోసిన్స్కి, లేవీస్ హామిల్టన్, బ్రాడ్ పిట్, డేడ్ గార్డెనర్, జెరేమి క్లెనర్ చాడ్ ఓమన్
సంగీతం : హ్యాన్స్ జిమ్మర్
సినిమాటోగ్రఫీ : క్లాడియో మిరిండా
రేటింగ్ : 3. 5 / 5
హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ హీరోగా ఫార్ములా వన్ రేస్ నేపథ్యంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ మూవీ f1. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. టాప్ గన్ మ్యావరిక్ దర్శకుడు జోసెఫ్ కిసిన్స్కి తెరకెక్కించిన ఈ మూవీ పై హాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. మన ఇండియాలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంది, ఏ స్థాయిలో కథ కథనాలతో మెప్పించింది అనేది మొత్తం ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం.
F1 మూవీ సమీక్ష – వేగంతో నిండిన హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్
కథ :
ముందుగా ఫార్ములా వన్ రేస్ లో డ్రైవర్ గా మంచి పేరు అందుకున్న సన్నీ హేయస్ (Brad Pitt) తాత్కాలితంగా తన కెరీర్ కి రిటైర్మెంట్ తీసుకుని తప్పుకుంటాడు. అనంతరం ఒక వ్యాన్ డ్రైవర్ గా వర్క్ చేస్తూ పలు ప్రాంతాలు పర్యటిస్తూ ఉంటాడు. అయితే మెల్లగా వయసు మీద పడుతున్నప్పటికీ అదే వృత్తిలో కొనసాగుతున్న అతడికి సడన్ గా APXGP అనే రేస్ టీమ్ లో వర్క్ చేయాలని స్నేహితుడు అతడిని కలిసి కోరతాడు. అయితే కొంత ఆలోచన చేసిన అనంతరం అతడి ఆహ్వానాన్ని మన్నించిన హేయస్ నేటి టెక్నాలజీ నేపథ్యంలో రేసింగ్ డ్రైవర్ గా కొన్ని సమస్యలు మాత్రం ఎదురుకొంటాడు.
F1 Movie Review
మరీ ముఖ్యంగా ఆ టీమ్ లో యువ రేసింగ్ డ్రైవర్ అయిన జోషువా పియర్స్ (Damson Idris) యొక్క దూకుడుని ఎదుర్కోవడంతో పాటు అతడి నుండి కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొంటాడు. మరి స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తరువాత సన్నీ హేయస్ ఎందుకు సడన్ గా తన రేసింగ్ వృత్తి నుండి తాత్కాలిక రిటైర్మెంట్ తీసుకున్నాడు, ఎందుకు వ్యాన్ డ్రైవర్ గా మారాడు, అనంతరం వచ్చిన APXGP టీమ్ లో ఏ విధంగా కొనసాగి ఫైనల్ గా ఏ విధమైన శ్రమతో ఫార్ములా వన్ టైటిల్ గెలుచుకున్నాడు అనేది మొత్తం కూడా మూవీ తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీలో సన్నీ హేయస్ పాత్రలో బ్రాడ్ పిట్ నటన నిజంగా నభూతో నభవిష్యతి అనిపిస్తుంది. ప్రతి సన్నివేశంలో నటన ఎంతో బాగుండడంతో పాటు రేసర్ గా మరోవైపు ఆరోగ్య పరంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకుని గత జీవితం పరిస్థితులు నెమరు వేసుకుంటూ ఫైనల్ గా విజేత నిలవడంలో అనేక సీన్స్ లో ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన డామ్సన్ ఐడ్రిస్, కెర్రీ కాండాన్, జేవియర్ బాన్డమ్, జేవియర్ మెంజీస్ తదితరులు తమ తమ పాత్రల్లో ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అలరించారు.
కథ, దర్శకత్వం, విజువల్స్ విశ్లేషణ
సినిమాలో కీలకమైన ప్రతి పాత్ర మనకు గుర్తుండిపోతుంది. అంతకముందు టాప్ గన్ మ్యావరిక్ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తీసిన జోసెఫ్ కోసిన్స్కి ఎఫ్ 1 మూవీతో మరొక్కసారి అలరించే కథ, కథనాలతో ఆకట్టుకున్నారు. కొన్ని ట్విస్ట్ లు టర్న్ లతో పాటు ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రేసిగా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాగున్నాయి. కీలమైన ఫైనల్ రేస్ లో చూపించిన ఎఫ్ 1 రేస్ సీన్స్ తో పాటు హీరో బ్రాడ్ పిట్ నటన ఎమోషనల్ సీన్స్ హృద్యంగా ఉంటాయి.
F1 Movie Review Telugu
మైనస్ పాయింట్స్ :
వాస్తవానికి ఇటువంటి స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీస్ లో ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ అంశాలు ఆశించలేము. అయితే హీరోగా చేసిన బ్రాడ్ పిట్ పాత్రలో అక్కడక్కడా కొంత ఫన్ ఆకట్టుకుంటుంది. అయితే కథను, క్యారెక్టర్స్ ని ఎమోషన్స్ ని చెప్పడానికి దర్శకుడు జోసెఫ్ ఒకింత ఎక్కువనే సమయం తీసుకున్నాడు. అయితే ఎక్కువగా విజువల్ డ్రామాగా కాకుండా డైలాగ్ డ్రామాగా సాగిన ఈ సినిమా అందరికీ అనగా అన్ని వర్గ్లా ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఒకింత రేసీగా సాగిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో కొద్దిపాటి నెమ్మదిగా సాగుతుంది. ఐతే మధ్యలో వచ్చే ట్విస్టులు కథ యొక్క పట్టుని బిగించేలా చేస్తాయి.
సాంకేతిక విభాగం :
ఇక ఎఫ్ 1 మూవీ యొక్క సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ముఖ్యంగా దర్శకుడు కథ కథనాలను ఆద్యంతం ఆకట్టుకునే రీతిన నడపడంలో చాలా వరకు సఫలీకృతం అయ్యాడు. యాక్షన్ ఎమోషన్స్ ఫీల్ గుడ్ మూమెంట్స్ తో సినిమా అందరినీ అలరిస్తుంది. ఇటువంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి విజువల్స్ ఎంతో ముఖ్యం, వాటిని సినిమాటోగ్రాఫర్ క్లాడియో మిరిండా ఎంతో అద్భుతంగా ప్రెజంట్ చేసారు. ఇక కీలక ఫార్ములా వన్ రేసింగ్ సీన్స్ అయితే మనల్ని ఆయా పాత్రలతో కలిసి ప్రయాణం చేసేలా చేస్తాయి. సంగీత దర్శకుడు హ్యాన్స్ జిమ్మర్ అందించిన పలు సీన్స్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు నిర్మాతల యొక్క గ్రాండ్ నిర్మాణ విలువలు మూవీకి రిచ్ లుక్ ని అందిస్తాయి. అలానే ఎడిటింగ్ విభాగం యొక్క పనితీరు కూడా ఎంతో బాగుంది.
తెలుగు ప్రేక్షకుల అభిప్రాయాలు & అనుభూతులు
తీర్పు :
మొత్తంగా అందరిలో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన స్పోర్ట్స్ యాక్షన్ ఎమోషనల్ మూవీ ఎఫ్ 1 ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. హీరో బ్రాడ్ పిట్ సహజ నటనతో పాటు ఇతర కీలక పాత్రధారుల యొక్క పెర్ఫార్మన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సీన్స్, రేసీ సన్నివేశాలు, పలు ట్విస్టులు మొత్తంగా సినిమాలో ప్రధాన బలాలుగా నిలుస్తాయి. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు విజువల్స్ కూడా ఎంతో బాగున్నాయి. అయితే అక్కడక్కడా కొంత నెమ్మదించిన కథనం తో పాటు పూర్తిగా ఒక పాయింట్ మీద సాగె మూవీ కావడంతో కొంత ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవుతుంది. కానీ ఓవరాల్ గా ఈవారం మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎఫ్ 1 మూవీ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
F1 Movie Public Talk Telugu
What's Your Reaction?






