Kannappa Telugu Movie Review – Vishnu Manchu’s Devotional Action Spectacle

Kannappa Telugu Movie Review: Vishnu Manchu brings the mythological warrior to life in this high-budget epic. Read the full review, rating, and audience talk

Kannappa Telugu Movie Review – Vishnu Manchu’s Devotional Action Spectacle

సినిమా పేరు : కన్నప్ప (Kannappa)

విడుదల తేదీ : 27-6-2025 

తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ రేటింగ్ : 3.5 / 5

నటీనటులు : మంచు విష్ణు, ప్రీతీ ముకుందన్, మంచు మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ 
తదితరులు

దర్శకుడు : ముకేశ్ కుమార్ సింగ్ 

సంగీతం : స్టీఫెన్ దేవసి 

సినిమాటోగ్రఫీ : షెల్డన్ చావ్ 

Kannappa Movie Review  

మంచు విష్ణు హీరోగా ప్రీతీ ముకుందన్ ఆయనకు జోడీగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మైథలాజికల్ డివోషనల్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. ఈ మూవీని స్వయంగా హీరో మంచు విష్ణు తన ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థల పై ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, అందాల నటి కాజల్ అగర్వాల్, మలయాళ స్టార్ యాక్టర్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ కుమార్, శరత్ కుమార్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం సహా మరికొందరు నటీనటులు కీలక పాత్రలు చేసారు.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన కన్నప్ప మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకుని ఆపైన రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. మొత్తంగా నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం. 

కన్నప్ప మూవీ సమీక్ష – విష్ణు మంచు మాయాజాలం ఎంతవరకు సక్సెస్?

కథ

చిన్నప్పటి నుండి నాస్తికుడిగా పెరిగిన గిరిజనుడైన తిన్నడు అనంతరం శివభక్తుడిగా ఎలా మారిపోయాడు, ఆ పరమశివుని దివ్యాశీస్సులు ఎలా అందుకున్నాడు అనేటువంటి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర నుండి ప్రేరణ పొందిన తమ పురాతన ఆచారాలతో కథ సాగడం, అనంతరం తిన్నడు తమ గ్రామంలోని అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవడం అనే అంశాలతో సాగుతుంది. కన్నప్ప పురాణ భక్తి యొక్క ఆధ్యాత్మిక సారాంశాన్ని, తిన్నడు నుండి భక్త కన్నప్పగా ఎలా అతడు మారాడు అనే ప్రయాణమే ఈ మూవీ యొక్క అసలు మూల కథా పాయింట్. 

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ మూవీలో కన్నప్ప గా నటించిన మంచు విష్ణు నటన బాగుంది. పలు యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు. సినిమాలోని ఆఖరి 20 నిముషాలు నటుడిగా అతడి స్థాయిని ఎంతో పెంచాయి. ఇక ఆయనకు జోడీగా ప్రీతి ముకుందన్ కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మహాశివుని పాత్రలో నటించిన అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా నటించిన కాజల్ అగర్వాల్, ఇతర కీలక పాత్రలు చేసిన మోహన్ బాబు, మోహన్ లాల్ సహా అందరూ కూడా తమ తం పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటనతో అలరించారు.

ఇక రుద్ర గా నటించిన ప్రభాస్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుంది. కన్నప్పతో రుద్ర సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విజువల్స్ తో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కన్నప్ప మూవీకి మరొక రెండు ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన కన్నప్ప మూవీ సెకండ్ హాఫ్ కొంత గడచిన అనంతరం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక చివరి 20 నిముషాలు ఎంతో హృద్యంగా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ బాగానే తెరకెక్కించారు. 

భక్తి, యాక్షన్ కలయికలో వచ్చిన కన్నప్ప – కథా విశ్లేషణ

Kannappa Telugu Review 

మైనస్ పాయింట్స్

సినిమాలో భక్తి అంశాలు, ముఖ్యంగా చివరి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంశాలు అందరినీ ఆకట్టుకున్నప్పటికీ అంతకముందు సినిమా అక్కడక్కడా నెమ్మదిస్తుంది. ముఖ్యంగా కథనాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు ముకేశ్ స్క్రిప్ట్ రాసుకుని ఉంటె బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో కూడా అక్కడక్కడా ఫ్లాట్ గా సాగినా ఓవరాల్ గా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ ఈ మూవీకి కొంత ప్లస్. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే రన్ టైం పరంగా మూవీ ఇంకా బాగా కనెక్ట్ అయి ఉండేది. 

సాంకేతిక విభాగం :

దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ కన్నప్ప దర్శకుడిగా చాలా వరకు అక్కట్టుకున్నారు. అక్కడక్కడా కొంత సినిమా నెమ్మదించడం స్క్రిప్ట్ లో కొద్దిపాటి లోపాలు తప్ప మిగతాది అంత బాగానే నడిపారు. అయితే రన్ టైం కొద్దిగా తగ్గించడంతో పాటు డైలాగ్స్ కూడా మరింత ఎఫెక్టివ్ గా రాసుకుని ఉండాల్సింది అనిపించింది. ముఖ్యంగా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. న్యూజీలాండ్ లో వేసిన సెట్స్, యాక్షన్ సీన్స్ బాగా చూపించారు సినిమాటోగ్రాఫర్. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో మూవీని తీశారు. మనం తెరపై కన్నప్ప మూవీ చూస్తే దాదాపుగా ప్రతి విభాగం సినిమా యొక్క అవుట్పుట్ విషయంలో బాగానే శ్రద్ధ పెట్టి వర్క్ చేసినట్లు అనిపిస్తుంది.

Kannappa Public Talk

తీర్పు

ఓవరాల్ గా మంచి అంచనాల నడుమ మంచు విష్ణు హీరోగా నేడు రిలీజ్ అయిన డివోషనల్ మైథలాజికల్ ఎంటర్టైనర్ పాన్ ఇండియన్ మూవీ కన్నప్ప మంచి టాక్ తో కొనసాగుతోంది. ఫస్ట్ హాప్ బాగున్న ఈ మూవీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ముఖ్యంగా చివరి 20 నిముషాలు అందరినీ మరింతగా అలరిస్తుంది. ఆకట్టుకునే విజువల్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నటీనటుల పెర్ఫార్మన్స్ కన్నప్పకు ప్రధాన బలాలుగా చెప్పవచ్చు. అక్కడక్కడా కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికీ మొత్తంగా కన్నప్ప ని అందరూ చూడవచ్చు. వీలైతే ఈ వెకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి కన్నప్ప మూవీకి థియేటర్స్ లో ఒక లుక్ వేయండి. 

ఓవరాల్ గా కన్నప్ప రివ్యూ ఏంటంటే

Kannappa Audience Response

మరి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ అప్ డేట్స్, రివ్యూస్, బాక్సాఫిస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవ్వండి 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow