Big Shock to Sreeleela: Sudden Twist in Bollywood Movie
Big shock to Sreeleela as unexpected news breaks out about her upcoming bollywood movies, and industry reactions. Full update here.

టాలీవుడ్ యువ కథానాయికల్లో అందాల నటి శ్రీలీల కూడా ఒకరు. తొలిసారిగా ఆమె తెలుగు నటించిన మూవీ పెళ్లి సందడి. సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకా హీరోగా తెరకెక్కిన ఈ మూవీని యువ దర్శకురాలు గౌరి రోణంకి తెరకెక్కించగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేసారు.
Big Shock to Sreeleela in Recent Incident
ఇక ఈ మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ అలరించి మంచి పేరు సొంతం చేసుకున్నారు శ్రీలీల. అనంతరం ఆమెకు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీని త్రినాధరావు నక్కిన తెరకెక్కించారు. అయితే రిలీజ్ అనంతరం ధమాకా మూవీ పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో హీరోయిన్ గా శ్రీలీల మరింత మంచి పేరు సొంతం చేసుకున్నారు.
ఆపైన పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఆమె, అనంతరం టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తీసిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరిలో నటించారు. ఈ మూవీలో నటసింహం బాలకృష్ణ కూతురిగా విజ్జి పాప పాత్రలో ఆకట్టుకున్నారు శ్రీలీల. ఇక ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆమె చేసిన మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన ఈ మూవీలో హీరోయిన్ గా ఆమె ఆకట్టుకున్నారు.
Sreeleela Latest Interesting News
ఈ మూవీ కూడా రిలీజ్ అనంతరం విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత నుండి పలువురు స్టార్స్ సరసన కూడా ఆమె హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఆమె ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. ఇక అటు బాలీవుడ్ లో తాజాగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం డార్జిలింగ్ లో తాజా షెడ్యూల్ జరుపుకుంది. అయితే షూటింగ్ అనంతరం వారు తిరిగి వస్తుండగా అక్కడి స్థానికులు కొందరు కార్తీక్ ఆర్యన్ ని అలానే శ్రీలీల ని చూసేందుకు భారీగా ఫ్యాన్స్ ఎగబడ్డారు.
Sreeleela’s Shocking Update
ఆ సమయంలో వారిద్దరూ అందరికీ అభివాదం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ గుంపులోని ఆకతాయి వ్యక్తులు కొందరు శ్రీలీల చేయి పట్టుకుని ఆమెను లాగారు, అయితే వెంతంటే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను సంరక్షించి ముందుకు తీసుకెళ్లారు. కాగా ఆ ఘటనతో శ్రీలీల పెద్ద షాక్ కి గురయ్యారు.
కాగా ప్రస్తుతం ఆ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ కలిసి చేస్తున్న ఆషికి 3 మూవీకి సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన ఒక వీడియో అందరినీ ఆకట్టుకోగా పూర్తి వివరాలతో పాటు మూవీ గురించిన అప్ డేట్స్ ని త్వరలో ఒక్కొక్కటిగా అందివ్వనున్నారు మూవీ టీం. మరి తొలిసారిగా చేస్తున్న ఈ మూవీతో శ్రీలీల ఎంత మేర విజయం సొంతం చేసుకుంటారో చూడాలి.
What's Your Reaction?






