Who is the Top 1 Telugu Hero? | Latest Tollywood Ranking 2025
Who is the Top 1 Telugu Hero in 2025. Explore Tollywood’s top stars, fan base, box office power, and latest rankings of Telugu cinema heroes.
తెలుగు సినిమా ప్రస్తుతం పాన్ ఇండియన్ స్థాయి నుండి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంటున్న విషయం తెల్సిందే. ఇక తొలితరం టాలీవుడ్ స్టార్ నటుల్లో సిహెచ్ నారాయణరావు, చిత్తూరు నాగయ్య వంటి వారి పేర్లు వినపడేవి. ఇక నాగయ్య అప్పట్లోనే అత్యధిక పారితోషికం అందుకున్న టాప్ నటుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించారు.
అయితే వారి అనంతరం టాలీవుడ్ (Tollywood) కి హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ వచ్చారు. అయితే వీరిలో ముందుగా ఏఎన్నార్ తెలుగు చిత్రరంగ ప్రవేశం చేయగా అనంతరం ఎన్టీఆర్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడి నుండి వీరిద్దరూ కూడా మంచి కథలతో కూడిన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల యొక్క మనసు దోచారు.
అయితే ఎక్కువగా ఎన్టీఆర్ పౌరాణిక, జానపద సినిమాలు చేస్తే ఏఎన్నార్ సాంఘిక కథా చిత్రాలు చేసారు. అయినప్పటికీ కూడా ఇద్దరికీ అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకాభిమానుల్లో మంచి క్రేజ్ ఉండేది. కాగా వీరిద్దరిలో ఎన్టీఆర్ ఒకింత క్రేజ్ విషయంలో పైచేయిగా కొనసాగారు. అయినప్పటికీ కూడా ఏఎన్నార్ ని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు.
ఆయన కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమకి అటు N T Ramarao ఇటు Akkineni Nageswara Rao ఇద్దరూ కూడా రెండు కళ్ళు మాదిరిగా అశేష ప్రేక్షకాభిమానుల యొక్క గుండెల్లో తమ అద్భుత చిత్రాలు, పాత్రలతో మంచి స్థానం సంపాదించి గొప్ప పేరు అందుకున్నారు.
అయితే వీరి అనంతరం నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ Krishna, నటభూషణ Sobhan Babu, రెబల్ స్టార్ Krishnamraju కూడా తమ సినిమాల తో నాటి యువత, మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించారు. కాగా వీరిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకింత యువత, మాస్ లో క్రేజ్ తో తిరుగులేని స్థాయిలో టాప్ స్టార్ గా ఎన్నో ఏళ్ళు కొనసాగగా. ఆ తరువాత కుటుంబ కథా సినిమాలతో శోభన్ బాబు, మాస్ యాక్షన్ సినిమాలతో కృష్ణంరాజు గొప్ప పేరు అందుకున్నారు.
అయితే వీరి అనంతరం వచ్చిన మెగాస్టార్ Chiranjeevi, నటసింహం నందమూరి Balakrishna, కింగ్ Nagarjuna, విక్టరీ Venkatesh కూడా తమ సినిమాలతో ప్రేక్షకులని అలరించారు. కాగా వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఒకింత పైచేయితో కొన్నేళ్ల పాటు టాప్ స్థానంలో కొనసాగగా బాలకృష్ణ కూడా తన మార్క్ యాక్టింగ్ తో కొన్నాళ్ళు టాప్ స్థానంలో కొనసాగారు. ఇక నాగార్జున, వెంకటేష్ లు కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు, క్రేజ్ సొంతం చేసుకుని ఇప్పటికీ మంచి సినిమాలతో కొనసాగుతున్నారు.
ఇక వీరి తరం తరువాత పవర్ స్టార్ Pawan Kalyan, సూపర్ స్టార్ Mahesh Babu, యంగ్ టైగర్ JrNtr, రెబల్ స్టార్ Prabhas, ఐకాన్ స్టార్ Allu Arjun, మెగా పవర్ స్టార్ Ram Charan హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కాగా వీరిలో ముందుగా 1996 పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయం కాగా, ఆ తరువాత మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఒక్కొక్కరుగా హీరోగా పరిచయం అయ్యారు.
ఇక అసలు విషయం ఏమిటంటే, వీరిలో ఎవరు నెంబర్ వన్ హీరో అనే పోటీ ఎప్పటినుండో కొనసాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి చాలా ఏళ్ళ పాటు టాప్ స్టార్ గా కొనసాగిన అనంతరం వచ్చిన పవన్, మహేష్ ల మధ్యన ఈ పోటీ ఎక్కువగా కనపడుతుంది. వాస్తవానికి ఇద్దరికీ కూడా ఎంతో పెద్ద మాస్ కల్ట్ మాస్ క్రేజ్ ఉందనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ ఓపెనింగ్స్ అనే పేరు వినిపించినప్పుడల్లా వీరిద్దరి పేర్లే ప్రధానంగా వినిపిస్తాయి.
ఇప్పటికీ కూడా వీరి క్రేజ్ మరింతగా పెరుగుతూ పోతోంది అంటే వీరిద్దరూ కూడా ప్రారంభం నుండి అన్ని వర్గాల ఆడియన్సు ని ఏ స్థాయిలో మేప్ప్పించారో అర్ధం చేసుకోవచ్చు. ఇక అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ కూడా తమ మార్క్ యాక్టింగ్ తో మెప్పించి పలు వర్గాల ఆడియన్సు యొక్క క్రేజ్ అందుకుని ప్రస్తుతం దూసుకెళ్తున్నారు. మరి వీరిలో పక్కాగా టాప్ నెంబర్ వన్ అనేది మాకు ఉన్న సమాచారం ప్రకారం ఒక్కొక్కరిగా విశ్లేషణలో తెలుసుకుందాం.
2025లో టాప్ 1 తెలుగు హీరో ఎవరు?
ముఖ్యంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీతోనే మంచి విజయం అందుకున్నారు. అనంతరం ఆయన చేసిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. అదే సమయంలో అప్పటి యువ దర్శకడు ఏ కరుణాకరన్ తో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా తొలిప్రేమ అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేయూస్కుంది.
ఈ సినిమా అనంతరం పీఏ అరుణ్ ప్రసాద్ తో పవన్ చేసిన సినిమా తమ్ముడు కూడా బాగానే ఆడింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన బద్రి, ఎస్ జె సూర్య తీసిన ఖుషి సినిమాలు భారీ విజయాలు అందుకుని హీరోగా పవన్ కు పవర్ స్టార్ బిరుదుని అందించాయి. ఇక అక్కడి నుండి ఎంతో విశేషమైన క్రేజ్ అందుకున్న పవన్, ఆ పైన దానిని సరిగ్గా నిలబెట్టుకోలేకపోయారు. అక్కడి నుండి ఆయన చేసిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం ఇలా చాలా వరకు సినిమాలు అన్ని కూడా నిరాశపరిచాయి.
ఆ తరువాత కొన్నేళ్ల అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా ద్వారా పెద్ద విజయం అందుకున్న పవన్, ఆపైన హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మరొక్కసారి త్రివిక్రమ్ తో పవన్ చేసిన అత్తారింటికి దారేది సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి హీరోగా పవన్ కళ్యాణ్ క్రేజ్, మార్కెట్ ని మరింతగా పెంచింది.
ఆపైన పవన్ మళ్ళి సరైన విజయాలు అందుకోలేకపోయారు. 2018లో అజ్ఞాతవాసి మూవీతో హీరోగా కొన్నాళ్ల పాటు కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టిన పవన్, మూడేళ్ళ తరువాత వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఇక ఆ తరువాత వచ్చిన భీమ్లా నాయక్ కూడా బాగానే ఆడగా ఇటీవల రిలీజ్ అయిన ఓజి మూవీతో మళ్ళి మంచి విజయం అందుకున్నారు పవర్ స్టార్.
అయితే కెరీర్ బిగినింగ్ నుండి మంచి సక్సెస్ లు అందుకున్న పవన్ కళ్యాణ్, యువతలో బాగా పేరు సొంతం చేసుకున్నారు. కానీ మధ్యలో చాలా ఏళ్ళ పాటు సరైన సక్సెస్ ఆయనకు దక్కలేదు. అయినప్పటికీ మధ్యలో అక్కడక్కడా పలు సినిమాల సక్సెస్ లతో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటూ దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరీష్ శంకర్ అయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు.
రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు మహేష్. ఆ తరువాత యువరాజు మూవీతో ఎబోవ్ యావరేజ్ అందుకున్న మహేష్ కు నాలుగవ సినిమా మురారి భారీ విజయాన్ని అందించింది.
అయితే ఆ తరువాత టక్కరి దొంగ, బాబీ సినిమాలు పెద్దగా అదనప్పటికీ కెరీర్ ఏడవ సినిమాగా వచ్చిన ఒక్కడు అతిపెద్ద సంచలన విజయం అందుకుంది. కెరీర్ బిగినింగ్ లోనే ఎనలేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ బాబు సొంతం. వాస్తవానికి మధ్యలో పలు ఫ్లాప్ లు చవిచూసినప్పటికీ కూడా మహేష్ బాబు ప్రతి సినిమాకి అప్పట్లో ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చేవి.
అయితే టాప్ నటుడిగా ఆయనకి సరైన సినిమా పడితే ఎలా ఉంటుంది అనేది ఒక్కడు నిరూపించి భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత నిజం సినిమా ద్వారా తన అద్భుత నటనతో అందరినీ మెప్పించిన మహేష్ తొలిసారిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత చేసిన నాని పరాజయం పాలవగా అర్జున్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అదే సమయంలో తొలిసారిగా త్రివిక్రమ్ తో మహేష్ చేసిన మూవీ అతడు భారీ విజయం దక్కించుకుంది.
ఆ తరువాత తొలిసారి పూరి జగన్నాథ్ తో మహేష్ వర్క్ చేసిన పోకిరి సినిమా టాలీవుడ్ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ మూవీ టికెట్స్ ని బ్లాక్ లో అమ్ముకున్న వారితో పాటు థియేటర్ స్టాఫ్ కూడా ఎంతో భారీ స్థాయిలో ఆదాయం అందుకున్నారు అంటే పోకిరి ఏస్థాయిలో ఇండస్ట్రీ హిట్ కొట్టిందో అర్ధం చేసుకోవచ్చు. దాని తరువాత సైనికుడు మూవీతో మెప్పించలేకపోయారు మహేష్ బాబు.
ఆ తరువాత వచ్చిన అతిథి, ఖలేజా సినిమాలు కూడా అంతగా ఆడలేదు. అదే సమయంలో శ్రీనువైట్ల తో దూకుడు మూవీ చేసిన సూపర్ స్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ పరంగా మళ్ళి భారీ స్థాయిలో ఫామ్ లోకి వచ్చారు. అనంతరం బిజినెస్ మ్యాన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆపైన వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు కూడా సూపర్ హిట్ కొట్టి హీరోగా మహేష్ బాబు రేంజ్, క్రేజ్, పాపులారిటీ, మార్కెట్ ని విపరీతంగా పెంచాయి.
అదే సమయంలో వచ్చిన వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాలు ఆడలేదు. సరిగ్గా ఆ తరువాత కొరటాల శివతో మహేష్ చేసిన శ్రీమంతుడు మూవీ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అయితే షాకింగ్ ఆ తరువాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇక మరొకసారి కొరటాల శివతో మహేష్ చేసిన మూవీ భరత్ అనే నేను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది.
అనంతరం రిలీజ్ అయిన మహర్షి, సరిలేరు నీకెవ్వరూ కూడా అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇక ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం సినిమాలకు పూర్తి నెగటివ్ టాక్, రేటింగ్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని తన స్టార్డం, క్రేజ్ తో విజయాలుగా మార్చారు మహేష్. ప్రస్తుతం మహేష్ బాబుకి దాదాపుగా అన్ని వర్గాల ఆడియన్సు లో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఎస్ ఎస్ రాజమౌళితో ఆయన భారీ పాన్ వరల్డ్ మూవీ SSMB29 చేస్తున్నారు.
తెలుగు హీరోలకు నంబర్ 1 స్థానం రావడానికి కారణాలు
JrNtr :
నిన్ను చూడాలని సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఫస్ట్ మూవీతోనే విజయం అందుకున్నారు. ఆ తరువాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగాఫోన్ పట్టిన స్టూడెంట్ నెంబర్ వన్ తో మరొక భారీ విజయం దక్కించుకున్నారు. ఆ తరువాత వచ్చిన సుబ్బు యావరేజ్ కాగా అనంతరం వివి వినాయక్ తో ఎన్టీఆర్ చేసిన ఆది మూవీ అతిపెద్ద మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మాస్ ఆడియన్స్ లో ఆయనకు విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది.
అనంతరం వచ్చిన అల్లరి రాముడు కూడా బాగానే ఆడింది. అనంతరం నాగ మూవీతో పరాజయం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్, మరొక్కసారి రాజమౌళి తో జతకట్టిన సింహాద్రితో కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ మూవీతో ఆయన మార్కెట్, రేంజ్ అమాంతంగా పెరిగిపోయాయి. ఆపై వచ్చిన ఆంధ్రావాలా పరాజయం పాలవగా.
ఆ తరువాత చేసిన సాంబ సినిమా బాగానే ఆడింది. ఇక నరసింహడు, అశోక్, వంటి సినిమాలతో పరాజయాలు చవిచూసిన ఎన్టీఆర్ కు కృష్ణవంశీ తీసిన రాఖీ మూవీ విజయం మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత మూడోసారి ఎన్టీఆర్ రాజమౌళి కల్సి చేసిన యమదొంగ సూపర్ హిట్ కొట్టింది. మధ్యలో బాద్షా, అదుర్స్, బృందావనం సినిమాలు సూపర్ హిట్స్ ని అందించినప్పటికీ దమ్ము, ఊసరవెల్లి పరాజయాలు అందించాయి.
ఆ తరువాత కంత్రి, శక్తి, రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల భారీ పరాజయాలతో సతమతం అయిన ఎన్టీఆర్ కి ఆ తరువాత డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టెంపర్ సూపర్ డూపర్ సక్సెస్ మళ్ళి సూపర్ ఫామ్ ని తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత నుండి మరింత జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసిన ఎన్టీఆర్, ఆ తరువాత సుకుమార్ తో చేసిన నాన్నకు ప్రేమతో, కొరటాల శివతో తొలిసారిగా చేసిన జనతా గ్యారేజ్, బాబీ తో చేసిన జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ సూపర్ హిట్స్ కొట్టి మరింత పేరు, మార్కెట్ తెచ్చిపెట్టాయి.
ఆపైన తొలిసారిగా రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన పాన్ ఇండియన్ మూవీ RRR. జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీలో కొమురం భీం గా ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కి విశేషమైన పేరు లభించి వరల్డ్ వైడ్ గా మార్కెట్, క్రేజ్ తీసుకువచ్చాయి. దాని తరువాత కొరటాల శివ తో ఎన్టీఆర్ రెండవసారి వర్క్ చేసిన మూవీ దేవర పార్ట్ 1. ఇటీవల రిలీజ్ అయిన ఈమూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ విధంగా వరుసగా విజయాలతో కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి నుండి ఎక్కువగా మాస్ ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ కు ఉన్న ఆదరణ వేరే లెవెల్ అని చెప్పకతప్పదు.
టాలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్న నేటి హీరో ఎవరు
Prabhas :
ఈశ్వర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంటర్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ విధంగా ఫస్ట్ మూవీతో బాగానే విజయం అందుకున్న ప్రభాస్ కు అనంతరం రాఘవేంద్ర యావరేజ్ సక్సెస్ ని అందించింది. ఆపైన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ తెరకెక్కించిన వర్షం మూవీ భారీ విజయం హీరోగా ఆయన ఇమేజ్ తో మార్కెట్ ని కూడా బాగా పెంచింది. అనంతరం అడవిరాముడు, చక్రం సినిమాలతో పరాజయాలు చవిచూశారు ప్రభాస్.
అదే సమయంలో తొలిసారిగా రాజమౌళితో ఆయన వర్క్ చేసిన ఛత్రపతి విజయం హీరోగా ప్రభాస్ కు బాగా పేరు తీసుకువచ్చింది. అనంతరం చేసిన పౌర్ణమి, యోగి, మున్నా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఆ తరువాత తొలిసారిగా పూరి జగన్నాథ్ తో కలిసి ప్రభాస్ చేసిన బుజ్జిగాడు బాగా సక్సెస్ అయింది. ఇక బిల్లా మూవీతో మరొక విజయం అందుకున్న ప్రభాస్ కు ఏక్ నిరంజన్ పరాజయం అందించింది. ఆ తరువాత కరుణాకరన్ తో చేసిన డార్లింగ్, దశరథ్ తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు సక్సెస్ అయి హీరోగా ప్రభాస్ మార్కెట్ ని పెంచాయి.
ఆపైన లారెన్స్ తీసిన రెబల్ తో ఫ్లాప్ చవిచూసిన ప్రభాస్ కు తొలిసారిగా కొరటాల శివ తో చేసిన మిర్చి సూపర్ హిట్ అందించింది. అదే సమయంలో తొలిసారిగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన మూవీ బాహుబలి పార్ట్ 1 పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి హీరోగా ప్రభాస్ క్రేజ్, మార్కెట్ వేల్యూ ని అమాంతంగా నేషనల్ వైడ్ కి పెంచేసాయి. దాని సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 ఇండియా వైడ్ అతిపెద్ద సంచలన విజయం అందుకుని హీరోగా ప్రభాస్ ని నేషనల్ వైడ్ టాప్ ప్లేస్ కి తీసుకెళ్లింది.
అయితే ఆ తరువాత సుజీత్ తో చేసిన సాహు తో ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయిన ప్రభాస్, అనంతరం రాధాకృష్ణ తీసిన రాధేశ్యామ్, ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ సినిమాలతో మరొక రెండు పరాజయాలు చూడక తప్పలేదు. ఇక వాటి అనంతరం కెజిఎఫ్ సిరీస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తొలిసారిగా ప్రభాస్ చేసిన సలార్ పార్ట్ 1 మూవీ భారీ విజయం హీరోగా అయన కెరీర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వాటి తరువాత నాగ అశ్విన్ తో ఆయన చేసిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయఢంకా మ్రోగించింది.
ఇటీవల కన్నప్ప మూవీలో రుద్ర పాత్రలో మెరిసిన ప్రభాస్ ప్రస్తుతం మారుతీ తో ది రాజాసాబ్, హను రాఘవపూడి తో ఒక మూవీ చేస్తున్నారు. త్వరలో కల్కి 2, సలార్ 2 తో పాటు సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ మూవీస్ చేయనున్నారు ప్రభాస్. ముఖ్యంగా హీరోగా అంతకముందు రీజినల్ గా మంచి క్రేజ్ కలిగిన ప్రభాస్ కు బాహుబలి సినిమాలు ఒక్కసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు, మార్కెట్ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ప్రభాస్ టాప్ 3 లో ఉంటారు అంటే ఆయన రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.
ముందుగా కె రాఘవేంద్రరావు తీసిన గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ మూవీతో విజయం అందుకున్నారు. అనంతరం తొలిసారిగా సుకుమార్ మెగాఫోన్ పట్టిన ఆర్య మూవీతో బిగ్ సక్సెస్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. అనంతరం బన్నీ, హ్యాపీ, సినిమాలతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ కు అదే సమయంలో పూరి జగన్నాథ్ తీసిన దేశముదురు భారీ విజయం హీరోగా యువతలో విశేషమైన క్రజ్ ని అందించింది.
అనంతరం బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన పరుగు మూవీతో విజయం అందుకున్న అల్లు అర్జున్ కు ఆర్య 2, వరుడు, బద్రీనాథ్ సిఎంమాలు ఆశించిన స్థాయి సక్సెస్ లు అందించలేకపోయాయి. అయితే మధ్యలో క్రిష్ తీసిన వేదం మూవీలో చేసిన కేబుల్ రాజు పాత్ర ఆయనకు బాగా పేరు తీసుకువచ్చింది. అనంతరం తొలిసారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేసిన జులాయి భారీ విజయం అందుకుని కెరీర్ పరంగా బ్రేక్ ని అందించింది.
ఇక రెండోసారి పూరి జగన్నాథ్ తో ఆయన చేసిన ఇద్దరమ్మాయిలతో పెద్దగా అడగలేదు. తరువాత సురేందర్ రెడ్డితో చేసిన రేసు గుర్రం మూవీతో భారీ విజయం అందుకున్నారు అల్లు అర్జున్. ఆపైన త్రివిక్రమ్ తో రెండోసారి చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా బాగానే సక్సెస్ కాగా, గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన రుద్రమదేవి మూవీలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించి తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు.
ఇక అనంతరం తొలిసారిగా బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ చేసిన సరైనోడు సూపర్ హిట్ కొట్టింది. అనంతరం దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు కూడా పరాజయం పాలవడంతో కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టిన అల్లు అర్జున్ చేసిన సినిమా అలవైకుంఠపురములో. ఈ మూవీని త్రివిక్రమ్ త్రివిక్రమ్ తెరకెక్కించారు. ఈ మూవీ సాంగ్స్ ఏకంగా నేషనల్ వైడ్ పాపులర్ అవ్వడంతో పాటు మూవీ భారీ విజయంతో యాక్టర్ గా అల్లు అర్జున్ క్రేజ్ ఎంతో పెరిగింది.
సరిగ్గా అదే సమయంలో తొలిసారిగా పాన్ ఇండియన్ మూవీ పుష్ప 1 ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు అల్లు అర్జున్. ఈ మూవీలో పుష్ప రాజ్ గా అద్భుత పెర్ఫార్మన్స్ కనబరిచిన ఆయనకు ఏకంగా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు లభించడం విశేషం. ఇక ఆ మూవీతో నేషనల్ వైడ్ విశేషమైన క్రేజ్, మార్కెట్ ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఆ తరువాత ఇటీవల వచ్చిన పుష్ప 2 అమాంతంగా అతిపెద్ద ఇండియన్ హిట్ గా నిలిచి నార్త్ లో భారీ స్థాయి కలెక్షన్ కొల్లగొట్టింది.
ముఖ్యంగా భారత దేశ సినిమా చరిత్రలో పుష్ప 2 బాక్సాఫీస్ పరంగా చాలా పెద్ద ప్రభంజనం సృష్టించి నార్త్ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అల్లు అర్జున్ పేరుని మరింతగా పెంచేసాయి. ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో AA22 సినిమా చేస్తున్న అల్లు అర్జున్ కు ప్రస్తుతం ఇండియా వైడ్ ఎనలేని పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కి ప్రస్తుతం ఎంతో విశేషమైన పేరు, క్రేజ్ ఉంది. దాదాపుగా ఇండియన్ స్టార్స్ లో అత్యధిక పారితోషికం అందుకున్న యాక్టర్స్ లో అల్లు అర్జున్ టాప్ రెండు మూడు స్థానాల్లో ఉంటారని చెప్పకతప్పదు.
Ram Charan :
పూరిజగన్నాథ్ తీసిన చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత ఏకంగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర మూవీ భారీ బ్లాక్ బస్టర్ తో హీరోగా ఆయన మార్కెట్ క్రేజ్ విపరీతంగా పెరిగాయి. అయితే అనంతరం బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన ఆరెంజ్ మూవీతో ఫ్లాప్ చవిచూశారు రామ్ చరణ్.
ఆపైన సంపత్ నందితో ఆయన చేసిన రచ్చ, వివి వినాయక్ తో చేసిన నాయక్ సినిమాలతో రెండు మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు రామ్ చరణ్. అయితే అదే సమయంలో అపూర్వ లఖియా దర్శకత్వంలో జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చారు చరణ్. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. తరువాత తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన ఎవడు తో మంచి విజయం అందుకున్నారు.
అయితే దాని అనంతరం తొలిసారిగా కృషవంశీతో రామ్ చరణ్ చేసిన గోవిందుడు అందరివాడేలే మూవీ కూడా ఫెయిల్ అయింది. దాని తరువాత శ్రీనువైట్ల తీసిన బ్రూస్ లీ కూడా అంచనాలు అందుకోలేక పరాజయం పాలయింది. తరువాత తొలిసారిగా స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డితో చరణ్ చేసిన ధ్రువ హిట్ కొట్టి ఆయనకు మంచి బ్రేక్ అందించింది.
ఆ తరువాత సుకుమార్ తో తొలిసారిగా రామ్ చరణ్ చేసిన మాస్ యాక్షన్ రూరల్ డ్రామా మూవీ రంగస్థలం భారీ విజయం యాక్టర్ గా ఆయన క్రేజ్ అమాంతంగా పెంచడంతో పాటు మార్కెట్ ని కూడా తారా స్థాయికి తీసుకెళ్లింది. దాని తరువాత బోయపాటి శ్రీను తో వినయవిధేయరామ మూవీ చేసారు. కానీ అది ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.
ఇక దాని తరువాత తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ చేసిన తొలి పాన్ ఇండియన్ మూవీ RRR. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలనం సృష్ఠించింది. ఇక ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ యాక్టింగ్ కి విశేషమైన పేరు లభించింది. అయితే దాని తరువాత తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి కొరటాల శివ తీసిన ఆచార్య లో నటించారు రామ్ చరణ్. కానీ ఆ మూవీ బాక్సాఫీ వద్ద ఘోర పరాజయం పాలయింది.
ఇక ఇటీవల దిగ్గజ దర్శకుడు శంకర్ తీసిన గేమ్ చేంజర్ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ మరొక పరాజయం చవిచూడకతప్పలేదు. అయితే ప్రస్తుతం బుచ్చిబాబు సన తో ఆయన చేస్తున్న మాస్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మూవీ పెద్ది. భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ మూవీ గ్రాండ్ గా రూపొందుతోంది. ఇక మొదటి సినిమా నుండి యాక్టర్ గా ఎంతో మంచి క్రేజ్, మార్కెట్ తో కొనసాగుతున్న రామ్ చరణ్ కు కూడా దాదాపుగా అన్ని వర్గాల ఆడియన్సు లో ఎంతో మంచి పేరుంది.
Tollywood Top Hero 2025
ఇక మొత్తంగా ఈ ఆరుగురు టాప్ హీరోస్ కెరీర్, క్రేజ్, పాపులారిటీ, మార్కెట్ వాల్యూ ఇలా అన్నిటినీ బట్టి చూస్తే పక్కాగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మంచి పేరు కలిగి ఉండగా అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తిరుగులేకుండా అందరి ఆదరణతో దూసుకెళ్తున్నారు.
మరోవైపు పాన్ ఇండియన్ ని దాటి పలు ఇతర రాష్ట్రాలు, నార్త్ లో సైతం ఎంతో మంచి పేరు, టాప్ మార్కెట్ వాల్యూ తో అల్లు అర్జున్, ప్రభాస్ కొనసాగుతున్నారు. కాగా పక్కాగా మెగాస్టార్ చిరంజీవి అనంతరం నేటి స్టార్స్ లో ఎవరు నెంబర్ అనేది తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ ఆరుగురిలో ఎవరి ప్రత్యేకత వారిదే, వీరిలో ఎవరినీ తక్కువ చేయలేము. అయితే మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇప్పుడు పూర్తిగా బాక్సాఫీస్ లెక్కలు మారిపోవడంతో ఈ స్టార్స్ అందరూ కూడా తమ మార్కెట్ వాల్యూ తో భారీ ఓపెనింగ్స్ తో పాటు బాగా కలెక్షన్స్ కూడా పెడుతున్నారు.
What's Your Reaction?