3BHK Movie Review in Telugu – Siddharth’s Heart Touching Family Drama
Check out the 3BHK Telugu movie review starring Siddharth and Sharath Kumar. A family emotional drama that connects with today’s audience

3BHK మూవీ రివ్యూ తెలుగు : ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్
మూవీ పేరు : 3BHK
విడుదల తేదీ : 4 జులై 2025
నటీనటులు : సిద్దార్థ, శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర జె ఆచార్ తదితరులు
దర్శకత్వం : శ్రీగణేష్
నిర్మాత : అరుణ్ విశ్వ
సంగీతం : అమృత్ రామనాథ్
సినిమాటోగ్రఫీ : దినేష్ బి కృష్ణన్, గణేష్ శివ
తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ రేటింగ్ : 3. 25 / 5
సిద్దార్థ, శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు శ్రీగణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ 3BHK. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకుని, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నిటితో కూడా ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఫైనల్ గా నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఎవరెవరు ఎలా పెర్ఫార్మ్ చేసారు, ఎంతమేరకు ఆడియన్స్ ని మెప్పించింది అనేది మొత్తం పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ :
మధ్యతరగతి కుటుంబం పెద్ద అయిన వాసుదేవ్ (Sharath Kumar), తన భార్య శాంతి (Devayani), కొడుకు ప్రభు (Siddarth), కూతురు ఆర్తి (Meetha Raghunath) తో కలిసి జీవిస్తుంటాడు. అయితే చిన్న స్థాయి ఉదోగ్యం కలిగిన అతడు ఎప్పటికైనా ఒక మంచి సొంతిల్లు కొనుక్కోవాలనేది అతడి కల, కానీ ఆర్ధిక స్థితిగతుల కారణంగా అది సాధ్యపడదు. అయితే తన కొడుకు ప్రభు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి తన కల నెరవేరుస్తాడని వాసుదేవ్ భావిస్తాడు. మరి ఇంతకీ ప్రభు తండ్రి కలని నెరవేరుస్తాడా, అతడు ఏవిధంగా ముందుకు సాగాడు, అనంతరం కూతురు ఆర్తి జీవితం ఏమవుతుంది, మొత్తంగా వారి ఫ్యామిలీ పరిస్థితులు ఏవిధంగా మారాయి అనేది మొత్తం కూడా వెండితెరపై చూడాల్సిందే.
3BHK Movie Rating
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ అయిన సొంతింటి కలని ప్రధానంగా తీసుకుని అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీగణేష్ మూవీని హృద్యంగా తెరకెక్కించారు. వాస్తవానికి చాలా మంది మధ్యతరగతి జీవితాల్లో సొంతిల్లు కట్టుకోవాలి అనేది చాలావరకు కల గానే ఉండిపోతుంది. ఒకవేళ అది సాధ్యం చేసుకోవాలని వారు ప్రయత్నించినప్పటికీ మధ్యలో ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. కాగా ఇదే అంశంతో ఈ మూవీ సాగుతుంది. ఇక పెర్ఫార్మన్స్ ల విషయానికి వస్తే తండ్రి కలని నెరవేర్చడానికి కొడుకుగా ఎంతో తపన పడే ప్రభు పాత్రలో హీరో సిద్దార్థ్ యాక్టింగ్ ఎంతో బాగుంది.
3BHK Telugu Movie Review
పలు ఎమోషనల్ సీన్స్ తో సిద్దార్థ్ మరింతగా ఆకట్టుకున్నారు. వాసుదేవ్ గా శరత్ కుమార్ నటన ఎంతో అద్భుతం అని చెప్పాలి. ఆయన భార్యగా చేసిన దేవయాని, కూతురుగా నటించిన మీతా రఘునాథ్ కూడా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అలానే తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ మనసుని తాకుతాయి. ఎమోషనల్ సీన్స్ తో ఎక్కడా కూడా ప్రక్కదారి పట్టకుండా దర్శకుడు శ్రీగణేష్ ఈ మూవీ తీశారు. రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ మరొక ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.
మైనస్ పాయింట్స్ :
నిజానికి ఇటువంటి ఎమోషనల్ స్టోరీస్ ని ఆకట్టుకునే రీతిన తెరకెక్కిస్తే ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటువంటి కథలకు దాదాపుగా అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి ఆదరణ ఉంటుంది, అయితే స్క్రీన్ ప్లే మాత్రం ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉండాలి. అయితే దర్శకుడు శ్రీగణేష్ ఇక్కడే కొంత తడబడ్డారు. మెయిన్ కోర్ పాయింట్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ని ఆసక్తికరంగా ఆడియన్స్ మనసుని తాకేలా రాసుకోవడంలో దర్శకుడు మరింతగా వర్క్ చేయాల్సింది. అయితే పూర్తిగా కథనంలో ఎమోషన్స్ ఎక్కువగా ఉండడంతో పాటు ప్రత్యేకంగా ఫ్రెష్ ఫీల్ అనేది మనకు అసలు ఎక్కడా కనిపించదు.
3BHK Movie OTT
ఇందులోని చాలా సీన్స్ పలు గత ఫ్యామిలీ సినిమాలను గుర్తు చేయడంతో పాటు సిద్దార్థ సీన్స్ మనకు బొమ్మరిల్లు లో ఆయన యాక్ట్ చేసిన సీన్స్ ని జ్ఞప్తికి తెస్తాయి. వాస్తవానికి యాక్టర్స్ అందరూ కూడా తమ తమ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టినప్పటికీ యోగిబాబు వంటి కమెడియన్ నుండి కామెడీ సీన్స్ మరింతగా రాసుకుని ఉండాల్సింది. అలానే సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే సాగినా సెకండ్ హాఫ్ చాలా వరకు సాగతీతగా అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం :
దర్శకుడు శ్రీగణేష్ తీసుకున్న కథలోని మెయిన్ పాయింట్ ఎంతో బాగుంది కానీ కథనాన్ని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో నడపడంలో మాత్రం ఆయన కొంత విఫలం అయ్యారు. ఏమాత్రం కొత్తదనం లేని రీతిలో సాగె చాలా సీన్స్ తో పాటు ఎక్కువగా ఎమోషనల్ నోట్ లోనే సినిమాని నడిపారు. కామెడీ ఎలిమెంట్స్ తో పాటు పాటలు పెద్దగా ఆకట్టుకోవడం ఇందులో మైనస్. అయితే యాక్టర్స్ నటనతో పాటు బీజీఎమ్, ఫోటోగ్రఫి వంటివి ఎంతో బాగున్నాయి. అలానే నిర్మాత యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో బాగుండడంతో పాటు ఎడిటింగ్ విభాగం కొంత కేర్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది.
తీర్పు :
మొత్తంగా ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన 3BHK మూవీ కథ, మెయిన్ పాయింట్ పరంగా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో సాగతీత, ఎక్కువగా ఎమోషనల్ అంశాలు ఆడియన్స్ కి కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి. అయితే హీరో సిద్దార్థ్ తో పాటు శరత్ కుమార్ సహా ప్రతి పాత్రధారి నటన, అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్, ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎక్కువగా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీస్ ఇష్టపడే వారికి ఇది ఎంతో బాగా కనెక్ట్ అవుతుంది. వీలైతే మీ సమీప థియేటర్స్ లో మాత్రమే ఈ మూవీ చూసి ఆనందించండి.
కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ మూవీ అప్ డేట్స్, టాలీవుడ్ న్యూస్, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్, గాసిప్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని ఫాలో అవ్వండి
What's Your Reaction?






