Are Mahesh Babu and Vijay Friends? Their Relationship in the Film Industry Explained

Are Mahesh Babu and Vijay friends? Discover their bond and friendship in the Telugu and Tamil film industries, including their public appearances and interactions.

Are Mahesh Babu and Vijay Friends? Their Relationship in the Film Industry Explained

టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తొలిసారిగా రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు, అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ కొనసాగారు. 

ఇక తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ తో పాటు పలు ఇండస్ట్రీ హిట్స్ కూడా సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు డే 1 నుండి కోజింగ్ వరకు టాక్ తో సంబంధం లేకుండా కోట్లాది ప్రేక్షకాభిమానుల యొక్క క్రేజ్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టగల స్టార్డం ఉన్న హీరో. 

మహేశ్ బాబు మరియు విజయ్ మధ్య ఉన్న స్నేహం గురించి తెలుసుకోండి!

ఇక ఆయన నుండి మూవీ రిలీజ్ అవుతుంది అంటే చాలు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆ విధంగా తండ్రి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ నట వారసత్వంతో చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, మొదటి నుండి తన ఆకట్టుకునే అద్భుత అభినయంతో తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని వర్గాల ఆడియన్సు లో విపరీతమైన క్రేజ్ అందుకున్నారు. 

ఇక అదే విధంగా తమిళ్ చిత్ర సీమలో టాప్ స్టార్ గా కొనసాగుతున్న ఇలయదళపతి విజయ్ (Vijay) కూడా అంతే. కెరీర్ బిగినింగ్ నుండి ఒక్కో సినిమాతో తన ఆకట్టుకునే యాక్టింగ్, డ్యాన్సింగ్ స్టైల్ తో కోట్లాది ఫ్యాన్స్ మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న విజయ్ కెరీర్ పరంగా ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. 

మహేశ్ బాబు మరియు విజయ్ మిత్రులా?

అలానే తమిళనాడులో విజయ్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే చాలు విపరీతమైన పండుగ సంబరం జరుగుతుంది. ఇక విజయ్ మూవీస్ కూడా ఇటీవల పరిశీలిస్తే ఒకింత నెగటివ్ టాక్స్ వచినప్పటికీ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ లో కలెక్షన్స్ రావడం చూసాము. ఆ విధంగా మహేష్, విజయ్ లకు ఆడియన్స్, ఫ్యాన్స్ లో ఏ రేంజ్ క్రేజ్, ఫాలోయింగ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. 

ఆ విధంగా అన్ని వర్గాల ఆడియన్సు లో విశేషమైన ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్నారు విజయ్. ఇటు తెలుగులో కూడా విజయ్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు హీరోలు కూడా మంచి స్నేహితులా కాదా ఆసక్తికరమైన ప్రశ్నని లేవనెత్తుతున్నారు పలు ఇతర భాషల ఆడియన్సు. 

అయితే మొదటి నుండి అటు విజయ్ ఇటు మహేష్ ల మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ని తమిళ్ లో రీమేక్ చేసిన విజయ్ అక్కడ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. అయితే పలు సందర్భాల్లో అటు విజయ్, ఇటు మహేష్ కలిసినట్లు పలువురు చెప్తుంటారు, అప్పట్లో వార్తా పత్రికల్లో వారు కలిసిన ఫోటోలు కూడా అక్కడక్కడా చూడవచ్చు. 

సినిమా ఇండస్ట్రీలో వారి సంబంధం ఎలా ఉంటుంది?

ఇక మొదటి నుండి తన బాల్యం మొత్తం కూడా చెన్నైలోనే గడిపిన మహేష్ బాబుకి విజయ్ తో పాటు టామీయుల నటులు సూర్య, కార్తీ సహా మరికొందరితో మంచి స్నేహానుబంధం ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ త్రిష కూడా సూపర్ స్టార్ మహేష్ తనకు ఒకప్పటి క్లాస్ మేట్ అని చెప్పారు, అయితే ఇద్దరూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికి ఒకరు పరిచయం ఏర్పడిందని ఆమె చెప్పారు. 

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం అప్పట్లో మహేష్ బాబు హిందీ మూవీ త్రి ఇడియట్స్ రీమేక్ అయిన స్నేహితుడు చేయాల్సి ఉంది. అయితే తనకు కెరీర్ లో రీమేక్స్ చేసే అలవాటు లేని సూపర్ స్టార్, ఆ ఛాన్స్ ని సున్నితంగా తిరస్కరించినట్లు అప్పటి సినీ వార్తా పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. 

అనంతరం అది విజయ్ కి చేరడం, అందులో ఇలియానా హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక ఇటీవల కోవిడ్ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన బర్త్ డే నాడు ఒక మొక్కని నాటుతూ తదుపరి ఆ గ్రీన్ ఛాలెంజ్ ని విజయ్ కి కూడా విసిరారు. అనంతరం విజయ్ దానిని సాదరంగా స్వీకరించి ప్రత్యేకంగా మహేష్ బాబుకి థాంక్స్ చెప్పారు.

 ఆ విధముగా మహేష్, విజయ్ ల మధ్య సాన్నిహిత్యం ఉందని చెప్పవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం వారిద్దరూ కలిసి ఒక మంచి యాక్షన్ తో కూడిన మల్టీస్టారర్ మూవీ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. 

మరి అది పక్కాగా ఎప్పుడు సాధ్యపడుతుందో, దానిని ఏ దర్శకుడు తీస్తాడో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలయదళపతి విజయ్ ఇద్దరూ కూడా కెరీర్ పరంగా మరిన్ని విజయాలతో దూసుకెళ్లాలని మా Telugu Movie Media టీం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow