GOAT Movie Review – Vijay’s Stylish Action Drama
Read the full review of GOAT movie starring Thalapathy Vijay. Check rating, plot, performance, and audience reactions. Full coverage on Telugu Movie Media

విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' : ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ (Vijay The Greatest of All Time Movie Review)
మూవీ పేరు : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (GOAT)
విడుదల తేదీ : 5 సెప్టెంబర్ 2024
తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ రేటింగ్ : 3. 5 / 5
నటీనటులు : విజయ్, మీనాక్షి చౌదరి, స్నేహా, ప్రభు దేవా, లైలా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, మోహన్ తదితరులు.
దర్శకుడు : వెంకట్ ప్రభు
నిర్మాతలు : కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్
సంగీతం : యువన్ శంకర్ రాజా
ఫోటోగ్రఫి : సిద్దార్థ నుని
కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ (Vijay) హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ GOAT. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే ఈ మూవీని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఉంది, ఎంత మేర ఆడియన్స్ ని విజయ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది అనేది మొత్తం కూడ ఇప్పుడు పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
GOAT మూవీ రివ్యూ – పూర్తి విశ్లేషణ
కథ :
స్పెషల్ యాంటీ ఉగ్రవాద స్క్వాడ్ (SATS) సభ్యుడైన గాంధీ (Vijay) కెన్యాలో ఉంటున్న మీనన్ (Mohan) సహా అతడి ముఠా మొత్తాన్ని కూడా సమూలంగా నాశనం చేసేందుకు ప్లాన్ చేసి దానిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తాడు. అయితే కొన్నాళ్ల అనంతరం ఒక మిషన్ లో పాల్గొన్న గాంధీ, అదే సమయంలో జరిగిన కాల్పుల్లో భాగంగా తన కుమారుడు జీవన్ మరణించడంతో ఎంతో వేదన చెందుతాడు. అయితే కొన్నేళ్ల అనంతరం మరణించిన కుమారుడు జీవన్ రష్యాలో హఠాత్తుగా అతడి కళ్ళ ముందు కనబడడంతో గాంధీ షాక్ కి గురవుతాడు.
ఆపై అతడిని కలుసుకుని ఒప్పించి ఇంటికి తీసుకువస్తాడు. అయితే ఇండియా వచ్చిన తరువాత SATS టీమ్ మెంబెర్స్ కి సంబండఁచి కొన్ని ఊహించని ఘటనలు జరుగుతాయి. అవి అందరినీ ఎంతో కలిచి వేస్తాయి. అసలు ఆ ఘటనలు ఎందుకు జరిగాయి, దాని వెనుక ఉంది ఎవరు, మీనన్ నిజంగానే చనిపోయాడా, జీవన్ కి వాటికి ఏమైనా సంబంధం ఉందా, చివరికి ఏమి జరుగుతుంది అనేది మొత్తం కూడా వెండితెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా GOAT మూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇలయదళపతి విజయ్ నటన గురించి. అటు గాంధీ పాత్రలో అలానే ఇటు జీవన్ అనే యువకుడి పాత్రలో ఎంతో అద్బుతంగా నటించారు. ఇక కీలకమైన సన్నివేశాల్లో ఆయన పండించిన ఎమోషన్స్ మరింతగా ఆకట్టుకుంటాయి. కొన్ని క్షణాల పాటు విజయ్ కాంత్ యొక్క ఏఐ రూపాన్ని సినిమాలో చూపించి ఆయన ఫ్యాన్స్ కి ఆనందాన్ని అందించారు. అలానే ఇతర కీలక పాత్రలు చేసిన ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, మోహన్ కూడా ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తన పాత్ర యొక్క పరిధి మేరకు అలరించారు. అలానే స్నేహా తో పాటు లైలా పాత్రలు కూడ బాగున్నాయి. చివర్లో ఇద్దరు విజయ్ ల నడుమ సాగే యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో Chennai Super Kings టీమ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో చిత్రీకరించారు. వాస్తవానికి ఆ సీన్స్ కొంత లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆకట్టుకుంటాయి.
విజయ్ – నటన & స్టోరీ
మైనస్ పాయింట్స్ :
వాస్తవానికి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ కోసం దర్శకుడు వెంకట్ ప్రభు తీసుకున్న పాయింట్ ఎంతో బాగుంది. ప్రారంభ సీన్ నుండి ఆసక్తికరంగా సినిమాని నడిపించిన దర్శకుడు కొంతమేర ఊహించదగిన సీన్స్ తో మూవీని తీశారు. ముఖ్యంగా సినిమాలో చిన్న చిన్న ట్విస్ట్ లు బాగున్నప్పటికీ అవి ఫ్యాన్స్ ఆడియన్స్ లో విపరీతమైన ఎగ్జైట్మెంట్ అందించేంత గొప్పగా అయితే ఉండవు అని చెప్పాలి. కొంతవరకు కథ తోపాటు అక్కడక్కడా కథనం సాగె కొద్దీ తదుపరి ఏమి జరుగుతుందనేది కొంత ఊహించవచ్చు.
ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా సాగేదీసినట్లు అనిపించినా మధ్యలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా విలన్ తో హీరో ముఖాముఖీ సీన్స్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటె బాగుండేది. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగుంటాయి. హీరోయిన్ మీనాక్షి పాత్ర కూడా మరింతగా ఉపయోగపడేలా రాసుకుంటే బాగుండేది. హీరోయిన్ త్రిష, హీరో శివకార్తికేయన్ ల క్యామియోలు బాగున్నాయి. విలన్ గా నటించిన మోహన్ నటన సూపర్ గా ఉన్నా, ఆ పాత్ర అంత బలంగా అనిపించదు. ఓవరాల్ గా హీరోతో ఢీ కొట్టిన సమయంలో తేలిపోయినట్లు అనిపిస్తుంది. ఇక రన్ టైం కూడా ఎక్కువ కావడంతో ఫ్యాన్స్ కి బాగానే ఉన్నా సాధారణ ప్రేక్షకులకి అది అంతగా రుచించదని చెప్పాలి.
ఫ్యాన్స్ రియాక్షన్ & బాక్సాఫీస్ స్టాట్స్
సాంకేతిక విభాగం :
ముఖ్యంగా ఈమూవీలో వెంకట్ ప్రభు తీసుకున్న పాయింట్ బాగున్నా కూడా దానిని ఆకట్టుకునే రీతిన ఎగ్జిక్యూట్ చేయడంలో అక్కడక్కడా తడబడ్డారు. విజయ్ యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ సినిమాలో ప్రధాన హైలైట్ గా చెప్పవచ్చు. అలానే యంగ్ లుక్ లో విజయ్ ని బాగా చూపించారు. సాంగ్స్ బాగానే ఉన్నాయి, యువ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు, అయితే విజయ్ ఫ్యాన్స్ ఆశించినంత గ్రాండియర్ గా అయితే లేదు. ఎడిటింగ్ విభాగం అక్కడక్కడా రెండు మూడు అనవసర సీన్స్ కట్ చేస్తే రన్ టైం కొంత మేర తగ్గి ఉండేది. విజువల్స్ తో పాటు మూవీ యొక్క భారీ నిర్మాణ విలువలు కూడా ఎంతో బాగున్నాయి.
(Vijay The Greatest of All Time Telugu Movie Review)
తీర్పు :
ఓవరాల్ గా కోలీవుడ్ నటుడు ఇలయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకట్ ప్రభు తీసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ సాధారణ ప్రేక్షకులకి యావరేజ్ గా అనిపించినా విజయ్ ఫ్యాన్స్ కి మాత్రం బాగానే నచ్చుతుందని చెప్పవచ్చు. అక్కడక్కడా నెమ్మదించిన కథనం, ఊహించదగిన సీన్స్ వంటివి దీనికి కొద్దిగా మైనస్. అయితే విజయ్ యాక్టింగ్ తో పాటు కీలక యాక్షన్ సీన్స్ వంటివి ప్లస్ గా చెప్పవచ్చు. ఇక మరి మీ మీ ఫ్యామిలీస్ తో కలిసి GOAT మూవీని హ్యాపీగా చూసేయొచ్చు. కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మా Telugu Movie Media సైట్ చూస్తూ ఉండండి.
What's Your Reaction?






