Balakrishna’s New Movie: Title, Cast, and Release Updates

Check out Balakrishna’s upcoming movie details including title, star cast, director, teaser, and expected release date with full Tollywood buzz

Balakrishna’s New Movie: Title, Cast, and Release Updates

టాలీవుడ్ (Tollywood) స్టార్ యాక్టర్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా చేస్తున్న మూవీ అఖండ 2. ప్రస్తుతం ఈ మూవీ వేగవంతంగా షూటిగ్ జరుపుకుంటోంది. ఇక ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా డాకు మహారాజ్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన బాలకృష్ణ దానితో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు. 

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఆ మూవీలో మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఆనిమల్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) విలన్ పాత్ర చేసారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పౌ సూర్యదేవర నాగవంశీ డాకు మహారాజ్ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. 

బాలకృష్ణ కొత్త సినిమా విశేషాలు

ఇక అఖండ 2 గురించి మాట్లాడుకుంటే దాదాపుగా మూడేళ్ళ క్రితం బోయపాటి శ్రీను (Boyapati Srinu) తీసిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. దానికి సీక్వెల్ గానే ప్రస్తుతం అఖండ 2 రూపొందుతోంది. అప్పట్లో అఖండ విజయంతో మరింత క్రేజ్ అందుకున్నారు బాలయ్య. అందులో ఆయన డ్యూయల్ రోల్ చేయగా ఎస్ థమన్ సంగీతం అందించారు. 

కాగా అఖండ లో మధ్యతరగతి రైతుగా అఘోరాగా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటన నభూతో నభవిష్యతి అని చెప్పాలి. బోయపాటి ఆ మూవీని తెరకెక్కించిన తీరు, కథ, కథనాలు, మాస్ యాక్షన్ సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దానితో అందరిలో ఒక్కసారిగా అఖండ 2 (Akhnda 2) పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

Akhanda 2 Release Date

ఇక రెండు రోజుల క్రితం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. అయితే టీజర్ లో బాలకృష్ణ అఘోరా లుక్, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకున్నాయి. విజువల్స్ కూడా బాగానే ఉన్న ఈ టీజర్ యూట్యూబ్ (Youtube) లో భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ ని సొంతం చేసుకుని ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అమాంతమా పెంచేసింది. 

టైటిల్, నటీనటులు, మరియు దర్శకుడు వివరాలు

అందాల నటి సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామ్ ఆచంట దీనిని గ్రాండ్ లెవెల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యువ నటుడు అది పినిశెట్టి విలన్ గా చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న దసరా పండుగ కానుకగా పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. 

Akhanda 2 Teaser

మరోవైపు దర్శకుడు బోయపాటి అఖండ 2 చిత్రీకరణ విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారట. ఇటీవల హిమాలయాల్లో ఈమూవీ యొక్క కీలక సన్నివేశాలు చిత్రీకరించి వచ్చారు. పార్ట్ 1 ని మించేలా ఇందులో మరింతగా అందరినీ ఆకట్టుకునే మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయని, అలానే బాలకృష్ణ అఘోర పాత్ర ఇందులో మరింతగా అదిరిపోతుందని చెప్తున్నారు. 

టీజర్, రిలీజ్ డేట్ మరియు అభిమానుల అంచనాలు

ఇక అఖండ కి సాంగ్స్ తో పాటు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊర మాస్ రేంజ్ లో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే దానిని మించేలా ఈమూవీ కోసం థమన్ కూడా ఎంతో కష్టపడుతున్నారట. మొత్తంగా అఖండ 2 టీజర్ సూపర్ గా రెస్పాన్స్ ని సంపాదించుకోవడంతో పాటు బాలకృష్ణ ఫ్యాన్స్ లో మూవీ పై మరింత క్రేజ్ ఏర్పరిచింది. 

Akhanda 2 Heroine

మరి సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈమూవీ ఎంతమేర విజయం అందుకుంటుంది, ఏ స్థాయిలో కలెక్షన్ రాబడుతుంది అనేది తెలియాలి అంటే మరొక మోడీలు నెలల వరకు ఆగాల్సిందే. ఇటువంటి తాజా తెలుగు మూవీ న్యూస్ కోసం మా తెలుగు మూవీ మీడియా సైట్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow