Bigg Boss Telugu vote 2025 : Bigg Boss Telugu Season 9 Interesting Updates
Vote for your favorite contestant in Bigg Boss Telugu 2025 with live poll updates.

తెలుగు టెలివిజన్ రంగంలో ప్రస్తుతం బిగ్ బాస్ షో ప్రతి ఏడాది ఆడియన్స్ యొక్క క్రేజ్ తో భారీ టిఆర్పి రేటింగ్స్ తో కొనసాగుతోంది. తొలిసారిగా ఈ షో సీజన్ 1 కి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అనంతరం నాచురల్ స్టార్ నాని వ్యవహారించారు. ఆ తరువాత నుండి కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 8 వరకు హోస్ట్ గా ఉంటూ వచ్చారు.
ఇక త్వరలో రానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి కూడా ఆయనే హోస్ట్ గా ఉండనున్నట్లు టాక్. వాస్తవానికి యువ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, నాని ఇలా పలువురి పేర్లు ఇటీవల తెర మీదకు వచ్చాయి. అయితే వారెవరూ కాదని, మరొక్కసారి కింగ్ నాగార్జునే హోస్ట్ గా ఉండనున్నట్లు టాక్.
బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ 2025
మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం తాజాగా కంటెస్టెంట్స్ యొక్క వేటని మొదలుపెట్టరారట టీమ్. ముఖ్యంగా ఈసారి సీజన్ 9 ని మరింత క్రేజీగా అలానే ఇంట్రెస్టింగ్ గా మలిచేందుకు వారు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. రానున్న 9వ సీజన్లో సినిమా, టివి, యూట్యూబ్ ఇన్ఫ్లు యెన్సర్స్ తో పాటు ఇద్దరు సామాన్యులు కూడా పాల్గొననున్నట్లు చెప్తున్నారు.
ఇప్పటివరకు సీజన్స్ లో కూడా సామాన్య వ్యక్తులు పాల్గొన్నప్పటికీ ఒకరు మాత్రం ఉండేవారు, అయితే ఈసారి మరొకరు కూడా ఉండే ఛాన్స్ ఉందట . అయితే దీని పై మేకర్స్ నుండి కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. ఇక ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే బిగ్ బాస్ షో ఈసారి ఒకింత ముందుగానే ప్రారంభం కానుందని కూడా టాక్.
కొందరైతే జూన్ లేదా జులై లో ప్రారంభం ఉంటుందని కూడా చెప్తున్నారు. కానీ పక్కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పార్రంభం పై పక్కా క్లారిటీ లేదు. ఇక ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కంటెస్టెంట్స్ కి ఇచ్చే టాస్కుల విషయంలో కూడా మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.
బిగ్ బాస్ తెలుగు ఈ వారం ఎలిమినేషన్ ఎవరు?
టాస్క్ ల ద్వారా కంటెస్టెంట్స్ చేసిన పెర్ఫార్మన్స్ ని బట్టి షోలో మర్క్స్ తో పాటు ముఖ్యంగా ఆడియన్స్ నుండి వారికి వచ్చే ఆదరణ, వోటింగ్ అనేది చాలా కీలకంగా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వారందరిలో ఎవరు అయితే ఎక్కువగా ఆడియన్స్ ఆదరణని అలానే భారీ స్థాయి ఓటింగ్స్ ని అందుకుని ముందుకు సాగుతారో వారే ప్రతి ఏడాది విజేతగా నిలుస్తారు.
ఇక ఆడియన్స్ వోటింగ్ కోసం ఫోన్ లైన్స్ తో పాటు ఆన్లైన్ వోటింగ్ కూడా ఇటీవల కొన్నేళ్లుగా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ఎక్కువగా సోషల్ మీడియాని విరివిగా వినియోగిస్తుండడంతో ఓట్లు కూడా ప్రతి ఏడాది పెరుగుతున్నాయని అంటున్నారు.
బిగ్ బాస్ తెలుగు లైవ్ ఓటింగ్ ఫలితాలు
అలానే బాగా ఆడియన్స్ పల్స్ పట్టుకుని అందరినీ ఆకట్టుకుని బిగ్ బాస్ షో లో వ్యవహరించే టాప్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం మిగతా వారితో పోలిస్తే ఒకింత ఎక్కువగా ఓటింగ్ నమోదు అవుతున్నట్లు టాక్. అలానే ప్రతి ఏడాది కొందరు కీలకంగా బాగా వ్యవహరించి నడుచుకునే కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ శాతంలో అంత పెద్ద తేడా అయితే ఉండడం లేదట.
ఇక మొత్తంగా షో అంతటా బాగా పెర్ఫార్మ్ చేసిన కంటెస్టెంట్ తో పాటు అన్ని విధాలుగా ఆడియన్స్ ని మెప్పించి రానున్న బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలి అంటే మరికొన్ని నెలల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక త్వరలో సీజన్ 9 గురించిన అప్ డేట్స్ అన్ని కూడా ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ టీజర్ నుండి వరుసగా వస్తాయట. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి ఎంతమేర ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూద్దాం.
What's Your Reaction?






