Godavari Telugu Movie: A Timeless Love Story by Sekhar Kammula
Explore the story, cast, and legacy of Sekhar Kammula’s 2006 Telugu classic “Godavari,” a soulful film that redefined romance on screen.

తొలిసారిగా తన డైరెక్షన్ కెరీర్ ని డాలర్ డ్రీమ్స్ అనే మూవీ ద్వారా ఆరంభించారు దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). తన అమిగోస్ క్రియేషన్స్ సంస్థ పై ఆయన నిర్మించి తెరకెక్కించిన ఆ మూవీ 2000వ సంవత్సరంలో రిలీజ్ అయింది. అనంతరం 2004లో రాజా, కమలిని ముఖర్జీ లతో ఆయన తీసిన మూవీ ఆనంద్ (Anand) మంచి కాఫీ లాంటి సినిమా.
ఈ మూవీ అప్పట్లో క్లాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల తీసిన మూవీనే గోదావరి. ఈ మూవీలో సుమంత్ (Sumanth) హీరోగా నటించగా కమలిని ముఖర్జీ (Kamalini Mukherji) హీరోయిన్ గా నటించారు. నీతూ చంద్ర, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, కరాటే కళ్యాణి, మధుమని, సివిఎల్ నరసింహారావు తదితరులు కీలక పాత్రలు చేసారు.
గోదావరి చిత్రం – ఒక మధురమైన ప్రేమ కథ
ఎస్ ఎస్ సి ఆర్ట్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీకి కేఎం రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చారు. విజయ్ సి కుమార్ ఫోటోగ్రఫి అందించిన గోదావరి (Godavari) మూవీ 19 మే 2006న మంచి అంచనాల నడుమ థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రేక్షకాభిమానులని ఎంతో ఆకట్టుకుంది.
కథ పరంగా సింపుల్ గా చెప్పాలి అంటే, పాలిటిక్స్ లోకి వెళ్లి దేశానికి ఏదైనా మేలు చేయాలని భావించే ఒక యువకుడి జీవితంలోకి ఒక అమ్మాయి అనుకోని ప్రయాణం ద్వారా ప్రవేశించడం, అక్కడి నుండి పలు మలుపులు తిరిగిన అతడి జీవితం ప్రేమగా మారి ఆపైన చివరికి ఆమెతో ఒకటయ్యేలా చేస్తుంది.
godavari telugu movie
ఆకట్టుకునే ఫ్యామిలీ, లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అని చెప్పాలి. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ గా నటించిన సుమంత్, కమలిని ముఖర్జీ ల పాత్రలు, వారి నటన ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటుంది.
శేఖర్ కమ్ముల టచ్‌తో వచ్చిన క్లాసిక్ మూవీ
వారిద్దరితో పాటు సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉండడంతో పాటు తెరపై పాత్రలన్నీ కూడా మన ఇంట్లో వారు మాదిరిగా అనిపిస్తాయి. మరోవైపు రాధాకృష్ణన్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో హృద్యంగా ఆకట్టుకున్నాయి. ఎక్కువగా క్లాస్ ఆడియన్స్ ని మెప్పించిన గోదావరి మూవీ చాలా ఏరియాల్లో బాగా కలెక్షన్ రాబట్టింది.
ఇక సపోర్టింగ్ పాత్రల్లో నటించిన నీతూ చంద్ర (Neethu Chandra), కమల్ కామరాజు కూడా ఎంతో ఆకట్టుకుంటారు. అలానే మాస్టర్ శివ, అతడి కుక్క కోటిగాడు అయితే ఎంతో మంచి నవ్వులు పూయిస్తాయి. వాస్తవానికి ఎన్నో ఏళ్ళ క్రితం లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరావు హీరోగా లత హీరోయిన్ గా బాపు తెరకెక్కించిన అందాల రాముడు చిత్రం మాదిరిగా దీనిని కూడా భద్రాచల ప్రయాణం నేపథ్యంలో చాలా వరకు సినిమాని బోటు పై చిత్రీకరించి అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.
sekhar kammula movies
కాగా గోదావరి మూవీ ద్వారా ఆ ఏడాది బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డుని శేఖర్ కమ్ముల అందుకున్నారు. అలానే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నిలిచిన గోదావరి మూవీకి సంగీతం అందించిన కేఎం రాధాకృష్ణన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా, ఛాయాగ్రాహకుడు విజయ్ సి కుమార్ కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా, అలానే ఇందులోని అందంగా లేనా సాంగ్ ని అద్భుతంగా పాడిన సింగర్ సునీతకు బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా నంది అవార్డులు లభించాయి.
మంచి హృద్యమైన చిత్రాలు కోరుకునే వారికి గోదావరి సినిమా ఎంతో బాగా నచ్చడంతో పాటు మనసులో మంచి ముద్ర వేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. సినిమా కొంత నడిచిన అనంతరం అలా బోటు పై వెల్తూ సినిమా సాగుతూ ఉండడం, మధ్యలో పలు ఫ్యామిలీ, లవ్, యాక్షన్, కామెడీ సీన్స్ తో పాటు మదిని తాకే చక్కని సాంగ్స్ వంటివి ఈ మూవీ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.
గోదావరి సినిమా కథ, నటులు, లొకేషన్లు
అంతకముందు ఆనంద్ మూవీ విజయం తో మంచి పేరు సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల గోదావరి ద్వారా మరొక విజయం తన ఖాతాలో వేసుకుని అప్పటి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలానే హీరో సుమంత్ తో పాటు కమలిని ముఖర్జీ ల కెరీర్ కి కూడా గోదావరి మూవీ మంచి బూస్ట్ ని అందించిందని చెప్పాలి.
telugu classic love stories
సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్ కి కూడా అక్కడి నుండి ఇంకా క్రేజ్ పెరిగింది. ఆ విధంగా ఆ ఏడాది మండు వేసవిలో చల్లని హాయిని అందించింది గొడవారి మూవీ. మరి ఇంకా నేటి తరంలో ఈ మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే వెంటనే చూసి ఎంజాయ్ చేయండి మరి. కాగా ఇటువంటి లేటెస్ట్ తెలుగు మూవీ అప్ డేట్స్ తో పాటు లేటెస్ట్ న్యూస్ కోసం మా Telugu Movie Media వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి
What's Your Reaction?






