Mission Impossible Final Reckoning New Release Date 2025 | Latest Update
Mission Impossible Final Reckoning Final Chapter gets a new release date in 2025. Check full details about cast, release, and more updates here

హాలీవుడ్ స్టార్ యాక్టర్ టామ్ క్రూజ్ (Tom Cruise) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ (Mission Impossible: The Final Reckoning). ఈ మూవీని క్రిసోఫెర్ మెక్కెర్రీ తెరకెక్కించగా స్కై డాన్స్ మీడియా, టిసి ప్రొడక్షన్స్ సంస్థలు హై టెక్నీకల్ వాల్యూస్ తో అలానే భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.
టామ్ క్రూజ్ తో పాటు మెక్కెర్రీ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీలోని ఇతర కీలక పాత్రల్లో హేలే ఆట్వెల్, వింగ్ రెమ్స్, సైమన్ పెగ్, వనేసా కిర్బీ, ఎసై మొరలెస్ తదితరులు నటించారు. ఇక మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
"Mission Impossible: ఫైనల్ రెకనింగ్" కొత్త విడుదల తేదీ
ముఖ్యంగా హీరో టామ్ క్రూజ్ కి అన్ని దేశాలతో పాటు మన దేశంలో కూడా అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సిరీస్ సినిమాల ద్వారా హీరోగా ఎక్కువగా నాచురల్ స్టంట్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న టామ్ క్రూజ్ ఇందులో ఈతన్ హంట్ పాత్రలో నటించారు. ఇక ఈ పాత్రకు యువతలో మరింత విశేషమైన క్రేజ్ ఉంది.
ఇటీవల వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ మూవీకి ఇది డైరెక్ట్ సీక్వెల్. ఇక ఇటీవల రిలీజ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మూవీ పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ప్రపంచ మూవీ లవర్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి.
వాస్తవానికి తమ మూవీని 2025 మే 23న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు చాలా రోజుల క్రితం ప్రకటించిన మూవీ టీమ్, తాజాగా రిలీజ్ డేట్ ని ప్రీ పోన్ చేసింది. ఈ సిరీస్ లోని ఎనిమిదవ చిత్రంగా మరింతగా ఆకట్టుకునే స్పై, యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో తమ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో చిత్రీకరించినట్లు తాజాగా టీమ్ తెలిపింది.
టామ్ క్రూజ్ నటించిన ఈ సినిమాకి తాజా అప్డేట్స్
అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ మూవీ ఇండియాలో ఆరు రోజుల ముందుగా అంటే మే 17న తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు పారామౌంట్ ఇండియా టీమ్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనౌన్స్ చేసింది. తొలిసారిగా 1996లో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్ లోని మొదటి మూవీ ప్రపంచ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
అక్కడి నుండి వరుసగా ఈ సిరీస్ యొక్క సినిమాల పరంపర మొదలైంది. ప్రతి చిత్రంలో కూడా ఆసక్తికరమైన కథ, కథనాలు ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు ఈతన్ హంట్ పాత్రలో టామ్ క్రూజ్ యాక్టింగ్, అతడు చేసే నాచురల్ పెర్ఫార్మన్స్, స్టంట్స్ ఎంతో అలరించాయి.
"Mission Impossible: ఫైనల్ చాప్టర్" విడుదల తేదీ మార్పుకు కారణాలు
ఇక ఈ సిరీస్ లోని ఆఖరి చిత్రం అయిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మూవీ నిడివి పరంగా కొంత ఎక్కువగానే ఉంటుందని టీమ్ తెలిపింది. మరోవైపు ఇండియాలో ఈ మూవీ ఆరో రోజుల ముందుగా విడుదలవుతుండడంతో ఇక్కడి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామా అని ఎంతో ఉత్సాహభరితంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ ని మొత్తంగా ఎంతమేర కలెక్షన్ ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
What's Your Reaction?






