HIT 3 First Review: Nani’s Mass Elevation Scenes and Good Music Score Impress
HIT 3 First Review is out! Nani delivers powerful mass elevation scenes with a strong music score. Read the full review and audience reactions.

నాచురల్ స్టార్ నాని హీరోగా తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 3. గతంలో హిట్ ఫ్రాంచైజ్ లో రూపొందిన రెండు సినిమాల్లో యువ నటులు విశ్వక్సేన్, అడివి శేష్ ఇద్దరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకోవడంతో పాటు ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ పరంగా మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.
దానితో తాజాగా తెరకెక్కిన హిట్ 3 పై అందరిలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈమూవీ ప్రారంభంలో రిలీజ్ అయిన పోస్టర్స్ తో పాటు తాజాగా రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని కూడా నాని ఫ్యాన్స్ ని నార్మల్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ విధంగా రోజు రోజుకు అందరిలో ఎంతో హైప్ ఏర్పరిచిన ఈ మూవీ మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
HIT 3 ఫస్ట్ రివ్యూ: నాని మాస్ ఎలివేషన్ సీన్స్ అద్భుతం
ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్స్, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్స్ పై ప్రశాంత్ తిపిర్నేని తో కలిసి నాని గ్రాండ్ గా నిర్మించారు. కన్నడ అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సూర్య శ్రీనివాస్, అదిల్ పాల, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు చేసారు.
ఇక ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హిట్ 3 మూవీ వారి నుండి ఏ సెర్టిఫికెట్ అందుకుంది. అయితే గ్లింప్స్ టీజర్ రిలీజ్ అనంతరమే ఈ మూవీ వ్లయొలెన్స్ తో కూడి ఉంటుందనేది ఆడియన్స్ కి ఆల్మోస్ట్ అర్ధం అయిపోయిందని, అందుకే మేము అదే మాట చెప్తున్నాం అంటూ ఇటీవల హీరో నాని మాట్లాడుతూ చెప్పారు. అయితే దర్శకుడు శైలేష్ తో పాటు హిట్ 3 మూవీ కోసం టీమ్ మొత్తం కూడా రేయింబవళ్లు ఎంతో కష్టపడ్డరని అన్నారు.
HIT 3 సినిమాలో హైలైట్ అయిన మ్యూజిక్ స్కోర్
తప్పకుండా ఈసారి ఆడియన్స్ ని తమ మూవీ మరింతగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ అందుకుంటుందని ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు. మరోవైపు ఈ మూవీ యొక్క ప్రీ టికెట్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అటు ఓవర్సీస్ లో ముఖ్యంగా యుఎస్ఏ లో హిట్ 3 బాగా ప్రీ బుకింగ్ జరుపుకుంటోంది.
ఇక లేటెస్ట్ గా సెన్సార్ రిపోర్ట్స్ అనంతరం 2 గంటల 37 నిమిషాల నిడివి గల ఈ మూవీ పై టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు కథ, కథనాలకు ఇంప్రెస్ అయినట్లు చెప్తున్నారు.
అందుతున్న సమాచారాన్ని బట్టి హిట్ 3 మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా పరిశోధనాత్మకంగా సాగుతుందని, అలానే సెకండ్ హాఫ్ సర్వైవల్ కథతో సాగుతుందని అంటున్నారు. ఇటీవల ఎంతో ప్రాచుర్యం పొంది సక్సెస్ సాధించిన స్క్విడ్ గేమ్ సిరీస్ మాదిరిగా ఇంట్రెస్టింగ్ ప్లాట్ ట్విస్ట్ తో సాగే ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాచురల్ స్టార్ గా నాని పెర్ఫార్మన్స్ అదరహో అనే స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు. హీరో నాని మాస్ యాక్షన్ తో పాటు ఎలివేషన్ సీన్స్ ని దర్శకుడు శైలేష్ అద్భుతంగా తీసారని, మిక్కీ జె మేయర్ సాంగ్స్ తో పాటు బ్యాక్ స్కోర్ కూడా మరొక రేంజ్ లో ఉంటుందని టాక్. కెమెరా మ్యాన్ సను జాన్ వర్గేసే విజువల్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అట.
HIT 3 ప్రేక్షకుల మొదటి స్పందన ఎలా ఉంది?
ఓవరాల్ గా ఫస్ట్ సీన్ నుండి ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా దాదాపుగా అనెక్స్ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు ఇంట్రెస్టింగ్ గా సాగుతాయని టాక్. అయితే వయొలెన్స్ పార్ట్ మాత్రం ఎక్కువే ఉందని, మొత్తంగా మూవీ థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ తప్పకుండా తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుని విజయవంతం అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి అందంతో పాటు అభినయంతో కూడిన పాత్రలో ఆకట్టుకుంటారని అంటున్నారు.
ఇక ప్రీ రిలీజ్ పరంగా బాగా మార్కెట్ అందుకున్న ఈ మూవీ ఓవరాల్ గా సక్సెస్ గా నిలవాలంటే రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద రూ. 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టాలి. అయితే ఫస్ట్ షో నుండే మంచి టాక్ వస్తే నాని రేంజ్ కి ఇది పెద్ద కష్టం ఏమి కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. మరొక నాలుగు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్న హిట్ 3 మూవీ మంచి విజయం అందుకుని నటుడిగా నాని రేంజ్, మార్కెట్ మరింతగా పెంచాలని కోరుకుంటూ టీమ్ కి ముందస్తు సక్సెస్ శుభాభినందనలు
What's Your Reaction?






