Vijay Deverakonda Upcoming Movies 2025 : Interesting Updates about His Upcoming Movies

Check the complete list of Vijay Deverakonda’s upcoming movies in 2025 with release dates and updates.

Vijay Deverakonda Upcoming Movies 2025 : Interesting Updates about His Upcoming Movies

టాలీవుడ్ యంగ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవదకొండ తొలిసారిగా హీరోగా నటించిన మూవీ పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ తీసిన ఈ మూవీ అప్పట్లో మంచి విజయం సొంతం చేసుకుంది. అనంతరం సందీప్ రెడ్డి వంగాతో తీసిన అర్జున్ రెడ్డి మూవీతో పెద్ద విజయం అందుకుని టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగారు. 

అనంతరం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి విజయ్ దేవరకొండ చేసిన మూవీ గీతా గోవిందం. అప్పట్లో రిలీజ్ అనంతరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోకుండా ముందుకు సాగిన విజయ్ ఆపైన పలు మంచి పేరు సొంతం చేసుకున్నారు. 

విజయ్ దేవరకొండ రాబోయే సినిమాల జాబితా 2025

ఇక మధ్యలో భరత్ కమ్మ దర్శకత్వంలో చేసిన డియర్ కామ్రేడ్, ఇటీవల సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన ఖుషి సినిమాల విజయాలు నటుడిగా విజయ్ దేవరకొండ కెరీర్ కి మరింత ప్లస్ అయ్యాయి. అలానే మహానటి, కల్కి 2898 ఏడి సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి కూడా ఆకట్టుకున్నారు విజయ్. 

ఇక తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవ్ కింగ్డమ్. ఈ మూవీలో యువ అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

విడుదల తేదీలు మరియు పూర్తి సమాచారం

తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మే 30న గ్రాండ్ గా భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది కింగ్డమ్ మూవీ. 

ఇక ఈ మూవీలో వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కీలక పాత్ర చేస్తుండగా దీనిని దాదాపుగా రూ. 110 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం కింగ్డమ్ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. 

ఇక ఈ మూవీ అనంతరం ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన అనే మాస్ మూవీ చేయనున్నారు విజయ్ దేవదకొండ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ మొత్తం పూర్తి కావచ్చిన ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్లానింగ్ జరుగుతోంది. 

తాజా ప్రాజెక్టుల లిస్ట్

గతంలో రాజా వారు రాణి వారు, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలు తీసి మంచి విజయాలు సొంతం చేసుకున్న రవికిరణ్ చేయనున్న ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుందని, అలానే తమ బ్యానర్ నుండి ఈ మూవీ ద్వారా మరొక భారీ విజయం ఖయాం అని రౌడీ జనార్ధన గురించి తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు తెలిపారు. 

అయితే ఈ రెండు సినిమాల అనంతరం మరొక ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు విజయ్. అలానే స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయనుండగా అది రూపొందడానికి మరికొంత టైం పెట్టె అవకాశం ఉంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow