Allu Arjun & Prashanth Neel Ravanam Movie – Massive Pan-India Actioner
Allu Arjun teams up with KGF director Prashanth Neel for Ravanam, a powerful pan-India film loaded with action & style. Check details, cast, and release

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల సుకుమార్ తీసిన పుష్ప 2 ది రూల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి కెరీర్ పరంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి పెద్ద విజయం సొంతం చేసుకున్న పుష్ప ది రైజ్ మూవీకి సిక్కుల అనేది మనకు తెలిసిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఫస్ట్ పార్ట్ విజయంతో సెకండ్ పార్ట్ పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.
అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కొత్త సినిమా ‘రావణం’ వివరాలు
ఇక గత ఏడాది రిలీజ్ అనంతరం పుష్ప 2 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్ పరంగా రూ. 1800 కోట్లకు పైగా సంపాదించి హీరోగా అల్లు అర్జున్ క్రేజ్ తో పాటు మార్కెట్ ని కూడా విపరీతంగా పెంచేసింది. ఇక పుష్ప పార్ట్ 1 మూవీలో అద్భుత నటనకు గాను ఏకంగా భారత దేశ ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అనంతరం పుష్ప పార్ట్ 2 లో సూపర్ యాక్టింగ్ కి గాను తాజాగా తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో భాగంగా బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు.
ఆ విధంగా పుష్ప మూవీ ఆడియన్స్ రివార్డ్స్, అవార్డ్స్ తో పాటు బ్లాక్ బస్టర్ రివార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంట్రటైనేర్ గా రూపొందిన పుష్ప ది రూల్ మూవీలో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న పాత్రకు కూడా మంచి పేరు లభించింది.
Prashanth Neel Movie
ఇక ఆ మూవీ భారీ విజయం అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక భారీ మైథలాజికల్ మూవీ అనౌన్స్ చేసారు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్, హారికా హసీ క్రియేషన్స్ సంస్థలు ఆ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు వారి నుండి అఫీషియల్ పోస్టర్ కూడా వచ్చింది.
అయితే అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ని ప్రక్కన పెట్టిన అల్లు అర్జున్, సడన్ గా కోలీవుడ్ యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు. మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొనె, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ అందాల కథానాయికలు కీలక పాత్రల్లో నటించనున్న ఈమూవీ గ్రాండ్ గా రూపొందనున్న పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనుంది.
కేజీఎఫ్ డైరెక్టర్ కాంబో – మాస్ యాక్షన్ తో ఫ్యాన్స్ లో ఊపు
ప్రముఖ తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం ముంబైలో వేగంగా జరుగుతోంది. దీనిని తన కెరీర్ లో ది బెస్ట్ గా అలానే అల్లు అర్జున్ కెరీర్ లో కూడా అద్భుతంగా నిలిచేలా అట్లీ తెరకెక్కిస్తున్నారట.
KGF Director Next
ఇప్పటికే పలు హాలీవుడ్ స్టూడియోస్ ని కూడా ఈ మూవీ యొక్క టీమ్ సంప్రదించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి అందరిలో మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచింది. మరోవైపు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ త్వరలో ది రాజా సాబ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్దమవవుతున్నారు.
ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా మారుతీ తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు హను రాఘవపూడితో ఒక మూవీ కూడా చేస్తున్న ప్రభాస్, త్వరలో సందీప్ రెడ్డి వంగా తీయనున్న స్పిరిట్ మూవీ షూట్ లో కూడా జాయిన్ కానున్నారు. ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలున్నాయి.
కథ, నటీనటులు, షూటింగ్ అప్‌డేట్స్ & రిలీజ్ వివరాలు
అయితే త్వరలో ప్రభాస్ తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రావణం అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని నిర్మించనున్నారని, దీనిని కెజిఎఫ్, సలార్ సినిమాల దర్శకడు ప్రశాంత్ నీల్ తీయనున్నారని వార్తలు వచ్చాయి. కాగా ప్రశాంత్ యొక్క డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ పై ఆయన ఎన్నో ఏళ్ళ నుండి స్క్రిప్ట్ పై బాగా వర్క్ చేస్తున్నారట.
ఇక ఇటీవల ఈ వార్తలు విరివిగా ప్రచారం కావడంతో ఈ కాంబో మూవీ ఫిక్స్ అని అందరూ భావించారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం రావణం మూవీ అల్లు అర్జున్ వద్దకు చేరినట్లు చెప్తున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీ చేయాలనీ ఎన్నాళ్ల నుండో దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు, ప్రస్తుతానికి ఆ మూవీని వేరొక నటుడితో చేసి త్వరలో రావణం మూవీనే అల్లు అర్జున్ తో చేయలేనిది రాజు ఆలోచన అట.
మరోవైపు ప్రభాస్ తన మూడు సినిమాల అనంతరం కల్కి 2, సలార్ 2 తో పాటు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ లతో కూడా సినిమాలు చేయాల్సి ఉండడం, ఆ విధంగా కొన్నేళ్ల పాటు ఆయన కాల్షీట్స్ దొరికే అవకాశం లేకపోవడం వల్లనే దిల్ రాజు రావణం మూవీని అల్లు అర్జున్ తో చేయాలని ఫిక్స్ అయ్యారట.
అయితే ప్రభాస్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ కల్గిన నటులకు ఆ మూవీ బాగుంటుందని, త్వరలో ఈ మూవీ యొక్క పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. ఇప్పటికే నితిన్ తో ఎల్లమ్మ, ఆశిష్ తో దేత్తడి, మరొక రెండు చిన్న సినిమాలు లైన్లో పెట్టిన దిల్ రాజు, వాటి అనంతరం ఈ భారీ మూవీని గ్రాండ్ స్కేల్ లో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారట.
Telugu Pan India Movies
మరోవైపు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు ప్రశాంత్ నీల్, అది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈలోపు సలార్ 2 కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈ రెండింటి అనంతరమే రావణం పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందట. అప్పటికి అల్లు అర్జున్ కమిట్మెంట్స్ కూడా పూర్తి అవుతాయట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ భారీ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తి వాస్తవాలు తెలియాలి అంటే ఆ మూవీ టీమ్ నుండి అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సిందే.
What's Your Reaction?






