Brahma Anandam OTT Release Date, Platform, and Watch Online Info
Know the OTT release date, platform, and how to watch Brahma Anandam movie starring Brahmanandam and Raja Gautam.

తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ హాస్య నటుల్లో బ్రహ్మానందం గురించి అసలు ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పాలి. తొలిసారిగా ఒకప్పటి దివంగత దిగ్గజ దర్శకుడు జంధ్యాల (Jandhyala) తీసిన అహ నా పెళ్ళంట (Aha Naa Pellanta) మూవీ ద్వారా టాలీవుడ్ కి కామెడియన్ గా పరిచయం అయిన బ్రహ్మానందం, ఆ మూవీ యొక్క భారీ విజయంతో పాటు అందులో అరగుండు పాత్ర లో ఆయన కనబరిచిన నటన ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తుంది.
బ్రహ్మ ఆనందం ఓటీటీ విడుదల వివరాలు
అక్కడి నుండి మెల్లగా కెరీర్ పరంగా ఎన్నో సినిమాల అవకాశాలు సొంతం చేసుకున్న కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) అనతి కాలంలోనే తన కామెడీ గిలిగింతలతో తెలుగు ఆడియన్స్ మనసులో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో ఎందరో కమెడియన్స్ ఉన్నప్పటికీ బ్రహ్మానందం తెరపై అలా ఒకసారి కనపడితే చాలు థియేటర్స్ మొత్తం నవ్వుల పువ్వులే.
ఆ విధంగా ఒకానొక సమయంలో పెద్ద నటులకు ఆల్మోస్ట్ సమన స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న బ్రహ్మానందం ఇటీవల హార్ట్ సర్జరీ అనంతరం కెరీర్ పరంగా ఎంతో సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తరుణ్ భాస్కర్ తీసిన కీడా కోలా తో పాటు దాని అనంతరం ఆయన పెద్ద కుమారుడు రాజగౌతమ్ ప్రధాన పాత్రలో రూపొందిన బ్రహ్మా ఆనందం మూవీలో ఒక ప్రధాన పాత్ర చేసారు. (Brahma Anandam Review)
విడుదల తేదీ మరియు ప్లాట్‌ఫారమ్
నిజజీవితంలో గౌతమ్ కి తండ్రి అయిన బ్రహ్మానందం, ఆ మూవీలో మాత్రం ఆయనకు తాతయ్య పాత్ర చేశారు ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈమూవీ బకాఫీస్ వద్ద బాగానే విజయం అందుకుంది. ముఖ్యంగా సినిమాలో కీలకమైన వృద్ధుడి పాత్రలో బ్రహ్మానందం కనిపించగా ఆయనకి జోడీగా సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి కనిపించారు.
ప్రియా వడ్లమాని (Priya Vadlamani), వెన్నెల కిషోర్ (Vennela Kishore), దివిజ, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల తదితరు ఇతర పాత్రలు పోషించిన ఈ మూవీని యువ దర్శనుకఁడు ఆర్ వి ఎస్ నిఖిల్ తెరకెక్కించగా రాహుల్ యాదవ్ నక్కా గ్రాండ్ గా నిర్మించారు. కామెడీ తో పాటు హృద్యమైన ఎమోషన్స్ ప్రధానంగా ఈ మూవీ సాగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వంటి వారు బ్రహ్మా ఆనందం మూవీని తమవంతుగా ప్రచారం చేసి దానిని ఆడియన్స్ కి మరింతగా చేరువ చేసారు. ఢిల్లీలో జరిగే కళారంగ్ నాటక మహోత్సవాల్లో నాటకం ప్రదర్శించి అందరి నుండి మన్ననలు అందుకోవాల్నే ఆలోచన గల బ్రహ్మ అనే యువకుడు, అందుకోసం రూ. 6 లక్షల డబ్బు అవసరం అవడంతో ఆ డబ్బు ఎలాగైనా సంపాదించాలని పలు ప్రయత్నాలు చేస్తాడు. (Brahma Anandam Review)
ఆ తరువాత అనుకోకుండా తాతయ్యని కలుసుకున్న అతడికి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి, మరి అతడికి తాతయ్య సహాయం చేశాడా, ఫైనల్ గా అతడి యొక్క కోరిక తీరిందా అనేది మొత్తం కూడ మనం మూవీలో చూడాల్సిందే. తాతయ్య మనవళ్ల మధ్య సాగె ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీని దర్శకుడు నిఖిల్ బాగానే తీశారు.
అయితే అక్కడక్కడా నెమ్మదించే కొంత కథనం ఆకట్టుకోదు, ఇక ఎమోషన్ కూడా మరింత బలంగా ఉంటె బాగుండేదనిపిస్తుంది. మరోవైపు బ్రహ్మానందం, రాజా గౌతమ్ ల యాక్టింగ్, కామెడీ వంటివి ఈ మూవీకి ప్రధాన బలాలు గా చెప్పవచ్చు. ఓవరాల్ గా ఫ్యామిలీ తో సరదాగా ఒక మంచి సినిమా చూశామని ఫీలింగ్ అయితే మనకు వస్తుంది.
చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు
ఇక ఈ మూవీలో రాజా గౌతమ్ నటన ఎంతో బాగుంది, గత చిత్రాలతో పోలిస్తే పలు ఎమోషన్స్ తో పాటు కామెడీ అతడు బాగా పండించాడు. ఇక ఇతర పాత్రలు చేసిన వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, తాళ్లూరి రామేశ్వరి సహా ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది.
ఇక థియేటర్స్ లో బాగానే కలెక్షన్ రాబట్టిన ఈ మూవీ ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో (Brahma Anandam OTT) అందుబాటులోకి వచ్చి ఓటిటి ఆడియన్స్ ని సైతం బాగానే ఆకట్టుకుంది. మొత్తంగా బ్రహ్మానందం మూవీతో నటుడిగా బ్రహ్మి, గౌతమ్ ఇద్దరూ కూడా మరింత మంచి పేరు సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇటువంటి లేటెస్ట్ ఓటిటి అప్ డేట్స్, తెలుగు మూవీ న్యూస్ కోసం మా Telugu Movie Media సైట్ తరచు చూస్తూ ఉండండి
What's Your Reaction?






