Was Mahesh Babu First Choice for Chhaava Movie

Was Mahesh Babu First Choice for Chhaava Movie తాజాగా బాలీవుడ్ నటుడు Vicky Kaushal) హీరోగా యువ అందాల కథానాయిక నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ తో కూడిన హిస్టారికల్

Was Mahesh Babu First Choice for Chhaava Movie

తాజాగా బాలీవుడ్ నటుడు (Vicky Kaushal) హీరోగా యువ అందాల కథానాయిక నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ తో కూడిన హిస్టారికల్ భారీ ఎంటర్టైనర్ మూవీ ఛావా (Chhaava). ఈ మూవీని మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో దినేష్ విజన్ నిర్మించాయి ఆస్కార్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చారు. 

Mahesh Babu Chhaava Movie News

ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తరువాత ఆయన రాజ్యాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దానిని స్వాధీనం చేసుకోవడానికి తన సైన్యంతో దండెత్తడం, ఆ సమయంలో శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ అతడికి అడ్డుపడి వీరోచితంగా పోరాడే ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు లక్ష్మణ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. 

ముఖ్యంగా ఈ మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా హీరో విక్కీ కౌశల్ యాక్షన్ అద్భుతం అని చెప్పాలి. కొన్ని కీలక యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో ఆయన అద్భుత నటన ప్రతి ఒక్కరి మనసు తాకుతుంది. ఇక ఆయన భార్య యేసు భాయ్ భోంస్లే గా రష్మిక మందన్న కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. 

Mahesh Babu Rejected Chhaava?

సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. నిర్మాత దినేష్ విజన్ భారీ నిర్మాణ విలువలతో మూవీ కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకు స్క్రీన్ మీద కనపడుతుంది. అలానే ఫోటోగ్రాఫర్ సౌరభ్ గోస్వామి విజువల్స్ కూడా ఈమూవీ సక్సెస్ లో ఒక ప్రముఖ పాత్ర పోషించాయి. 

ఫస్ట్ డే నుండి హిందీ లో ఈమూవీ సూపర్ హిట్ టాక్ తో రోజురోజుకు సూపర్ గా కలెక్షన్ తో కొనసాగుతూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్లకు పైగా నెట్ కు చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈమూవీ ఇండియాలో రూ. 400 కోట్లకు పైగా నెట్ ని సొంతం చేసుకునే అవకాశం గట్టిగా వినపడుతోంది. 

Chhaava Movie Hero First Choice

కాగా ఈ మూవీని తెలుగుతో పాటు పలు ఇతర పాన్ ఇండియన్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ప్రేక్షకాభిమానులు ఛావా నిర్మాతలని కోరుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ మూవీ మార్చి మొదటివారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. 

కాగా అసలు మ్యాటర్ ఏమిటంటే, వాస్తవానికి ఈమూవీ యొక్క స్టోరీని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కి అలానే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) కి వినిపించారని, కానీ వారిద్దరూ చేయడానికి సుముఖత చూపలేదని వార్తలు రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. 

Mahesh Babu vs Vicky Kaushal Chhaava

కాగా తాజగా ఈ ప్రచారాల పై క్లారిటీ వచ్చింది. వాస్తవం ఏమిటంటే, ఈ మూవీలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రకి విక్కీ కౌశల్ ని దృష్టిలో పెట్టుకునే తీయాలని తాను భావించారట దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. అలానే హీరోయిన్ గా కూడా రష్మిక నే సెట్ అవుతారని ఆమెను ఎంపిక చేశారట. 

అంతేతప్ప హీరో హీరోయిన్స్ పాత్రలకు ఫస్ట్ ఛాయిస్ మహేష్, కత్రినా అనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారట. దీనితో ఒక్కసారిగా ఈ రూమర్లకు చెక్ పడింది. అయితే ఇది కొందరు కావాలని మహేష్, కత్రినా లని టార్గెట్ చేస్తూ చేసిన దుష్ప్రచారం అని పలువురు ఆడియన్స్, ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఓవరాల్ గా ఛావా మూవీ ఎంతమేర కలెక్షన్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.   

Mahesh Babu Bollywood Debut Rumors

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow