Cinema Hyderabad – Latest Telugu Movie Updates & Box Office Collections

Find the latest Cinema Hyderabad news, Telugu movie collections, reviews, trailers, and release updates. Stay tuned for Tollywood box office highlights.

Cinema Hyderabad – Latest Telugu Movie Updates & Box Office Collections

తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం రోజురోజుకు అంచలంచెలుగా జాతీయ స్థాయి, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా దూసుకువెళ్తోంది. ఇక్కడి నుండి ఎందరో నటీనటులు మన సినిమా ఖ్యాతిని ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమ, ఇది మన తెలుగు సినిమా, వీరు మన తెలుగు నటీనటులు అని మనం ఎప్పటికీ సగర్వంగా రొమ్ము విరుచుకుని చెప్పుకునేలా అందరూ నిత్యం ఎంతో కష్టపడుతూ మన సినిమాని ఉన్నత శిఖరాలకి చేరుస్తున్నారు. 

వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమ తొలినాళ్లలో చెన్నైలో ఉండేది. అప్పటి దిగ్గజ నటీనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి వారి సినిమాలు ఎక్కువగా చిత్రీకరణ జరుపుకునేవి. అంతకము ముందు నటులైన నారాయణరావు, చిత్తూరు నాగయ్యల సినిమాలు కూడా అక్కడే చిత్రీకరణ చేసారు. అప్పట్లో విజయా, వాహిని, ఏవిఎం స్టూడియోస్ లో మన నటీనటుల సినిమాలు రూపొందేవి. ఆ తరువాత రాను రాను మెల్లగా చిత్ర పరిశ్రమ మన హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం ప్రారంభించింది. 

సినిమా హైదరాబాద్ టాలీవుడ్ మూవీస్ 

ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ తరువాత అందరూ కూడా ఇక్కడికి రాసాగారు. ఆ విధంగా చిత్ర పరిశ్రమ పూర్తిగా మన తెలుగు రాష్ట్రానికి చేరుకుంది. ఇక ఇటీవల తెలుగు సినిమా యొక్క అభివృద్ధి, ఎదుగుదల చూతుంటే ప్రప్రంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంటోంది. ముఖ్యంగా నిన్న మొన్నటివరకు మన తెలుగు సినిమాలు అంటే కొన్ని భాషలు, జాతీయ స్థాయిలో కొంత తక్కువగా చూసేవారు. 

ఇక ఎప్పుడైనా 2015లో తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ సినిమాలు విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అవి విదేశాల్లో కూడా బాగా ఆడాయి. ఆ విధంగా తెలుగు సినిమా యొక్క పాన్ ఇండియన్ రేంజ్ కి పునాది పడింది. బాహుబలి సిరీస్ సినిమాల్లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ అద్భుతంగా నటించగా దేవసేన గా అనుష్క శెట్టి, భల్లాల దేవ గా రానా దగ్గుబాటి, అవంతిక గా తమన్నా భాటియా, కట్టప్పగా సత్యరాజ్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకాభిమానులని చక్కగా అలరించారు. 

Cinema Hyderabad Tollywood Updates

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆ చిత్రరాజాలను ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే విధంగా గ్రాండియర్ గా ఎక్కడదా కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఆ సినిమాల తరువాత మెల్లగా తెలుగు సినిమాల యొక్క పాన్ ఇండియన్ స్థాయి మెల్లగా పెరగ సాగింది. బాహుబలి 1 మూవీ రూ. 650 కోట్లని ప్రపంచవ్యాప్తంగా రాబడితే, బాహుబలి 2 మూవీ ఏకంగా రూ. 1800 కోట్లు రాబట్టి దేశవ్యాప్తంగా ఇండియాలో అతిపెద్ద సెన్సేషన్ సృష్టించింది. 

వాస్తవానికి దానికంటే ముందుకి అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ ఉన్నప్పటికీ మెజారిటీ దంగల్ యొక్క కలెక్షన్ చైనా నుండి రావడం, ఇక బాహుబలి 2 ఎక్కుడగా ఇండియాలో అత్యధికంగా రాబట్టడం జరిగింది. ఆ తరువాత తెలుగులో పాన్ ఇండియన్ సినిమాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన మూవీ పుష్ప 1 ఎంతో చక్కగా ఆడింది. హిందీ ఆడియన్సు ని తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు అల్లుఅర్జున్. దీని అనంతరం తాజాగా వచ్చిన పుష్ప 2 మూవీ మరింతగా సక్సెస్ సాధించింది. 

టాలీవుడ్ మూవీస్ లేటెస్ట్ అప్ డేట్స్ 

ఈ మూవీ ఏకంగా బాక్సాఫీస్ వద్ద పెను కలెక్షన్స్ సంచలనం సృష్టించి రూ. 1850 కోట్లని రాబట్టింది. ఇక నేషనల్ వైడ్ గా హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్ అందుకున్న మూవీగా ఇండియా వైడ్ పుష్ప 2 టాప్ స్థానంలో నిలిచింది. అంతకముందు వచ్చిన చిరంజీవి సైరా నరసింహారెడ్డి కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కి బాగానే పెర్ఫార్మ్ చేసింది. అలానే ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత చేసిన సినిమా సాహు కూడా హిందీలో బాగానే కలెక్ట్ చేసింది. ఇక అక్కడి నుండి ప్రభాస్ పూర్తి స్థాయి పాన్ ఇండియన్ హీరోగా మారిపోయారు. 


ఆ తరువాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన చేసిన మూవీ రాధేశ్యామ్. ఆపైన ఏకంగా హిందీలో ప్రభాస్ రాఘవగా రామాయణం ఆధారంగా రూపొందిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీని ఓం రౌత్ తీయగా కృతి సనన్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ కూడా బాగానే కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇక 2022లో మరొక్కసారి రాజమౌళి తెరకెక్కించిన మూవీ RRR. తొలిసారిగా నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ కూడా అతి పెద్ద ప్రభంజనం సృష్టించింది వరల్డ్ వైడ్ గా రూ. 1400 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని మరొక్కసారి తెలుగు సినిమా యొక్క ఖ్యాతిని చాటి చెప్పింది. 

Cinema Hyderabad Updates 

ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. అలానే ప్రభాస్ నటించిన సలార్, ఎన్టీఆర్ నటించిన దేవర, అలానే ప్రభాస్ మరొక మూవీ కల్కి 2898 AD మూవీస్ కూడా ప్రభంజనం సృష్టించాయి. వీటిలో కల్కి మూవీ ఏకంగా రూ. 1150 కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఏకంగా హాలీవుడ్ ఆడియన్సు సైతం నోరెళ్లబెట్టారు. 

అంతలా దర్శకుడు నాగ అశ్విన్ ఈ మూవీని ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించారు.  అక్కడి నుండి తెలుగు సినిమావైపు మెజారిటీ గ్లోబల్ ఆడియన్సు చూడసాగారు. ఒకరకంగా హైదరాబాద్ నుండి ప్రస్తుతం గ్లోబల్ గా దూసుకెళ్తున్న మన చిత్ర పరిశ్రమని ఢీ కొట్టేందుకు బాలీవుడ్ లో ఇటీవల ఎన్ని సినిమాలు గ్రాండ్ గా రూపొందుతున్నప్పటికీ మనల్ని అందుకోవడం వారికి సాధ్యం కావడం లేదు. 

టాలీవుడ్ మూవీస్ హైదరాబాద్ అప్ డేట్స్

ముఖ్యంగా బాహుబలి 2, పుష్ప 2, కల్కి 2898 AD సినిమాల కలెక్షన్ ని వారు అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న అనేక సినిమాలతో పాటు పలు బాలీవుడ్ సహా ఇతర భాషల సినిమాలు సైతం హైదరాబాద్ లో రూపొందుతున్నాయి. హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ ఫిలిం సిటీలో అనునిత్యం అనేక సినిమాల యొక్క షూటింగ్స్ జరుపుకుంటూ ఉంటారు. 

ఆ విధంగా మన సినిమా పరిశ్రమకు హైదరాబాద్ తలమానికంగా మారింది. మరోవైపు ప్రస్తుతం తెలుగులో మరిన్ని బడా సినిమాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా అవి అన్ని కూడా పాన్ ఇండియన్ ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్నవి అని చెప్పకతప్పదు. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళిల SSMB29, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ల Spirit, అల్లు అర్జున్ అట్లీల AA22 మూవీ, రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీస్తున్న Peddi, ఎన్టీఆర్ తో నీల్ తీస్తున్న Dragon ఇలా పలు బడా సినిమాలు ఉన్నాయి. 

వీటన్నింటిపై ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాదు మన దేశం అలానే విదేశాల్లోని పలు సినిమా లవర్స్ కూడా ఎంతో ఉత్సాహకరంగా ఎదురుచూస్తున్నారు. ఆ విధంగా హైదరాబాద్ వేదికగా రూపొందుతోన్న మన తెలుగు సినిమాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇండియాని దాటి ఖండాలు కూడా దాటేసి ప్రస్తుతం ప్రపంచ సినిమాని శాసిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మన తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలు చేరడం, ఇకపై ఎవరూ కూడా అందుకోలేనంతగా దూసుకెళ్లడం ఖయాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow