Allu Arjun & Prashanth Neel Movie Locked ?
Allu Arjun collaborates with KGF director Prashanth Neel for a high-octane action entertainer. Official announcement awaited

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల సుకుమార్ తీసిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఇండియా వైడ్ గా సంచలన విజయం సొంతం చేసుకుంది.
అంతకముందు వచ్చిన పుష్ప ది రైజ్ ఘనవిజయంతో దీని పై అందరిలో అంచనాలు పెరగడం అలానే ఈ మూవీ కూడా వాటిని అందుకుని భారీ విజయం సొంతం చేసుకోవడం జరిగింది. ఇక పుష్ప ది రైజ్ మూవీలో తన అద్భుత నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు.
అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ మూవీ ఫిక్స్ ?
అలానే పుష్ప 2 లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫ్యాన్స్ ని సాధారణ ప్రేక్షకులని ఎంతో అలరించారు. మొత్తంగా పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి అటు నార్త్ లో కూడా టాప్ ప్లేస్ లో నిలిచి హీరోగా అల్లు అర్జున్ రేంజ్, క్రేజ్, మార్కెట్ ని విపరీతంగా పెంచేసింది.
అయితే ఆ మూవీ అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గీత ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై ఒక భారీ పాన్ ఇండియన్ మూవీని అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. అయితే ఈ మూవీ ప్లేస్ లోకి సడన్ గా అట్లీ తో అల్లు అర్జున్ మూవీ వచ్చి చేరింది. ఇక ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో ప్రారంభం అయిన అట్లీ మూవీ సైన్స్ ఫిక్షన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
Allu Arjun Prashanth Neel Movie
బాలీవుడ్ అందాల కథానాయిక దీపికా పదుకొనె ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర ఇద్దరు హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాజక్ట్ ని వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు అట్లీ తెరకెక్కించేందుకు దృష్టి పెట్టారట.
పవర్‌పుల్ యాక్షన్ డ్రామా – స్టైల్, మాస్ కలయిక
ఇటీవల అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ తోనే అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క షూటింగ్ కూడా తాజాగా ప్రారంభం అయింది. ఈ మూవీకి యువ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుంగా అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు.
అయితే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 చివర్లో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. అయితే దీని అనంతరం ఇప్పటికే సుకుమార్ తో పుష్ప 3 మూవీ కమిట్ అయ్యారు అల్లు అర్జున్. అలానే ప్రస్తతం ప్రక్కన పెట్టిన త్రివిక్రం మూవీ కూడా తెరకెక్కే అవకాశం ఉంది.
Allu Arjun New Movie Release Date
కాగా అల్లు అర్జున్ తదుపరి మూవీకి సంబంధించి మరొక లేటెస్ట్ గాసిప్ టాలీవుడ్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, త్వరలో కెజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ జతకట్టనున్నట్లు చెప్తున్నారు. ఈ క్రేజీ కాంబినషన్ మూవీ గ్రాండ్ లెవెల్లో గీతా ఆర్ట్స్ సంస్థ పై రూపొందనుందట.
కథా నేపథ్యం, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ అప్‌డేట్స్
ఇప్పటికే ఈ మూవీ కోసం అల్లు అర్జున్, ప్రశాంత నీల్ మధ్య కొన్ని చర్చలు కూడా జరిగినట్లు చెప్తున్నారు. అయితే మరోవైపు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అది పూర్తి అయిన అనంతరం సలార్ 2, కెజిఎఫ్ 3 మూవీస్ ఆయన లిస్ట్ లో ఉన్నాయి.
ఐతే ఈలోపే అల్లు అర్జున్ సినిమా ఉండే అవకాశం ఉందా లేక ఇవి పూర్తి అయిన తీస్తారా అనే దాని గురించి తెలియాలి. మొత్తంగా అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ ప్రాజక్ట్ గురించి టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఒకవేళ ఈ ప్రాజక్ట్ కనుక సెట్ అయితే అటు నేషనల్ గానే కాక ఇంటర్నేషనల్ గా కూడా భారీ బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదవడం ఖాయం.
What's Your Reaction?






