Top Rashmika Mandanna Movies You Shouldn’t Miss

Explore the best movies of Rashmika Mandanna across Telugu, Kannada, and Hindi cinema. Full list with release years, reviews & streaming info

Top Rashmika Mandanna Movies You Shouldn’t Miss

టాలీవుడ్ స్టార్ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి మన తెలుగుతో పాటు ఇతర భాషల ఆడియన్స్ కి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఒక్కో సినిమాతో నటిగా ఎంతో మంచి క్రేజ్ తో ఆమె దూసుకెళ్తున్నారు. అయితే తొలిసారిగా తెలుగులోకి ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు రష్మిక మందన్న. 

Rashmika Mandanna Telugu movies

ఆ మూవీని యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించగా నాగ శౌర్య హీరోగా నటించారు. మంచి అంచనాలతో యూత్ఫుల్ లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ అప్పట్లో బాగా సక్సెస్ అందుకోవడంతో పాటు ఫస్ట్ మూవీతోనే హీరోయిన్ గా రష్మిక కి బాగా పేరు తీసుకువచ్చింది. ఇక ఈ మూవీ అనంతరం వెంటనే యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన హీరోయిన్ గా ఆమెకు అవకాశం లభించింది. 

రష్మిక మందన్న హిట్ సినిమాలు జాబితా

పరశురామ్ దర్శకత్వంలో వారిద్దరూ హీరో హీరోయిన్స్ గా రూపొందిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ గీత గోవిందం (Geetha Govindam). ఇక రిలీజ్ అనంతరం ఎంతో పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ మూవీని గీత ఆర్ట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించగా సాంగ్స్ కూడా విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి.

దానితో హీరోయిన్ గా రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తరువాత నాగార్జున, నాని కలిసి చేసిన దేవదాసు మూవీలో ఒక హీరోయిన్ గా నటించారు రష్మిక మందన్న. ఈ మూవీ అనంతరం మరొకసారి విజయ్ దేవరకొండతో ఆమె చేసిన మూవీ డియర్ కామ్రేడ్. ఇది కూడా బాగానే సక్సెస్ అయింది. 

Rashmika latest movie list 2025

సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో రష్మిక చేసిన మూవీ సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru). ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించగా సీనియర్ నటి విజయశాంతి చాలా ఏళ్ళ అనంతరం ఈ మూవీ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ అనంతరం సరిలేరు నీకెవ్వరు మూవీ అత్యద్బుత విజయం అందుకుని హీరోయిన్ గా రష్మిక క్రేజ్ మరింతగా పెంచేసింది. 

టాప్ తెలుగు సినిమాలు – అభిమానుల కోసం ప్రత్యేకంగా

ఆ తరువాత మరొక్కసారి వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఆమె చేసిన మూవీ భీష్మ కూడా విజయవంతం అయింది. ఇక ఈ సినిమాల ద్వారా తన ఆకట్టుకునే అందం, అభినయంతో హీరోయిన్ గా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్న రష్మిక కి ఆ తరువాత తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రూపొందిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప (Pushpa The Rise) లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. 

సుకుమార్ తీసిన ఈ సినిమా 2021 చివర్లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ అందుకుంది. ఇక అక్కడి నుండి మెల్లగా మరింతగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లిన రష్మిక, అటు తమిళ్ లో కూడా స్టార్స్ సరసన అవకాశాలు అందుకోవడం మొదలెట్టారు. కార్తీ (Karthi)తో ఆమె సుల్తాన్ తో పాటు ఇళయదలపతి విజయ్ (Vijay) తో వారసుడు సినిమాలు చేసి అక్కడ కూడా మంచి విజయాలు అందుకున్నారు. 

అలానే అటు హిందీలో కూడా అవకాశాలు అందుకున్న రష్మిక ఏకంగా బాలీవుడ్ (Bollywood) బిగ్ బి అమితాబ్ (Amitabh Bachchan) ప్రధాన పాత్రలో నటించిన గుడ్ బై తో పాటు మిషన్ మజ్ను సినిమాల అవకాశాలు సొంతం చేసుకున్నారు. అదే సమయంలో అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన ఆనిమల్ (Animal) మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ సొంతం చేసుకున్న రష్మిక మందన్న ఆ మూవీతో నేషనల్ వైడ్ గా ఆడియన్స్ నుండి విశేషమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. 

హిందీ, కన్నడ మూవీస్ – నేషనల్ క్రష్ వర్సటైల్ నటన

ఆ మూవీ దాదాపుగా వరల్డ్ వైడ్ గా రూ. 930 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అందులో గీతాంజలి పాత్రలో తన ఆకట్టుకునే నటన తో అందరినీ అలరించారు రష్మిక. ఇక ఇటీవల అల్లు అర్జున్ హీరోగా పుష్ప 1 కి సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 మూవీలో ఛాన్స్ అందుకున్న రష్మిక, ఆ మూవీతో మరొక అతి పెద్ద ఇండస్ట్రీ పాన్ ఇండియన్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. 

ఆ మూవీ ఏకంగా వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల మేర గ్రాస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఆ మూవీలో శ్రీవల్లిగా పలు కీలక ఎమోషనల్ సీన్స్ లో రష్మిక నటనకు అందరి నుండి మంచి పేరు లభించింది. అలానే అటు హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ఛావా (Chhaava) మూవీలో ఆయన భార్య యేసు భాయి భోంస్లే పాత్ర చేసి తన నటనతో హిందీ ఆడియన్స్ ను కూడా విశేషంగా ఆకట్టుకున్నారు. 

Rashmika upcoming movies 2025

ఆ మూవీ కూడా ఎంతో పెద్ద విజయం అందుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సికందర్ లో రష్మిక హీరోయిన్ గా నటించారు. తాజాగా రిలీజ్ అయిన ఈమూవీ ఆశించిన స్థాయి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. 

ఇక ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మంచి పేరు సొంతం చేసుకున్న రష్మీకి మందన్న చేతిలో పలు క్రేజీ ప్రాజక్ట్స్ ఉన్నాయి. నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush) ల కుబేర (Kubera), లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తున్న రష్మిక మరికొన్ని సినిమాలు ఆమె లిస్ట్ లో ఉన్నాయి. త్వరలో వాటికి సంబంధించి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow