Jr NTR's Latest Movie 2025: Title, Release Date, Cast & All You Need to Know

Check Jr NTR’s upcoming movie news, posters, and release info.

Jr NTR's Latest Movie 2025: Title, Release Date, Cast & All You Need to Know

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Ramarao Jr) హీరోగా ప్రస్తుతం సెట్స్ మీద రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి చేస్తున్న బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2. ఈమూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ పై ఎంతో భారీ వ్యయంతో ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందాల నటి కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకుంది. త్వరలో మూవీకి సంబంధించి ఒక డాన్స్ నెంబర్ ని టీమ్ చిత్రీకరించనుంది. 

జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా అప్డేట్స్

అయితే తాజాగా హీరో హృతిక్ రోషన్ ఒక ఈవెంట్ లో భాగంగా వార్ 2 (War 2) మూవీ గురించి మాట్లాడుతూ, ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అనే మంచి మిత్రుడు తనకు దొరికాడని అన్నారు. ఆయన మంచి మనసున్న వ్యక్తి మాత్రమే కాదు మంచి చెఫ్ కూడా అంటూ ఎన్టీఆర్ పై పొగడ్తల జల్లు కురిపించారు హృతిక్. 

కాగా పక్కాగా తమ మూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా పలు బాషల ఆడియన్స్ ముందుకి రానుందని హృతిక్ తెలిపారు. ఇక ఇటీవల దేవర పార్ట్ 1 (Devara Part 1) మూవీ భారీ విజయంతో కెరీర్ పరంగా మంచి జోరు మీదున్న ఎన్టీఆర్ ఓవైపు వార్ 2 తో పాటు మరోవైపు లేటెస్ట్ గా కెజిఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ (Dragon మూవీ కూడా లైన్లో పెట్టారు. 

ఈ మూవీ ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందుతోందని మేకర్స్ అయిన నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తెలిపారు. ఎన్టీఆర్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే పవర్ఫుల్ మాస్ పాత్రలో ప్రెజెంట్ చేస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరలో షూటింగ్ పూర్తి చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు వారు తెలిపారు. 

కాగా డ్రాగన్ మూవీ 25 జూన్ 2026లో రిలీజ్ కానున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ కూడా ఈ మూవీ యొక్క నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి భువన గౌడ సంగీతం సమకూరుస్తున్నారు. 

నందమూరి హీరో నుంచి కొత్త సినిమా

కన్నడ అందాల నటి రుక్మిణి (Rukmini Vasanth) వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న డ్రాగన్ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాల అనంతరం మరోవైపు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక మూవీ అలానే దేవర పార్ట్ 2 సినిమాలు చేయనున్నారు ఎన్టీఆర్. 

నెల్సన్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిర్మించనున్నారు. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో జైలర్ 2 (Jailer 2) మూవీ తీస్తున్నారు నెల్సన్. అది పూర్తి అయిన అనంతరం పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారని టాక్. 

టైటిల్, ఫస్ట్ లుక్, మరియు రిలీజ్ డేట్

ఇప్పటికే ఎన్టీఆర్ ని పలుమార్లు కలిసి స్టోరీ లైన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట దర్శకడు నెల్సన్. కాగా ఈ మూవీ తరువాత కొరటాల శివతో దేవర పార్ట్ 2 ఉంటుందని అంటున్నారు. కాగా రానున్న జులై లేదా ఆగష్టు లో ఆ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారట దర్శకుడు కొరటాల శివ. 

మొత్తంగా ఈ నాలుగు సినిమాలతో కెరీర్ పరంగా ఎంతో బిజీగా కొనసాగుతున్నారు గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఈ సినిమాలు కూడా ఆయనకి మంచి విజయాలు అందించి మరింత క్రేజ్ ని మార్కెట్ ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవడ్ స్టార్ యొక్క అప్ డేట్స్ కోసం తరచు మన Telugu Movie Media వెబ్ సైట్ ని ఫాలో అవుతూ ఉండండి. మీరు అందిస్తున్న సపోర్ట్ కి ధన్యవాదాలు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow