Kuberaa Telugu Movie Shocking Review – Nagarjuna Dhanush MindBlowing
Kuberaa Telugu movie review: Dhanush delivers a powerful performance in this intense action drama. Check full review, rating, and highlights

కుబేర మూవీ రివ్యూ & రేటింగ్ : Kubera Movie Review Rating
తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ రేటింగ్ : 3. 5 / 5
సినీమా పేరు : కుబేర
విడుదల తేదీ : 20-6-2025
నటీనటులు : నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సర్బ్, దిలీప్ తాహిల్, కల్నల్ రవిశర్మ, సునయన తదితరులు
దర్శకుడు : శేఖర్ కమ్ముల
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు
సంగీతం : దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మిరెడ్డి
Kuberaa Telugu Review
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల కలయికలో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కుబేర. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థలు గ్రాండ్ గా నిర్మించాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈమూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఇలా అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. ఇప్పటివరకు ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీస్ చేసిన శేఖర్ కమ్ముల తొలిసారిగా చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎలా ఉందో, ఎంతమేర ఆడియన్స్ ని మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ :
నీతి, న్యాయం, ధర్మం పరమావధిగా నడుచుకునే సిబిఐ ఆఫీసర్ దీపక్ (అక్కినేని నాగార్జున) కొంతమంది పీటైనా కేసుల కారణంగా కొన్నాళ్లపాటు జైలు పాలవుతాడు. అయితే అతడు నమ్మిన న్యాయం, ధర్మ సిద్దాంతాలు మాత్రం అతడిని కాపాడకపోవడంతో కృంగిపోతాడు. మరోవైపు పారిశ్రామికవేత్త అయిన నీరజ్ మిత్ర (జిమ్ సర్బ్) మన దేశానికి సరిపోయే 15 ఏళ్ళ పాటు నిల్వ ఉండే చమురు నిలవాలని మంత్రితో కలిసి రహస్యంగా ఒప్పందం చేసుకుని కాజేయాలని ప్లాన్ చేస్తాడు.
Dhanush Kuberaa Movie
అయితే ఇటువంటి పెద్ద పనికి దీపక్ వంటి సిబిఐ అధికారి మాత్రమే కరెక్ట్ అని భావించి అతడిని జైలు నుండి బయటకు తీసుకువస్తారు. అయితే అదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రూ. 1 లక్ష కోట్ల రూపాయల సొమ్ముని నాలుగు బినామీ ఖాతాల్లోకి బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే వారు ప్లాన్ చేసి డబ్బు వేయాలని భావించే నలుగురు బిచ్చగాళ్లలో దేవా (ధనుష్) ఒకడు. అనంతరం ఏమి జరిగింది, అతడి ఖాతాలో డబ్బు పడిందా, అసలు దేవా ఎవరు, అతడికి దీపక్ కి ఏంటి సంబంధం, చమురు నిల్వల కథ ఎటు సాగింది అనేది మొత్తం మనం కుబేర మూవీ వెండితెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
వాస్తవానికి గతంలో ఈ విధంగా బినామీ సొమ్ముతో ప్లాన్ చేసి పలు ప్రాజెక్ట్స్ కొట్టేయడం వంటి అంశాలతో గతమూ అనేక సినిమాలు వచ్చినప్పటికీ దానిని బిచ్చగాడితో లింక్ చేసి విభిన్నంగా సాగె కథ, కథనాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల దీనిని చక్కగా రాసుకున్నారు. తన లైఫ్ లో తనకు ఏమి అవసరం లేదు ఉన్నదీ చాలు అనుకునే బిచ్చగాడు ఓవైపు, నీతి నిజాయితీ గల సిబిఐ అధికారి మరోవైపు, వీరితో పాటు దురాశతో డబ్బే ఊపిరిగా బ్రతికే ఒక మోసపూరిత బిజినెస్ మ్యాన్.
మొత్తంగా ఈ మూడు పాత్రల నడుమ సాగె కథగా కుబేర ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో కథ, కథనాలతో పాటు హీరో ధనుష్, ప్రధాన పాత్ర చేసిన నాగార్జునల నటన అద్భుతం అని చెప్పాలి. పలు కీలక సన్నివేశాల్లో వీరిద్దరి పెర్ఫార్మన్స్ నభూతో నభవిష్యతి అని చెప్పకతప్పదు. యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరూ అదరగొట్టారు.
Kuberaa Movie Rating
దాదాపుగా వంద సినిమాలకు చేరువైన నాగ్ తన పాత్రలో ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఆలీనే వెర్సటైల్ యాక్షన్ ధనుష్ కూడా తన మార్క్ నటనతో బిచ్చగాడిగా ఎంతో అలరించారు. రష్మిక మందన్న పాత్ర కూడా ఎంతో బాగుంది. కొన్ని సీన్స్ లో ఆమె పెర్ఫార్మెన్స్ ఎంతో బాగుంది. నెగటివ్ పాత్ర చేసిన జిమ్ సర్బ్ నటన కూడా సూపర్బ్.
అలానే ఇతర పాత్రలు చేసిన దిలీప్ తాహిల్, కల్నల్ రవి మెప్పించారు. లక్ష కోట్ల స్కాం కథగా సాగె ఈ మూవీలో డబ్బున్న వారు, పేద వారి నడుమ సాగె కథగా స్క్రీన్ ప్లే తో శేఖర్ కమ్ముల మెప్పించారు. ఫస్ట్ హాఫ్ నెమ్మది ఉన్నప్పటికీ ఇంటర్వెల్ సీన్ అనంతరం సెకండ్ హాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం, విజువల్స్ కూడా ఎంతో బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
వాస్తవానికి చాలావరకు ఆకట్టుకునే రీతిన అలానే బరువైన ఎమోషనల్ రైడ్ గా కుబేర సాగినప్పటికీ అక్కడక్కడా స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అది మనం గమనించవచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో మధ్యలో అక్కడక్కడా నెమ్మదిస్తుంది. ముఖ్యంగా నాగార్జున, విలన్ మధ్య ట్రాక్ మరింత ఇంట్రెస్టింగ్ గా బలంగా ఉండేలా రాసుకుని ఉండాల్సింది. ఓవరాల్ గా తానూ చెప్పలేనుకున్న కథని చాలావరకు ఇంట్రెస్టింగ్ గానే తీసిన శేఖర్ కమ్ముల అక్కడక్కడా మాత్రం కొంత తడబడ్డట్లు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం :
ముఖ్యంగా కుబేర మూవీకి మరొక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాల్సింది ఫోటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి గురించి. ఓవరాల్ గా మూవీ మొత్తం కూడా ఎంతో గ్రాండియర్ గా అనిపించడంతో పాటు పలు కీలక యాక్షన్ సీన్స్ మరింత బాగా చూపించారు. కథ కథనాలకు తగ్గట్లుగా ఆయన వర్క్ చేసిన తీరు సూపర్. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించి కూడా ఎంతో చెప్పుకున్నా తక్కువే. పోయిరా పోయిరా మామ సాంగ్ తో పాటు పలు కీలక యాక్షన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమోఘం.
Kuberaa Public Talk
అలానే చాలావరకు దేవిశ్రీ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనకి గుర్తుండిపోతుంది. ముఖ్యంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా కుబేర కథని రాసుకుని తీశారు. సెకండ్ హాఫ్ కొంత రేసీగా సాగడంతో పాటు ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. అలానే నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీని ఎంతో గ్రాండియర్ గా విజువల్ వండర్ గా రిచ్ గా ప్రొడక్షన్ పరంగా ఖర్చు చేసినట్లు మనకు వెండితెర పై స్పష్టంగా కనపడుతుంది.
తీర్పు :
మొత్తంగా సోషల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన కుబేర మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా కొంత నెమ్మదించినా ఓవరాల్ గా యాక్షన్, ఎమోషనల్ సీన్స్, నాగార్జున, ధనుష్ ల నటన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, దర్శకుడు శేఖర్ కమ్ముల సూపర్ టేకింగ్ వంటివి కుబేర ని మంచి సక్సెస్ టాక్ అందుకునేలా చేసాయి. వీలైతే ఈ వారం తప్పకుండా మీ మీరు ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో తప్పకుండా మూవీ థియేటర్స్ మాత్రమే ఎంజాయ్ చేసి రా మామా.
ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ మూవీ రివ్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా Telugu Movie Media సైట్ ని చూస్తూ ఉండండి.
What's Your Reaction?






