War 2 vs Coolie: Box Office Clash & Break-even Targets Revealed
War 2 vs Coolie clash: Coolie leads with ₹50–60 crore in global pre-sales and targets ₹600 cr gross; War 2 bids ₹700 cr break-even. Full box office breakdown inside.

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ కలిసి తొలిసారిగా చేస్తున్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ వార్ 2. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీని ప్రంకుఖ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా భారీ వ్యయంతో నిర్మిస్తుండగా దీనిని ఆగష్టు 14న తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
War 2 vs Coolie – బాక్స్ ఆఫీస్ పరస్పర పోరు & బ్రేక్ ఈవెన్ లెక్కలు
ఇటీవల వార్ 2 నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకుని టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్, డ్యాన్స్ నెంబర్ యొక్క ప్రోమో, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా అందరినీ విశేషంగా ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఇటీవల జరిగిన వార్ 2 మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి.
తొలిసారిగా హృతిక్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో సౌత్ తో పాటు హిందీ సినిమాల ఆడియన్స్ లో ఎంతో హైప్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికాలో ఈ మూవీ యొక్క ప్రీ బుకింగ్స్ బాగానే జరుపుకున్నాయి. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ యాక్షన్ మాస్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ కూలీ.
War 2 vs Coolie
ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ నాగార్జున, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో పాటు కన్నడ నటుడు ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు కూలీ న్నీ గ్రాండ్ గా నిర్మించగా దీనిని కూడా ఆగష్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన కూలీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీ పై విపరీతంగా అంచనాలు ఏర్పరిచింది.తన అభిమాన సూపర్ స్టార్ తో తొలిసారిగా చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవల మాట్లాడుతూ కూలీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుదని తెలిపారు.
Coolie ప్రీ-సేల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి క్రేజ్ ఎంత ఉంది
ఇటీవల ధనుష్ తో కలిసి చేసిన కుబేరా మూవీలో ఒక విభిన్న పాత్ర చేసి ఆకట్టుకున్న టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, లేటెస్ట్ గా కూలీ మూవీ ద్వారా తొలిసారిగా విలన్ గా కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాలో అదిరిపోతుందని, తప్పకుండా నాగార్జున కు ఈ పాత్ర ఎంతో పేరు తీసుకువస్తుందని టీమ్ అభిప్రాయపడుతోంది.
War 2 Box Office
ఈ సినిమాని కూడా రేపు అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనుండగా మరోవైపు యుఎస్ఏ సహా పలు దేశాల్లో ఈ మూవీ ప్రీ బుకింగ్స్ కూడా అదరగొట్టింది. అటు కూలీ, ఇటు వార్ 2 రెండు సినిమాలు కూడా భారీ వ్యయంతో రూపొందాయి. ఇక ఈ రెండు సినిమాల యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్, అలానే బ్రేకీవెన్ ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.
'కూలీ' మూవీ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ :-
(Coolie Movie Telugu States Business)
నైజాం - రూ. 16 కోట్లు
సీడెడ్ - రూ. 10 కోట్లు
ఆంధ్ర - రూ. 19 కోట్లు ఆంధ్ర, తెలంగాణ టోటల్ బిజినెస్ - రూ. 45 కోట్లు
బ్రేకీవెన్ - రూ. 46 కోట్లు (షేర్)
కూలీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ :-
(Coolie Worldwide Business Details)
తమిళనాడు - రూ. 120 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - రూ. 45 కోట్లు
కర్ణాటక - రూ. 30 కోట్లు
కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 25 కోట్లు
ఓవర్సీస్ - రూ. 85 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ - రూ. 305 కోట్లు
(బ్రేకీవెన్ - రూ. 610 కోట్లు గ్రాస్)
వార్ 2 మూవీ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ :-
(War 2 Movie Telugu States Business)
నైజాం - రూ. 36.50 కోట్లు
సీడెడ్ - రూ. 18 కోట్లు
ఆంధ్ర - రూ. 36 కోట్లు
ఆంధ్ర, తెలంగాణ టోటల్ బిజినెస్ - రూ. 90. 50 కోట్లు
బ్రేకీవెన్ - రూ. 92 కోట్లు షేర్
వార్ 2 వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ :-
(War 2 Worldwide Business Details)
హిందీ - రూ. 175 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - రూ. 90.50 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 18.50 కోట్లు
ఓవర్సీస్ - రూ. 56 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ - రూ. 340 కోట్లు
బ్రేకీవెన్ - రూ. 700 కోట్లు గ్రాస్
(అయితే ఇది మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మేము వేసిన డీటెయిల్స్, ఒరిజినల్ కి వీటికి కొద్దిపాటి మార్పు ఉండవచ్చని గ్రహించగలరు)
ఈ విధంగా పైన పేర్కొన్న వార్ 2, కూలీ రెండు సినిమాల యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ గమనిస్తే రెండూ కూడా భారీ వ్యయంతో రూపొందడంతో పాటు రూ. 35 కోట్ల తేడాతో ఉన్నాయి. వాటిలో బిజినెస్ పరంగా వార్ 2 ఇంకా ఎక్కువ ఉంది.
Coolie Movie Review
ఇక్కడ మరొక కీలక విషయం ఏమిటంటే, కూలీ మూవీలో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ వంటి దిగ్గజ నటులు ఉండడంతో తమిళ నాడు, కేరళ, తెలుగు రాష్ట్రాలు, నార్త్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ మెయిన్ హీరో కావడంతో తమిళనాడులో భారీ స్థాయిలో కలెక్షన్ లభిస్తుందని తెలుస్తోంది.
War2 క్రేజ్ ఎంత ఉంది ప్రీ-సేల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి
తొలిసారిగా లోకేష్ కనకరాజ్ తో రజినీకాంత్ ఈ మూవీ గ్రాండ్ గా చేస్తున్నారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ తో పాటు దేశవిదేశాల్లోని మూవీ లవర్స్ లో కూలీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక వార్ 2 విషయానికి వస్తే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ కూడా అటు తెలుగు, ఇటు హిందీలో టాప్ స్టార్స్ కావడంతో పాటు విదేశాల్లో కూడా ఇద్దరికీ మంచి క్రేజ్ ఉందనేది తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, యుఎస్ఏ వంటి ప్రాంతాల్లో ఎన్టీఆర్ వలన భారీ స్థాయి కలెక్షన్ వస్తుంది. ఇక హృతిక్ వలన నార్త్ తో పాటు కొన్ని దేశాల్లో మంచి కలెక్షన్ రావచ్చని తెలుస్తోంది. వార్ 2 మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందడం తో పాటు యష్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీపై ఆయా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తో పాటు దేశవిదేశాల ఆడియన్సు లో కూడా విపరీతంగా క్రేజ్ ఉంది.
War 2 Movie Review
మొత్తంగా ఎన్నో నెలల నుండి ఎంతో శ్రమతో రూపొందిన ఈ రెండు సినిమాలు భారీ స్థాయిలో రేపు థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడంతో రెండూ కూడా మంచి విజయం అందుకుని ఆయా నిర్మాతలకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు అందించాలని మా తెలుగు మూవీ మీడియా (Telugu Movie Media) టీమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
What's Your Reaction?






