Sarkaru Vaari Paata Review – Mahesh Babu’s Commercial Entertainer

Sarkaru Vaari Paata Review: Mahesh Babu shines in this commercial drama with action, emotion, and punch dialogues. Read the full Telugu review and verdict.

Sarkaru Vaari Paata Review – Mahesh Babu’s Commercial Entertainer

'సర్కారు వారి పాట' రివ్యూ : ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 

సినిమా పేరు : సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)

విడుదల తేదీ : 12 మే 2022

నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, నాగేంద్రబాబు, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను

Telugu Movie Media Rating : 3. 5 / 5

దర్శకత్వం : పరశురామ్ పెట్ల 

నిర్మాతలు :  నవీన్ యెర్నేని, రామ్ ఆచంట, గోపి ఆచంట, వై రవిశంకర్ 

సంగీతం : ఎస్ థమన్ 

సినిమాటోగ్రఫీ : మది 

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సూపర్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు.

Mahesh Babu latest movie review

2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీతో పెద్ద విజయం సొంతం చేసుకున్న మహేష్ బాబు నటించిన ఈ మూవీ పై ఆయన ఫ్యాన్స్ లో విశేషమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యొక్క సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. మరి సర్కారు వారి పాట మూవీ యొక్క పూర్తి స్థాయి రివ్యూ ఇప్పుడు చూద్దాం

కథ : 

యుఎస్ఏ రికవరీ బిజినెస్ చేస్తుండే మహేష్ (Mahesh Babu) గతంలో తన లైఫ్ లో జరిగిన ఒక ఘటన కారణంగా డబ్బు విషయంలో ఎంతో గట్టిగా ఉంటాడు. అయితే అతడి బిజినెస్ విషయం తెలుసుకుని అక్కడ చదువుకునే యువతి అయిన కళావతి (Keerthy Suresh) అతడి నుండి కొంత డబ్బు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా చీట్ చేస్తుంది.

కథ, యాక్షన్ మరియు సంగీతం విశ్లేషణ

ఆ తరువాత కొన్ని ఘటనల కారణంగా కళావతి తండ్రి రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉన్నాడని మహేష్ ఒక్కసారిగా షాక్ ఇస్తాడు. మరి ఇంతకీ అది నిజమేనా, ఒక్కసారిగా మహేష్ అన్న మాట నిజమేనా, అసలు రాజేంద్రనాథ్ కి మహేష్ కి ఏంటి సంబంధం, అనంతరం కథ ఏ విధంగా మలుపులు తిరిగి ముందుకు సాగింది, అసలు మహేష్ గతం ఏమిటి అనే అంశాలు మొత్తం కూడా మనం సర్కారు వారి పాట మూవీని వెండితెర పై చూడాల్సిందే. 

Sarkaru Vaari Paata box office collection

ప్లస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ఎన్నో భారీ అంచనాల నడుమ రెండు సంవత్సరాల ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట మూవీ ఆయన ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా మహేష్ అనే వడ్డీ వ్యాపారిగా అలానే అటు కామెడీ, ఇటు మాస్, అటు యాక్షన్ అన్ని కోణాల్లో ఆయన నటన నభూతో నభవిష్యతి. గతంలో సూపర్ స్టార్ మహేష్ ఇటువంటి పాత్రలని ఎంతో అవలీలగా పోషించి అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే. 

Sarkaru Vaari Paata Telugu review

అంతకుమించిన స్థాయిలో ఆయన రోల్ యాక్టింగ్ ఇందులో ఉంటుంది. ఇక కళావతి గా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో హీరోయిన్ కీర్తి సురేష్ ఎంతో చక్కగా మెప్పించారు. కామెడీ, లవ్, యాక్షన్, ఎమోషన్, మెసేజ్ అంశాలతో సాగె ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ సరదాగా ఉంటుంది. మహేష్ కామెడీ పంచెస్ తో పాటు సినిమాలో కీలకమైన నదియా రోల్, తనికెళ్ళ భరణి రోల్స్ బాగుంటాయి. విలన్ గా నటించిన సముద్రఖని ఎంతో అద్భుతంగా యాక్ట్ చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. 

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ ఎంతో బాగా సాగిన సర్కారు వారి పాట మూవీ సెకండ్ హాఫ్ ముఖ్యంగా మహేష్ బాబు గత సినిమాల మాదిరిగా మెసేజ్ కథగా సాగుతుంది. వాస్తవానికి దర్శకుడు పరశురామ్ పెట్ల ఈమూవీ కోసం తీసుకున్న పాయింట్ చెప్పాలనుకున్న విషయం ఎంతో బాగున్నప్పటికీ దానిని సెకండ్ హాఫ్ లో మలిచి తెరకెక్కించిన తీరు కొంత సాగిన అనంతరం ఆకట్టుకోదు. 

ప్రేక్షకుల స్పందన, హైలైట్స్ & మా రేటింగ్

మెయిన్ ట్రాక్ సీన్స్ వాస్తవానికి దగ్గరగా లేకపోవడంతో పాటు అక్కడక్కడా లాజిక్ లెస్ సీన్స్ అలరించవు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కామెడీ సెకండ్ హాఫ్ లో పెద్దగా పండించే స్కోప్ ఉండదు, కీర్తి సురేష్ పాత్ర కూడా సెకండ్ హాఫ్ లో ఆకట్టుకోదు. దీనికి తోడు సాంగ్స్ బాగున్నప్పటికీ సంగీత దర్శకుడు థమన్ బీజీఎమ్ కూడా నిరాశపరుస్తుంది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం బాగుంటాయి. 

సాంకేతిక విభాగం : 

ఇక సర్కారు వారి పాట మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శకడు పరశురామ్ ఎంతో స్టైలిష్ గా ట్రెండీ లుక్స్ లో చూపించారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ మాది పలు సీన్స్ ని అద్భుతంగా తెరకెక్కించారు. థమన్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అక్కడక్కడా థమన్ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా ఆయన నుండి ఆశించినవి చాలా మిస్ అయ్యాయి. విజువల్స్ తో పాటు ఎడిటింగ్ విభాగం యొక్క పనితీరు, అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంతో బాగున్నాయి. సినిమా చాలా వరకు కూడా మంచి గ్రాండియర్ స్టైల్ లో విజువల్స్ తో సాగుతుంది. 

తీర్పు : 

మొత్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ బ్యూటీ కీర్తి సురేష్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలావరకు అంతా తానై ముందుకు నడిపారు. దర్శకుడు పరశురామ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో చాలా వరకు సీన్స్ ఆకట్టుకోవు. క్లైమాక్స్, ప్రీ క్లమాక్స్ తో పాటు సాంగ్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ సీన్స్ మాత్రం బాగున్నాయి.

Keerthy Suresh performance in Sarkaru Vaari Paata

మధ్యలో కొంత మెసేజ్ ఉన్నప్పటికీ అది అందరికీ బాగానే కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ గా సర్కారు వారి పాట మూవీ సాధారణ ఆడియన్స్ కి నచుతుంది, సూపర్ స్టార్ మహెష్ ఫ్యాన్స్ కి మరింతగా నాచే కమర్షిల్ డ్రామాగా నిలుస్తుంది. మరి వీలైతే ఒక్కసారి మీరు కూడా ఈమూవీ పై ఒక లుక్ వేయండి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow