Hari Hara Veera Mallu Team Clarifies Rumors – Official Statement

Hari Hara Veera Mallu team responds to rumors about the movie's release and production delays. Official clarification silences fake news. Read more now

Hari Hara Veera Mallu Team Clarifies Rumors – Official Statement

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ (Pawan Kalyan) హీరోగా అందాల నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా తాజాగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu). ఈ హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ముఖ్యంగా పవన్ నుండి మూడేళ్ళ అనంతరం వస్తున్న మూవీ కావడంతో పాటు అజ్ఞాతవాసి అనంతరం ఆయన నుండి వస్తున్న స్ట్రైట్ మూవీ కావడంతో ఇది పక్కగా అతి పెద్ద విజయం ఖాయం అని ఫ్యాన్స్ అయితే మరింతగా అంచనాలు ఏర్పరుచుకున్నారు. ఇక ఇందులో గజదొంగ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో బాబీ డియోల్, పూజిత పొన్నాడ (Poojitha Ponnada), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), నోరా ఫతేహి (Nora Fathehi), నర్గీస్ ఫక్రి (Nargis Fakri) నటిస్తున్నారు. 

హరి హర వీర మల్లు టీమ్ – వదంతులను ఖండించినట్టు స్పష్టత

అలానే ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం దీనిని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు హరి హర వీర మల్లు మూవీకి విఎస్ జ్ఞానశేఖర్ తో పాటు మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు. 

ఇక ఈ భారీ మూవీని క్రిష్ జాగర్లమూడితో కలిసి రత్నం కుమారుడు జ్యోతికృష్ణ కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్ తో పాటు మూడు సాంగ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసాయి. 

Hari Hara Veera Mallu latest update

వాస్తవానికి 2020 ప్రథమార్ధంలో ప్రారంభం అయిన ఈ మూవీ మధ్యలో కొంత షూటింగ్ అనంతరం ఆగిపోయింది. దానికి కారణం తన జనసేన పార్టీ కార్యకలాపాల కారణంగా పవన్ ఎక్కువగా టైం ని రాజకీయాలకు కేటాయించడమే. ఇక ఈ మూవీని ముందుగా 2022 చివర్లో రిలీజ్ చేద్దాం అని భావించారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మెల్లగా దగ్గర పడడంతో చాలావరకు పార్టీయే కార్యకలాపాలలో ఉండిపోయిన పవన్, తదుపరి ఇటీవల ఎన్నికలు పూర్తి అయిన అనంతరం తన పార్ట్ మిగతా బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసారు. అయితే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న హరి హర వీర మల్లు మూవీ మొత్తంగా రెండు పార్ట్స్ గా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ని జూన్ 12న గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో పలు భాషలు ఆడియన్స్ ముందుకి తీసుకువస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా డేట్ ని అనౌన్స్ చేసారు. 

విడుదల తేదీ, షూటింగ్ డిలే పై వస్తున్న అపోహలు

కాగా లేటెస్ట్ బజ్ ప్రకారం మూవీ మరికొన్నాళ్లు వాయిదా పడినట్లు తెలుస్తోంది. నిజానికి వాయిదా విషయమై టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ యుఎస్ఏ లో ఈమూవీ యొక్క టికెట్స్ ని బుక్ చేసుకున్న వారివి క్యాన్సిల్ చేయబడి అమౌంట్ తిరిగి రిఫండ్ రావడంతో వాయిదా పక్కా అని తెలుస్తోంది. 

అయితే అసలు విషయం ఏమిటంటే, హరి హర వీర మల్లు మూవీ బయ్యర్లు దొరకని కారణంగా బిజినెస్ జరగలేదని, అందుకే వాయిదా వేస్తున్నారు అంటూ కొందరు గిట్టని వారు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం మొదలెట్టారు. దానిపై పవన్ ఫ్యాన్స్ గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు. మరోవైపు వాస్తవం ఏమిటంటే, పవన్ వంటి స్టార్ హీరో సినిమాకి బయ్యర్స్ దొరకకపోవడం అనేది అవాస్తవం అని తెలుస్తోంది. 

Pawan Kalyan HHVM release clarification

కాగా దీనికి సంబంధించి తాజాగా హరి హర వీర మల్లు టీమ్ స్పందించింది. పవన్ చారిత్రక యోధుడిగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు సహా ఇతర భాషల హక్కుల కోసం మంచి క్రేజ్ ఉందని, అయితే పవన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మూవీ కి వచ్చే కలెక్షన్స్ ని బట్టి నిర్మాత ఒకింత అధిక ధర చెప్తుండడంతో ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, అతిత్వరలో అన్ని కుదరగానే పూర్తిగా టీమ్ అఫీషియల్ గా లేటెస్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నామని ఒక ప్రకారణ ద్వారా తెలిపారు. 

చిత్రబృందం నుండి వచ్చిన అధికారిక ప్రకటన

అలానే తమ మూవీ సంబంధించి ఏ న్యూస్ అయినా కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి వస్తాయి తప్ప ఇతరుల తప్పుడు కథనాల్ని ఏమాత్రం నమ్మవద్దని కూడా హరి హర వీర మల్లు టీమ్ కోరింది. కావున 

ఇకనైనా హరి హర వీర మల్లు కి బయ్యర్స్ లేరు అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ముగింపు పలకాలని, పవన్ మూవీ వస్తుంది అంటే ఎంతటి బాక్సాఫీస్ ప్రభంజనం ఉంటుందో అందరికి తెలుసనేది మర్చిపోవద్దని అంటున్నారు. మొత్తంగా అతి త్వరలో ఈ మూవీ యొక్క న్యూ అఫీషియల్ రిలీజ్ డేట్ ని టీమ్ అనౌన్స్ చేయాలని, అలానే మూవీ కూడా మంచి విజయం అందుకుని నటుడిగా పవన్ కళ్యాణ్ రేంజ్ ని ఇమేజ్ ని మార్కెట్ ని మరింతగా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow