KGF Heroine Takes a Holy Dip at Maha Kumbh Mela – Spiritual Journey Revealed
KGF Heroine Holy Dip at Maha Kumbh Mela ఇటీవల కెజిఎఫ్ సిరీస్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన యువ అందాల కథానాయిక శ్రీనిధి శెట్టి మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం. ఈ మూవీస్ లో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించగా కన్నడ ప్రముఖ

ఇటీవల కెజిఎఫ్ సిరీస్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన యువ అందాల కథానాయిక శ్రీనిధి శెట్టి మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం. ఈ మూవీస్ లో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించగా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యధిక వ్యయంతో నిర్మించారు.
KGF Heroine’s Spiritual Journey at Maha Kumbh Mela
ఇక రిలీజ్ అనంతరం కేజేఎఫ్ చాప్టర్ 1 (KGF:Chapter 1) అలానే చాప్టర్ 2 (KGF:Chapter 2) ఎంతటి గొప్ప విజయాలు సొంతం చేసుకున్నాయి ఏ స్థాయిలో భారతీయ బాక్సాఫీస్ ని షేక్ చేశాయో మనకు అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీలో రీనా పాత్రలో నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించారు శ్రీనిధి శెట్టి.
Why Did KGF Actress Take a Holy Dip at Maha Kumbh Mela?
ముఖ్యంగా ఈ రెండు సినిమాల యొక్క భారీ విజయాలు నటిగా ఆమెకు విపరీతమైన క్రేజ్ తో పాటు భారీ మార్కెట్ ని కూడా తీసుకువచ్చాయి. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో కెరీర్ పరంగా బిజీ బిజీ గా కొనసాగుతున్నారు శ్రీనిధి. ఇక ఆమె తరచు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఆడియన్స్ ఫ్యాన్స్ తో తన మూవీ కెరీర్ అలానే పర్సనల్ విషయాలు ఎప్పటికపుడు షేర్ చేసుకుంటూ ఉంటారు.
Maha Kumbh Mela 2025 – Significance & Celebrity Visitors
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు శ్రీనిధి శెట్టి. ఇక తాజాగా జరుగుతున్న మహా కుంభమేళా లో పాల్గొని ప్రయాగరాజ్ లోని పుణ్యనదిలో స్నామాచరించారు శ్రీనిధి. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్స్టా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసారు ఆమె. వాస్తవానికి నాకు ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ కుంభమేళాలో పాల్గొనలేను అనుకున్నాను.
అయితే నాన్నగారి కారణంగా సడన్ గా పనులు మొత్తం కూడా కాస్త ప్రక్కన పెట్టి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాను. ఇది మన జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుత ఘట్టం కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా నాన్న అక్కడికి వెళ్తున్నాం అనగానే వెంటనే బయల్దేరి వెళ్ళాము. నిజంగా ఇక్కడి ప్రకృతి, అలానే అనుభవం జీవితాంతం ఎప్పటికీ కూడా మదిలో నిలిచిపోతుందని అక్కడి త్రివేణి సంగమంలో తండ్రితో కలిసి దిగిన ఫోటోలని పంచుకున్నారు శ్రీనిధి.
KGF Actress Shares Her Experience at the Kumbh Mela
కాగా ప్రస్తుతం ఆమె తెలుగులో యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న తెలుసు కదా తో పాటు నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న హిట్ 3 మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ఆ సినిమాలు రెండూ కూడా నటిగా శ్రీనిధి శెట్టి గారికి బాగా పేరు తీసుకువచ్చి, ఆమెకు క్రేజ్ మార్కెట్ ని మరింతగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
Bollywood & South Celebrities Who Attended Maha Kumbh Mela
What's Your Reaction?






