Prabhas Upcoming Movies List : Exclusive Updates about His Upcoming Movies
Get Prabhas' upcoming movies list with release years, trailers, and shooting updates

తెలుగు హీరోల్లో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా ముందుకు సాగుతున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆయన ప్రస్తుతం మారుతీతో ది రాజా సాబ్ (The Rajasaab) మూవీతో పాటు సీతారామం (Sita Ramam) దర్శకుడు హను రాఘవపూడి తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ది రాజా సాబ్ మూవీ ఆల్మోస్ట్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇది హర్రర్ తో కూడిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. యువ అందాల భామలు రిద్ది కుమార్ (Riddhi Kumar), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్స్ గా రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది.
ప్రభాస్ రాబోయే సినిమాలు – 2025
ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) నెగటివ్ పాత్ర చేస్తున్నట్లు టాక్. టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా గ్రాండ్ లెవెల్లో పీపుల్ మీడియా ఫాక్టరీ సంస్థ పై నిర్మితం అవుతున్న ది రాజా సాబ్ మూవీ వాస్తవానికి ఈపాటికే రిలీజ్ కావలసి ఉంది. అయితే మూవీకి సంబంధించి కొంత విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పెండింగ్ షెడ్యూల్ కారణంగా రిలీజ్ ని మరికొన్నాళ్లు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యూరోప్ లో ఉన్న ప్రభాస్ త్వరలో తిరిగిరానున్నారు. అనంతరం ఈ మూవీ యొక్క బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయనున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దీనితో పాటు హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న మూవీకి ఫౌజీ (Fauji) అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఇమాన్వి (Imanvi) హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ గా వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
విడుదల తేదీలు మరియు కాస్ట్
మరోవైపు ఇప్పటికే ఆనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తో స్పిరిట్ (Spirit) మూవీని కూడా లైన్లో పెట్టారు ప్రభాస్. ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) లేదా దీపికా పదుకొనె (Deepika Padukone) ఆయనకు జోడీగా నటించి అవకాశం ఉందని టాక్. అయితే దీపికానే ఆల్మోస్ట్ కాన్ఫర్మ్ అని అంటున్నారు.
కాగా ఈ విషయమై టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రావాల్సి ఉంది. టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళీ పిక్చర్స్ సంస్థల పై పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందనున్న స్పిరిట్ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం కాగా, మూవీకి సంబంధించి మూడు సాంగ్స్ కూడా రికార్డింగ్ పూర్తి అయినట్లు చెప్తున్నారు.
ప్రభాస్ పాత్రలు మరియు కథా విశేషాలు
ఇక ఈ మూవీలోని తన పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ పరంగా హీరో ప్రభాస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక అతి త్వరలో ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ మెక్సికో లో ప్రారంభం కానుందట. కాగా స్పిరిట్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని వినికిడి.
అయితే ఈ సినిమాల అనంతరం ప్రశాంత్ నీల్ తో సలార్ 2 (Salaar 2), నాగ అశ్విన్ తో కల్కి 2 (Kalki 2) సినిమాలు కూడా పూర్తి చేయనున్నారు ప్రభాస్. అలానే మరోవైపు ప్రభాస్ మూవీస్ లిస్ట్ లో ప్రశాంత్ వర్మ బకాసురు, లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తో మరొక మూవీ ఉన్నాయి. ఈ సినిమాల పై కూడా అందరిలో మంచి బజ్ ఉంది. మొత్తంగా కెరీర్ పరంగా వరుసగా అనేక సినిమాలతో బిజీగా కొనసాగుతున్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వీటితో పెద్ద విజయాలు సొంతం చేసుకుని మరింత క్రేజ్, మార్కెట్ ని సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మా Telugu Movie Media టీమ్.
What's Your Reaction?






