OG Box Office Collection Worldwide | Pawan Kalyan Movie Box Office | OG Movie Total Box Office Collection

OG Box Office Collection Worldwide - Get complete box office report of Pawan Kalyan's OG movie. Day-wise collections, area-wise breakdown, worldwide total, and verdict. Regular updates

OG Box Office Collection Worldwide | Pawan Kalyan Movie Box Office | OG Movie Total Box Office Collection

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తాజాగా యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ OG. ఈ మూవీలో ఆయన Ojaas Gambheera అనే పాత్ర చేయగా కన్మణి అనే పాత్రలో యువ అందాల నటి Priyanka Mohan నటించారు. ఇక ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో ప్రముఖ తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. 

డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి నిర్మించిన ఈ మూవీలో Bollywood నటుడు Emraan Hashmi విలన్ గా నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్ నటించారు. రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన ఓజి మూవీ నుండి వాస్తవానికి సరిగ్గా ఏడాదిన్నర క్రితం మొదట రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. 

OG మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

అంతకముందు పవన్ కళ్యాణ్ నటించిన Hari Hara Veera Mallu Box Office Collection పరంగా ఘోరంగా విఫలం అవడంతో తప్పకుండా ఓజి తామందరి అంచనాలు అందుకుని పెద్ద విజయం ఖాయం అని పవన్ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.. పవన్ కు వీరాభిమాని అయిన సుజీత్ అంతకముందు Prabhas తో Saaho మూవీ తీసి పెద్ద విజయం అందుకుని ఉండడం కూడా They Call Him OG మూవీ పై అందరిలో తారా స్థాయిలో అంచనాలు ఏర్పడడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. 

ముఖ్యంగా సాహో మూవీ Saaho Total Box Office Collection Worldwide రూ. 450 కోట్లు సొంతం చేసుకోవడంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఓజి ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాయం అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఇక ఇటీవల పవన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన Fire Storm సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుని మంచి రెస్సాన్స్ అందుకుంది. దాని తరువాత వచ్చిన మరొక రెండు సాంగ్స్ తోపాటు OMI Teaser కూడా అలరించడంతో అంతకంతకు ఓజి పై అందరిలో అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. 

Pawan Kalyan OG Movie Review Telugu

చివరిగా ఇటీవల ఒకింత లేట్ గా రిలీజ్ అయినప్పటికీ కొద OG Trailer భారీ హైప్ సొంతం చేసుకుని ఒక్కసారిగా ఓజి పై అంచనాలు ఆకాశం అంతటి ఎత్తుకి పెంచేసిందని చెప్పాలి. ఇక సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చిన ఓజి మూవీ ఫస్ట్ డే నుండి మంచి టాక్ ని రాబట్టింది. అంతకముందు ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రదర్శించగా అది అందరినీ ఆకట్టుకుంది. 

ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుండి తమ ఫ్యాన్స్ అందరం పవన్ ని ఎలా చూడాలి అనుకుంటున్నామో దర్శకుడు సుజీత్ అదే విధంగా ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఆయనని చూపించడం, అలానే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. స్వతహాగా పవన్ ఫ్యాన్ అయిన సుజీత్ చాలావరకు ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, అలరించే ఫైట్స్ తో ఓజి మూవీని తెరకెక్కించారు. అయితే సాధారణ ప్రేక్షకులని మాత్రం ఈ మూవీ యావరేజ్ స్థాయిలోనే ఆకట్టుకుంది. 

OG బాక్స్ ఆఫీస్ డే-వైజ్ కలెక్షన్స్

ఓజి మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎంట్రీ అదిరిపోగా ఫస్ట్ హాఫ్ బాగానే సాగింది. పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, డైలాగ్స్ అందరినీ అలరించాయి. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో డిజైన్ చేసి ఆకట్టుకున్నారు దర్శకుడు సుజీత్. ముఖ్యంగా ఈ మూవీలో విజువల్స్ ని ఎంతో గ్రాండియర్ గా ప్రెజెంట్ చేసారు కెమెరా మ్యాన్స్ రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస. 

అలానే సంగీహ దర్శకుడు థమన్ అందించిన సాంగ్స్ తో పాటు కీలక సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. చిన్న పాత్ర అయినప్పటికీ హీరోయి ప్రియాంక మోహన్ ఆకట్టుకోగా ఒమీ పాత్ర చేసిన ఇమ్రాన్ హష్మీ, సత్య దాదా పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ సహా అందరూ కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు అలరించారు. అయితే సెకండ్ హాఫ్ ని మాత్రం ఆశించిన స్థాయిలో తెరకెక్కించలేకపోయారు దర్శకుడు సుజీత్. ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో పాటు ఎక్కువ పాత్రలు ఉండడం కొంత సాధారణ ప్రేక్షకులకి అర్ధం కాలేదు. 

Pawan Kalyan OG Trailer Review

అలానే పూర్తి స్థాయి యాక్షన్ మూవీ కావడంతో ఓజి మూవీ ఫ్యామిలి ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కూడా కష్టమే, వీటికి తోడు ఏ సెర్టిఫికెట్ కూడా కొంత ఓజికి ఇబ్బంది. మొత్తంగా ఫస్ట్ డే నుండి ఓవరాల్ గా యావరేజ్ టాక్ తో కొనసాగుతున్న OG First Day Box Office Collection రూ. 154 కోట్లుగా టీమ్ ప్రకటించినది. మరోవైయూప్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో సైతం ఓజి మూవీ సూపర్ గా ఓపెనింగ్స్ ని రాబట్టి పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇక ఈమూవీ మూడు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలు ఇక్కడ చూద్దాం.
 
OG - They Call Him OG 3 Days Total World Wide Collection (Inc GST) 

నైజాం - రూ. 36.50 కోట్లు

సీడెడ్ - రూ. 10.71 కోట్లు

ఉత్తరాంధ్ర - రూ. 9.74 కోట్లు

ఈస్ట్ - రూ. 9.45 కోట్లు

వెస్ట్ - రూ. 5.46 కోట్లు

గుంటూరు - రూ. 7.87 కోట్లు

కృష్ణా - రూ. 6.56 కోట్లు

నెల్లూరు - రూ. 2.91 కోట్లు 

AP TG  టోటల్ కలెక్టన్స్ - రూ. 89.20 కోట్లు షేర్ ( రూ. 127.60 కోట్లు గ్రాస్)

కర్ణాటక - రూ. 6.90 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 2.85 కోట్లు

ఓవర్సీస్ - రూ. 26.85 కోట్లు  

ఓజి టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ - రూ. 125.80 కోట్లు షేర్ ( రూ. 202.90 కోట్లు గ్రాస్) రికవరీ 72%

OG ఏరియా వైజ్ కలెక్షన్స్ రిపోర్ట్

మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియన్ మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి రూ. 175 కోట్ల బ్రేకీవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో నిలిచి ఇప్పటివరకు అనగా 3 రోజుల్లో 72% రికవరీ అయింది. కాగా మిగిలిన రన్ లో రూ. 49.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక నేడు ఆదివారం కావడంతో నిన్నటితో పోలిస్తే ఓజి మూవీ మరింత మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఓజి ఎంత మేర కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow