Mirai Movie Review Telugu: A Stunning Surprise Thrills You
Read Mirai Telugu Review – complete analysis of story, performances, direction and highlights. Honest verdict with audience response

మిరాయ్ మూవీ రివ్యూ : Mirai Review in Telugu
సినిమా పేరు : మిరాయ్
Telugu Movie Media రేటింగ్ : 3.5 / 5
విడుదల తేదీ : 12 సెప్టెంబర్ 2025
నటీనటులు : తేజ సజ్జ, రితిక నాయక్, మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియశరన్ తదితరులు
దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
సంగీతం : గౌర హరి
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
Mirai Telugu Audience Response
గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హను మాన్ (Hanu Man) మూవీతో పెద్ద విజయం అందుకున్నారు తేజ సజ్జ (Teja Sajja). పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన హను మాన్ ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా ఓవరాల్ గా అది రూ. 300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.
దాని అనంతరం మరొక్కసారి భారీ పాన్ ఇండియన్ మూవీ మిరాయ్ (Mirai) ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు తేజ సజ్జ. ఈ మూవీని యువ దర్శకుడు కమ్ సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా యువ అందాల నటి రితిక నాయక్ (Rithika Nayak) హీరోయిన్ గా నటించారు. శ్రియ శరణ్ (Shriya Sharan) కీలక పాత్ర చేసిన ఈ మూవీలో మంచు మనోజ్ కూడా ప్రధాన పాత్ర చేసారు.
మొత్తంగా ఫస్ట్ లుక్ టీజర్, గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నిటి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన మిరాయ్ మూవీ యొక్క పూర్తి రివ్యూని ఇప్పుడు చూద్దాం.
కథ :
ఇక మిరాయ్ మూవీ కథ విషయానికి వస్తే కళింగ యుద్ధం అనంతరం ఎంతో పశ్చాత్తాపపడ్డ అశోకుడు తనలోని శక్తులు అన్నిటినీ మొత్తంగా 9 పవిత్ర గ్రంధాల్లో నిక్షిప్తం చేసి ప్రపంచం నలుమూలల ఉన్న 9 మంది రక్షకులకి అందిస్తాడు .
అయితే ఆ కాలం నుండి ప్రస్తుతం ఉన్న కాలం వరకు ఒక్కొక్క గ్రంధాన్ని తన వశం చేసుకుని స్వయంగా తానే భగవంతుడిగా మారాలని ప్రయత్నిస్తుంటాడు క్రూరుడైన మహావీర్ (Manchu Manoj). అయితే వాటిలో 9వ గ్రంథం తేజ సజ్జ (వేద) తల్లి అయిన అంబిక (శ్రియ శరణ్) రక్షణలో ఉంటుంది. మరి ఆమె అనంతరం కుమారుడు వేద దానికి రక్షణగా మారడానికి శ్రీరామచంద్రుని కాలానికి చెందిన మిరాయ్ ని ఎలా దక్కించుకున్నాడు, అదే క్రమంలో అతడు వేద నుండి యోధగా ఎలా మారాడు అనేది ప్రధాన కథాంశం.
ఈ క్రమంలో అతడు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు, అయితే ఇంతకీ మహావీర్ అన్ని గ్రంథాలు సొంతం చేసుకున్నాడా, 9వ గ్రంథం అతడి చేతికి చిక్కిందా లేదా అనేది మొత్తం కూడా వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఆకట్టుకునే కథ, కథనాలు అని చెప్పాలి. తాను చెప్పదల్చుకున్న కథని ఎక్కడా కూడా ప్రక్కదారి పట్టించకుండా కథనాన్ని ఆడియన్సు కి కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు కార్తీక్ సఫలం అయ్యారు.
ముఖ్యంగా కీలమైన ఓపెనింగ్ సీన్ మొదలుకుని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ వరకు ఇందులో మనల్ని అలరించే ఎన్నో అంశాలు జోడించి చిత్రికరించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ బాగా నడిచిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అనంతరం మరింత ఆసక్తికరంగా మారుతుంది. కీలకమైన ఓపెనింగ్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, సప్తపది, గరుడ పోర్షన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.
Mirai Movie Review Cast and Crew
ఇక హీరో తేజ సజ్జ వేద పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు. పలు కీలక యాక్షన్ ఎపిసోడ్స్ లో తన నటన మరింత బాగుంది. హను మాన్ అనంతరం అతడు ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్కోవడం కరెక్ట్ అని చెప్పాలి. ఒక హీరోయిన్ రితిక నాయక్ తన ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించగా హీరో తల్లి పాత్ర చేసిన శ్రీయ కూడా అలరించారు.
జగపతి బాబు, జయరాం సహా ఇతరులు అందరూ తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ మూవీలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించడం. మూవీ బిగినింగ్ లో వచ్చే సీన్స్ కి ప్రభాస్ వాయిస్ ఎంతో చక్కగా కుదిరింది. సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అలానే గ్రాండియర్ విజువల్స్ సినిమాకి బలంగా నిలిచాయి. నిర్మాతల ఖర్చు మనకు తెరపై కనపడుతుంది.
మైనస్ పాయింట్స్ :
వాస్తవానికి మిరాయ్ కోసం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దానిని ముందుకు తీసుకెళ్లడంలో కథనం మరింత గ్రిప్పింగ్ గా ఉండేలా రాసుకుని ఉంటె బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో సీన్స్ బాగున్నప్పటికీ హీరో తేజ సజ్జ, గెటప్ శ్రీనుని మినహాహిస్తే ఇతర నటుల సీన్స్ అన్ని కూడా మనకు డబ్బింగ్ సినిమా చూసిన ఫీల్ అందిస్తాయి.
డివోషనల్ టచ్ కూడా ఉన్న ఈ మూవీలో అడ్వెంచరస్ సీన్స్ మనకు గతంలో కొన్ని సినిమాల్లో చూసిన ఫీల్ ని గుర్తు చేస్తాయి. మరికొన్ని ఇంప్రెసింగ్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ పోర్షన్స్ కూడా మరింత బలంగా రాసుకుని ఉండాల్సింది.
సాంకేతిక వర్గం :
ఇక ఈ మూవీ యొక్క దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాని చాలావరకు ఆకట్టుకునే రీతిన తెరకెక్కించి ఆడియన్స్ మనసు గెలుచుకున్నారని చెప్పాలి. అక్కడక్కడా కొంత తడబడ్డప్పటికీ ఓవరాల్ గా అయితే అతడి దర్శకత్వ ప్రతిభ సీన్స్ రాసుకున్న తీరు బాగుంది.
ముఖ్యంగా నిర్మాతలు మూవీని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. విజువల్స్ చూస్తే ఎంతో తక్కువ బడ్జెట్ లో కూడా ఇంత చక్కటి క్వాలిటీ విజువల్స్ అందిచడం గ్రేట్ అనిపించకమానదు. కొన్ని ప్రత్యేక సీన్స్ అయితే మనసులో మంచి ముద్ర వేస్తాయి.
ఆ విధంగా అటు దర్శకుడిగా ఇటు ఫోటోగ్రాఫర్ గా రెండు విషయాల్లో అదరగొట్టారు కార్తీక ఘట్టమనేని. హను మాన్ కి పనిచేసిన సంగీత దర్శకడు గౌర హరి ఈ మూవీకి కూడా మరొక్కసారి తన మార్క్ సాంగ్స్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు కీలక సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.
తీర్పు :
మొత్తంగా ఎన్నో అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మిరాయ్ ఆకట్టుకుంటుందని చెప్పాలి. హీరో తేజ సజ్జ ఆకట్టుకునే యాక్టింగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చక్కటి టేకింగ్ విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ సినిమాలో బాగానే వర్కౌట్ అయ్యాయి.
అక్కడక్కడా కొంత మైనస్ లు ఉన్నప్పటికీ అవి పెద్దగా లక్ష్య పెట్టనవసరం లేదు. ఓవరాల్ గా వీలైతే మీ ఫ్యామిలీ తో కలిసి చక్కగా సమీప థియేటర్స్ లో మిరాయ్ మూవీ చూసి ఆనందించండి.
మరి ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ న్యూస్, లేటెస్ట్ అప్ డేట్స్, గాసిప్స్, గ్యాలరీ, రివ్యూస్ కోసం ఎప్పటికప్పుడు మా సైట్ ని చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయండి.
What's Your Reaction?






