Virat Kohli Clarifies Accidental Like on Avneet Kaur's Instagram Photo
Virat Kohli addresses the accidental like on Avneet Kaur's fan page photo, attributing it to an algorithmic glitch. Read his full statement and public reactions

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి యువతతో పాటు క్రికెట్ లవర్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన క్రికెట్ ఆట తీరుకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందదే.
విరాట్ కోహ్లీ వివరణ: అవనీత్ కౌర్ ఫోటో లైక్ పై స్పష్టత
ఇక తన కెరీర్ బిగినింగ్ నుండి ఎంతో కష్టపడి పైకి వచ్చి ఒక అద్భుత బ్యాట్స్మన్ గా కోట్లాది ఫ్యాన్స్ యొక్క నీరాజనాలు అందుకుంటున్న విరాట్ కోహ్లీ ఇటీవల బాలీవుడ్ నటి అనుష్క శర్మ ని వివాహం చేసుకుని ప్రస్తుతం వారిద్దరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతున్న విషయం తెలిసిందే.
ఇక మొదటి నుండి అటు విరాట్ ఇటు అనుష్క శర్మ ఇద్దరూ కూడా తమ కెరీర్స్ తో పాటు వ్యక్తిగత అలానే ఫ్యామిలీ కి సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. అటు విరాట్ కోహ్లీకి అలానే ఇటు అనుష్క శర్మ కు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం కారణంగా లైక్ అయినట్లు కోహ్లీ వివరణ
అలానే వారిద్దరూ కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ప్రస్తుతం ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ జరుగుతుండడంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతున్న విరాట్ అద్భుతంగా ఆడి ఆ టీమ్ కి కప్ ని అందించాలని మొదటి నుండి ఫ్యాన్స్ అభిలషిస్తున్నారు.
ఇక విరాట్ కూడా ఈ సీజన్ లో బాగానే బ్యాటింగ్ పెర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువగా ఆడియన్స్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ తన క్రికెట్ సంగతులు పంచుకునే విరాట్ కోహ్లీ ఏప్రిల్ 30న అనుకోకుండా బాలీవుడ్ నటి అన్వీత్ కౌర్ పోస్ట్ చేసిన ఫోటో షూట్ లో ఒక ఫోటోని లైక్ చేసి, అనంతరం కొద్దిసేపటి దానిని అన్ లైక్ చేసారు.
అయితే అప్పటికే ఆయన లైక్ చేసిన అన్వీత్ కౌర్ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న పలువురు సోషల్ మీడియా నెటిజన్స్ దానిని విరివిగా వైరల్ చేయడం మొదలెట్టారు.
అయితే కొద్దిసేపటి క్రితం తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫోటోని లైక్ చేసి ఆపైన అన్ లైక్ చేసిన విషయమై ఒక స్టోరీని పోస్ట్ చేసారు విరాట్ కోహ్లీ. అయితే దీని పై ప్రస్తుతం జరుగుతున్న చర్చకు ఫైనల్ గా ముగింపు పలకాలని భావించి తాను ఈ స్టోరీ పోస్ట్ పెడుతున్నట్లు తెలిపారు విరాట్.
సామాజిక మాధ్యమాల్లో అభిమానుల స్పందనలు
వాస్తవానికి తన స్టోరీ ఫీడ్ ని పూర్తిగా క్లియర్ చేస్తున్న సమయంలో ఆవిడ ఫోటోని లైక్ చేయడం అనుకోకుండా జరిగినట్లుంది, అది అల్గారిథమ్ వలన జరిగిన పొరపాటుగా అనిపిస్తోందని అన్నారు.
అంతేతప్ప తనకు ఎలాంటి వేరే ఉద్దేశ్యం లేదని, దయచేసి ఆ మ్యాటర్ పై అనవసరపు ఊహాగానాలకు తెరలేపి పెద్దదిగా చేయవద్దని, అందరూ అర్ధం చేసుకుంటారని కోరుతున్నాను అని అన్నారు. మొత్తంగా ఈ విషయమై క్రికెటర్ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది.
What's Your Reaction?






