New OTT Releases Telugu - This Weekend New Movies Webseries to Watch Online
New OTT Releases Telugu This Weekend New Movies Webseries to Watch Online OTT Movies Release this Weekend Netflix Amazon Prime JioHotstar Sony Liv Aha zee5

ఐదేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ముట్టడించడంతో యావత్ ప్రజలు అందరూ కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం అయిన విషయం తెలిసిందే. అందువల్ల ఎక్కువగా అందరూ ఇంటి నుండి పని చేయడంతో పాటు సోషల్ మీడియా మాధ్యమాలను విరివిగా వినియోగిస్తూ కాలం గడిపారు. అదే సమయంలో Youtube వంటివి విపరీతంగా వినియోగంలోకి వచ్చాయి.
అయితే అదే సమయంలో ఎక్కువగా OTT Apps ని అందులో వచ్చే సినిమాలు సిరీస్ లని అందరూ చూడసాగారు. అప్పటివరకు ఉన్న ఓటిటి మాధ్యమాలు అన్ని కూడా పరిస్థితులని అనుకూలంగా మలుచుకున్నాయి. అనంతరం మరికొన్ని ఓటిటి యాప్స్ వినియోగంలోకి వచ్చాయి. ముఖ్యంగా అప్పటికి ఎక్కువగా Netflix, Amazon Prime, Hotstar, Jio, zee5 వంటివి ఉండగా ఆపైన మెల్లగా Aha, ETVwin సహా మరికొన్ని ఓటిటి యాప్స్ పుట్టుకువచ్చాయి.
ఆ విధంగా ఎక్కువగా సినీ ప్రేక్షకులు వాటిని చూడడం మొదలెట్టారు. కరోనా వలన సినిమా థియేటర్స్ కూడా ఎన్నో నెలలు మూత పడడంతో ఓటిటి ల వినియోగం విపరీతం అయింది. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా OTT లోనే రిలీజ్ చేయడం ఆరంభించారు. ముఖ్యంగా అక్కడి నుండే పాన్ ఇండియన్ స్థాయిలో దాదాపుగా ప్రతి సినిమా అలానే సిరీస్ కూడా అన్ని భాషల్లో అందుబాటులోకి రావడం మొదలైంది.
ఓటిటిలో రిలీజ్ అయ్యే లేటెస్ట్ మూవీస్ & వెబ్ సిరీస్
Telugu, Tamil, Hindi, Malayalam, Kannada సినిమాలు, సిరీస్ లు అన్ని ఈ భాషల్లో అందుబాటులోకి రావడం విపరీతంగా వ్యూవర్ షిప్ పెరగడం ఆరంభం అయింది. ఆ విధముగా మన లైఫ్ లో ఓటిటి ల యొక్క వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా కొన్ని పెద్ద సినిమాల యొక్క టికెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు అవి కేవలం నాలుగు వారాల్లో ఓటిటి లోకి దర్శనం ఇస్తుండడంతో పాటు వాటి యొక్క నెలవారీ చందా కూడా అందరికీ అందుబాటులో ఉండడంతో అనేక వర్గాల ప్రజలు వీటి యొక్క సబ్ స్క్రిప్షన్ తీసుకుని పలు సినిమాలు, సిరీస్ లు చూడ్డానికి ఇష్టపడుతున్నారు.
ఇటీవల వీటి యొక్క వినియోగం మరింతగా ఎక్కువ అయింది. ఎంటర్టైన్మెంట్ విభాగంలో నేడు OTT ల యొక్క శాతం కూడా ఒకింత పెరగడానికి అధికంగా అందరూ చూస్తుండడమే. మొత్తంగా ప్రస్తుతం ఈ మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న పలు Movies, Webseries మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు పలువురు ప్రేక్షకాభిమానులు ఎప్పటికప్పుడు వీకెండ్స్ లో కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం తరచు ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం మన తెలుగులో అందుబాటులో ఉన్న, అలానే త్వరలో రానున్న లేటెస్ట్ సినిమాలు, సిరీస్ లు ఏమిటి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ అక్కినేని నాగార్జున తొలిసారిగా విలన్ గా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ కూలీ. ఈ మూవీలో శృతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు చేసారు. సన్ పిక్చర్స్ సంస్థ పై ఎంతో గ్రాండ్ గా నిర్మితం అయిన కూలీ మూవీ ఆగష్టు 14న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ స్థాయిలో విజయవంతం అయింది. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ తెరకెక్కించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద అందరి మన్ననలు అందుకున్న కూలీ తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చింది. అటు థియేటర్స్ లో అందరినీ అలరించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి లో కూడా ఆకట్టుకుంటూ కొనసాగుతోంది.
War2 OTT Release Date :
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ ల కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. ఈ మూవీని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ వారు గ్రాండ్ గా నిర్మించగా అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా ఆగష్టు 14న కూలీతో పాటు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా విజయవంతం అయింది. ఎన్టీఆర్, హృతిల్ ల ఆకట్టుకునే యాక్టింగ్, డైలాగ్స్ తో పాటు విజువల్స్, యాక్షన్ సీన్స్ దీనిని బాగానే సక్సెస్ చేసాయి. విషయం ఏమిటంటే ఈ మూవీ అక్టోబర్ చివర్లో ఓటిటి లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Paradha OTT Release Date :
యువ అందాల నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ మూవీ పరదా. ఈమూవీలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు చేసారు. ఆనంద మీడియా బ్యానర్ పై శ్రీనివాసులు, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ గ్రాండ్ గా తెరకెక్కించిన ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం సమకూర్చారు. అయితే ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్సు ముందుకి వచ్చిన ఈ మూవీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక తాజాగా పరదా మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటి ద్వారా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తోంది.
లేటెస్ట్ తెలుగు ఓటిటి & మూవీస్ రిలీజ్ డీటెయిల్స్
Mahavatar Narasimha OTT Release Date :
కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలింస్ సమర్పణలో క్లీం ప్రొడక్షన్స్ వారు గ్రాండ్ గా నిర్మించిన లేటెస్ట్ డివోషనల్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. ఈ మూవీని యువ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు. కన్నడలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అనంతరం తెలుగు, హిందీ భాషల్లో కూడా డబ్ కాబడి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో శ్రీమహావిష్ణువు యొక్క వరాహావతారా, నరసింహావతార సన్నివేశాలు ప్రేక్షకాభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. కేవలం రూ. 14 కోట్లతో నిర్మించినప్పటికీ ఎంతో చక్కగా దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. మొత్తంగా మహావతార్ నరసింహ థియేటర్స్ లో అందరినీ ఆకట్టుకుని ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ పలు భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక Mahavatar Narasimha OTT లో కూడా బాగా స్పందన అందుకుంటోంది.
Sundarakanda OTT Release Date :
నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ మూవీ సుందరకాండ. ఈ మూవీలో శ్రీదేవి, విర్తి వాఘని హీరోయిన్స్ గా నటించగా నరేష్, వాసుకి, సత్య, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ ఆగష్టు 27న థియేటర్స్ లో రిలీజ్ అయి పర్వాలేదనిపంచే విజయం అందుకుంది. నారా రోహిత్ ఆకట్టుకునే నటనతో పాటు కామెడీ, లవ్, ఫ్యామిలీ అంశాలు ఆడియన్సు ని ఆకట్టుకున్నాయి. మొత్తంగా థియేటర్స్ లో పర్వాలేదనిపించిన సుందరకాండ మూవీ సెప్టెంబర్ 23న జియో హాట్ స్టార్ లో పలు భాషల్లో ఓటిటి ఆడియన్సు ముందుకి రానుంది. మరి ఈ మూవీ ఎంతమేర రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
Little Hearts OTT Release Date :
యువ నటీనటులు మౌళి, శివాని నగరం, జై కృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లిటిల్ హార్ట్స్. ఇటీవల మంచి అంచనాల నడుమ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. యువ దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ మూవీని 90's మూవీ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మించగా శింజిత్ ఎర్రమిల్లి సంగీతం సమకూర్చారు. మౌళి, జై కృష్ణ ల కామెడీ టైమింగ్ ఆకట్టుకునే యాక్టింగ్ తో పాటలు, కామెడీ అంశాలు ఈ మూవీకి పెద్ద విజయం అందించాయి. మొత్తంగా లిటిల్ హార్ట్స్ మూవీ రూ. 2.5 కోట్లతో రూపొంది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ. 35 కోట్లకు పైగా కలెక్షన్ తో థియేటర్స్ లో కొనసాగుతోంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ అక్టోబర్ చివర్లో ఓటిటిలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈవారం ఓటిటిలో రిలీజ్ కానున్న సినిమాలు సిరీస్ లు
Kishkindhapuri OTT Release Date :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా యువ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ హర్రర్ మూవీ కిష్కింధపురి. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. శాండీ మాస్టర్ కీలక పాత్ర చేసిన ఈ మూవీ ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్సు ముందుకి వచ్చి ఫస్ట్ షో నుండే సూపర్ డూపర్ హిట్ టాక్ ని అందుకుంది. అలరించే హర్రర్ అంశాలు, ట్విస్ట్ లు, విజువల్స్, ప్రధాన పాత్రధారుల యొక్క యాక్టింగ్ ఈ సినిమాకి పెద్ద సక్సెస్ ని అందించాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ప్రస్తుతం థియేటర్స్ లో ఇంకా అదరగొడుతున్న కిష్కింధపురి మూవీ అక్టోబర్ చివర్లో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశము ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
Mirai OTT Release Date :
యువ నటుడు తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఫాంటసీ పాన్ ఇండియన్ మూవీ మిరాయ్. ఈమూవీలో మంచు మనోజ్ విలన్ గా నటించగా కీలక పాత్రల్లో శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం, గెటప్ శ్రీను నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై గ్రాండియర్ విజువల్ వండర్ గా రూపొందిన మిరాయ్ మూవీ ఇటీవల థియేటర్స్ లో విడుదలై మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు మైథలాజికల్ అంశాలు, విజువల్స్, తేజ సజ్జ, మంచు మనోజ్ నటన, ఫైట్స్, యాక్షన్ సీన్స్ వంటివి ఈ మూవీకి సక్సెస్ ని అందించాయి. అయితే లేటెస్ట్ Tollywood బజ్ ప్రకారం ఈ మూవీ మరొక ఏడు వారాల అనంతరం ఓటిటి లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
కాగా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్స్, న్యూస్, గాసిప్స్, రివ్యూస్, బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం ఎప్పటికప్పుడు మా సైట్ ని చూస్తూ ఫాలో అవుతూ ఉండండి.
What's Your Reaction?






