Tripti Dimri Joins Prabhas in Spirit | Official Update Out

Animal actress Tripti Dimri joins Prabhas for Spirit movie. Sandeep Reddy Vanga's next is gaining buzz with this fresh casting update

Tripti Dimri Joins Prabhas in Spirit | Official Update Out

తెలుగు మూవీ నటుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి యువ దర్శకుడు దాసరి మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ (The Rajasaab) కాగా మరొకటి హనురాఘవాపుడి తీస్తున్న మూవీ. ఈ మూవీస్ రెండిటి పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

త్రిప్తి దిమ్రీ – ప్రభాస్ స్పిరిట్ సినిమాలో హీరోయిన్

కాగా ది రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇది హర్రర్ తో కూడిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా మాళవికా మోహనన్ (Malavika Mohanan), రిద్ది కుమార్, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

అందరిలో మంచి క్రేజ్ కలిగిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్, మోషన్ పాస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలానే హను రాఘవపూడి మూవీలో ఇమాన్వి (Imanvi) హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అనునమ్ ఖేర్ కీలక పాత్ర చేస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. 

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం – మాస్ & ఎమోషనల్ డ్రామా

అయితే వీటిలో ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక హను రాఘవపూడి మూవీ వచ్చే ఎద్ధి రిలీజ్ కానుంది. అయితే వీటి రెండిటి అనంతరం ఆనిమల్ (Animal) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్సు లో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. 

రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తీసిన ఆనిమల్ మూవీ కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టి రూ. 930 కోట్ల మేర వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. దానితో స్పిరిట్ (Spirit) కూడా భారీ విజయం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. 

ఇక ఈ మూవీలో ఒక సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించనున్న స్పిరిట్ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. 

ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ జులై చివర్లో మెక్సికోలో జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొనె (Deepika Padukone) నటిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఆమె ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. 

స్పిరిట్ మూవీ – షూటింగ్ వివరాలు & రిలీజ్ అంచనాలు

అయితే తమ మూవీ యొక్క హీరోయిన్ విషయమై స్పిరిట్ టీమ్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. కాగా స్పిరిటి మూవీలో హీరోయిన్ గా ఆనిమల్ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) నటిస్తున్నట్లు టీమ్ కొద్దిసేపటి క్రితం ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ ద్వారా తెలిపింది. ఆనిమల్ మూవీలో ఆమె ఒక కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

కాగా ఆ అనౌన్స్ మెంట్ లో హీరోయిన్ త్రిప్తి దిమ్రి పేరు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ తో పాటు కొరియన్, చైనీస్, జపాన్ భాషల్లో కూడా రాసి రిలీజ్ చేసారు. దానిని బట్టి స్పిరిట్ మూవీ మొత్తంగా ఆయా భాషల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Tripti Dimri in Spirit Movie

కాగా ఈ మూవీ యాక్షన్, లవ్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్నట్లు టాక్. ఆనిమల్ మాదిరిగానే ఇందులో లవ్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే మేకోవర్ పరంగా యూరోప్ వెళ్లి ప్రత్యేకంగా సిద్దమై వచ్చారు ప్రభాస్. అలానే సాంగ్ ట్యూన్స్ ని కూడా సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అందించినట్లు తెలుస్తోంది. 

అన్ని అనుకునంట్లు జరిగితే స్పిరిట్ మూవీ జులై చివర్లో పట్టాలెక్కి వచ్చే ఏడాది మధ్యలో ఆడియన్స్ ముందుకి రావడం ఖాయం అంటున్నారు. కాగా ఈ మూవీ పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటూ ఇటువంటి మరిన్ని లేటెస్ట్ తెలుగు మూవీ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మా Telug uMovie Media సైట్ ని చూస్తూ ఉండండి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow