Kota Srinivasa Rao Biography – Family, Career & Last Days Will Break Your Heart

Legendary actor Kota Srinivasa Rao passed away today. Know his full biography, family, awards, unforgettable movies & shocking last moments

Kota Srinivasa Rao Biography – Family, Career & Last Days Will Break Your Heart

తెలుగు సినిమా పరిశ్రమలోని లెజెండరీ నటుల్లో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. తన కెరీర్ లో దాదాపుగా 750 కి పైచిలుకు సినిమాల్లో ఎన్నో రకాల విభిన్న పాత్రల ద్వారా ఆడియన్స్ నుండి గొప్ప పేరు, వారి గుండెల్లో గొప్ప స్థానం సంపాదించుకున్నారు కోట. తన కెరీర్ మొత్తంలో కోట పోషించని పాత్ర లేదనేది వాస్తవం. 

Kota Srinivasa Rao Biography

దాదాపుగా అన్ని రకాల పాత్రల్లో నటించిన ఆయన  ప్రతి పాత్రలో కూడా పరాయక ప్రవేశం చేసేవారు. ముఖ్యంగా ఆయన నటిస్తుంటే ఎంతో సహజంగా అనిపించడంతో పాటు ఆ గొప్ప నటన మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అంతటి గొప్ప మహోన్నత నటుడుకోట శ్రీనివాసరావు వారం రోజుల క్రితం అనగా 2025 జులై 13న తెల్లవారు ఝామున 4 గంటల సమయంలో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 

కొట శ్రీనివాస రావు జీవిత చరిత్ర – ఆఖరి రోజులు

అయితే ఆ విషయం తెలిసిన  తెలుగు చిత్రసీమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు ప్రేక్షకులు అభిమానులు కూడా కోట మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియియచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక పలువురు సినీ ప్రముఖులు కోట స్వగృహానికి చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

కాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, విక్టరీ వెంకటేష్, సురేష్ బాబు, అల్లరి నరేష్, కరాటే కళ్యాణి, ఎస్ ఎస్ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, బాబు మోహన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, దగ్గుబాటి రానా ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

అనంతరం కోట అంత్యక్రియలు పలువురు కుటుంబసభ్యులు, ప్రేక్షకాభిమానుల సమక్షంలో హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ శ్మశానవాటికలో జరిగాయి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవల ఆయనతో కలిసిన దిగిన ఒక ఫోటోని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫొటోలో కోటని చూస్తే అందరికీ గుండె తరుక్కుపోయింది. 

Kota Srinivasa Rao Movies

మొత్తంగా 83 ఏళ్ళ వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి మనందరి హృదయాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఇక కోట శ్రీనివాసరావు పూర్తి స్థాయి పూర్తి స్థాయి బయోగ్రఫీ గురించి ఇప్పుడు చూద్దాం. 10 జులై 1942 లో ఆంధ్రపదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్ గా పని చేసారు. 

అయితే తండ్రి మాదిరిగా తాను కూడా డాక్టర్ అవ్వాలని భావించారు కోట శ్రీనివాసరావు. అయితే సినిమాల మీద ఆయనకు మక్కువ కారణంగా అది సాధ్యపడలేదు. అయితే తన కాలేజీ విద్య సమయంలోనే ఓవైపు చదువుకుంటూ మరోవైపు పలు స్టేజి నాటకాలు కూడా వేసేవారు కోట. అయితే బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్న అనంతరం ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా చేరి మరోవైపు సినిమా ప్రయత్నాలు కూడా చేసేవారు. 

చిన్ననాటి జీవితము, కుటుంబం, సినీ ప్రస్థానం

ఆయన సోదరు కోట శంకరరావు కూడా నటుడే అనేది తెలిసిందే. అప్పట్లో పలు టివి సీరియల్స్ తో పాటు అక్కడక్కడా పలు సినిమాల్లో కూడా ఆయన నటించి ఆకట్టుకున్నారు. భార్య రుక్మిణితో వివాహం అనంతరం అటు ఉద్యోగంతో పాటు ఇటు కుటుంబం పై కూడా ఎక్కువగా జాగ్రత్త పెట్టేవారు కోట. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. 

కాగా కుమారుడైన కోట ఆంజనేయ ప్రసాద్ తెలుగులో నటుడిగా సిద్ధం తో పాటు గాయం 2 సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు. అనంతరం 2010లో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్ లో మరణించడంతో కోట సహా వారి కుటుంబం మొత్తం కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. ఇక కోట శ్రీనివాసరావు సినిమా ప్రయాణం గురించి మాట్లాడలి అంటే, తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రాణం ఖరీదు సినిమాతోనే కోట కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. 

Telugu Actor Kota Srinivasa Rao

అక్కడి నుండి ఒక్కొక్కటిగా నటుడిగా అవకాశాలు అందుకుంటూ వెళ్లిన కోటకి అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా రజిని హీరోయిన్ గా జంధ్యాల తీసిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అహ నా పెళ్ళంటలో ఒక కీలక  అవకాశం లభించింది. మూవీ మొఘల్ డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మించిన ఆ సినిమా అప్పట్లో అత్యద్భుత విజయం సాదించి నటుడిగా కోటకు విశేషమైన పేరు తీసుకువచ్చింది. 

ఆ సినిమాలో ఆయన పోషించిన పిసినారి లక్ష్మీపతి పాత్రలో సహజ నటన అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా అందులో అటు సీరియస్ గా ఇటు కామెడీ కూడా పండిస్తూ గొప్ప పేరు సొంతం చేసుకున్నారు కోట. అయితే అక్కడి నుండి నటుడిగా వెనుతిరిగి చూసుకోని కోట, విశేషంగా అవకాశాలు సొంతం చేసుకుంటూ కొనసాగారు. అసలు కోట శ్రీనివాసరావు అంటేనే ఒక సినిమా లైబ్రరీ అని చెప్పకతప్పదు. ఎందుకంటే దాదాపుగా తన కెరీర్ లో ఆయన పోషించని పాత్ర లేనేలేదు. 

Kota Srinivasa Rao Family

ఇక అక్కడి నుండి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తనదైన ఆకట్టుకునే నటనతో అలరించిన కోట శ్రీనివాసరావు మొత్తంగా 750కి పైగా సినిమాలు చేసారు తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అనేక పాత్రలు చేసారు కోట. ఇక టాలీవుడ్ లో నాటి సీనియర్ ఎన్టీఆర్ నుండి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అలానే నాటి దాసరి నారాయణరావు నుండి నేటి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు దాదాపుగా అందరు దర్శకులతో కోట పనిచేసారు. 

ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఎక్కువగా తెలుగు నటుల్ని మాత్రమే తీసుకోవాలని పరభాషల నటుల్ని ఎక్కువగా ప్రోత్సహించడం పై కోట అసహనం వ్యక్తం చేయడంతో పాటు ధర్నా కూడా చేశారు. ఆ విధంగా తెలుగు సినిమాల్లో తెలుగు వారిని ఎక్కువగా తీసుకోవాలని కోరుతూ తన వంతుగా పాటుపడ్డారు కోట. ఇక నటుడిగా ఎన్నో వందల పాత్రలు చేసి తద్వారా ప్రేక్షకుల యొక్క గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన కోట తొలిసారిగా 1985లో ప్రతిఘటన సినిమాలో పోషించిన పాత్రకు గాను స్పెషల్ జ్యూరీ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. 

బహుమతులు, చిరస్మరణీయ పాత్రలు, ఆయన మరణ వార్త

ఆ తరువాత విలన్ గా 1994లో గాయం, అదే ఏడాది తీర్పు, 1998లో గణేష్, 2001లో చిన్నా చిత్రాలకు గాను నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. అలానే ఆయనకు శ్రీహరి హీరోగా తెరకెక్కిన పృథ్వీనారాయణ చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అలానే, లిటిల్ సోల్జర్స్, ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో సినిమాలకు గాను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నంది పురస్కారాలను సొంతం చేసుకుని గొప్ప పేరు అందుకున్నారు. ఇక 2015లో కోట శ్రీనివాసరావుని పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. 

ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు 1999లో భారతీయ జనతా పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ నుండి పోటీ చేసి ఎమ్యెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు కోట. ఆ విధంగా అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కలిసి తీసిన హరి హర వీర మల్లు చిత్రంలో కోట ఒక చిన్న పాత్ర చేసారు. ఒకరకంగా ఆయనకి అదే ఆఖరు చిత్రం. 

Kota Srinivasa Rao Death

ఇక తనకు ఉన్నంతలో పలువురు సీనియర్ నటులకు అలానే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సినిమా వారికి కూడా తనవంతుగా వీలైన సాయం అందించారు కోట. అయితే రాను రాను వయసు మీద పడడంతో ఆల్మోస్ట్ చాలావరకు ఆయన సినిమాలకు దూరం అయ్యారు. కాగా ఆయన హఠాన్మరణం నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు యావత్ భారతీయ సినిమా పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. ఎక్కడ ఉన్నా వారి పవిత్రాత్మకు శాంతి చేకూరి వారికి సద్గతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow