Telugu Cinema Movie Reviews – Full Ratings & Talk

Find Telugu cinema movie reviews with ratings, verdicts, and box office reports. Daily review updates from experts and fans on Telugu Movie Media platform

Telugu Cinema Movie Reviews – Full Ratings & Talk

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పటికే గడచిన ఐదు నెలల్లో అనేక సినిమాలు మన తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. ముందుగా ప్రతి ఏడాది సంక్రాంతి మాదిరిగా ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసి అందరికీ చక్కని వినోదాన్ని అందించాయి. 

తెలుగు సినిమా రివ్యూస్ – ఫుల్ డీటెయిల్స్

మరి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా ఎంత మేర మెప్పించింది. అలానే పలు సినిమాల యొక్క రివ్యూస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ పొలిటికల్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). కియారా అద్వానీ (Kiara Advani) ఇందులో హీరోయిన్ గా నటించారు.

ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీలో అంజలి కీలక పాత్ర చేశారు. ఎస్ థమన్ సంగీతం అందించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డే నుండి నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. 

శంకర్ నుండి ఆడియన్స్ మెగా ఫ్యాన్స్ ఆశించిన అంశాలేవీ మూవీలో లేకపోవడంతో ఓవరాల్ గా ఇది పెద్దగా ఆకట్టుకోలేక కేవలం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లవరకు మాత్రమే రాబట్టింది. అయితే అదే సమయంలో బాలకృష్ణ తో బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ ((Daaku Maharaaj) మూవీ కూడా రిలీజ్ అయి విజయవంతం అయింది. 

ఇక ఈ మూవీలో బాలకృష్ణ పోషించిన పవర్ఫుల్ పాత్రకు అందరి నుండి మంచి క్రేజ్ లభించింది. ఇక గతంలో బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టిన ఎస్ థమన్ దీనికి కూడా పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి అందరినీ అలరించారు. ఇక ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటించగా మెయిన్ విలన్ ఆనిమల్ (Animal) మూవీ ఫేమ్ బాబీ డియోల్ కనిపించారు. 

సినిమా స్టోరీ & హైలైట్స్

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దీనిని నాగవంశీ గ్రాండ్ గా నిర్మించారు. ఇక అదే సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aiswarya Rajesh) హీరోయిన్స్ గా కనిపించారు. 

అయితే ఈ మూవీకి దర్శకుడుగా వ్యవహరించిన అనిల్ రావిపూడి దీనిని చక్కగా అన్ని వర్గాల ఆడియన్సు ని అలరించేలా తెరకెక్కించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో అందించిన సాంగ్స్ కూడా అలరించాయి. విక్టరీ వెంకటేష్ తో పాటు హీరోయిన్స్ ఇద్దరూ అలానే ఇతర కీలక పాత్రలు చేసిన మాస్టర్ రేవంత్, వికె నరేష్, వీటివి గణేష్ సహా అందరూ కూడా పెర్ఫార్మన్స్ అదరగొట్టారు. 

ఓవరాల్ గా ఫస్ట్ డే నుండి సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా ఈమూవీ భారీ స్థాయిలో కలెక్షన్ కొల్లగొట్టి అటు వెంకటేష్, ఇటు అనిల్ రావిపూడి కెరీర్స్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా అనంతరం నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి తీసిన తండేల్ (Thandel) మూవీ రిలీజ్ అయింది. 

పేట్రియాటిక్ నేపథ్యంతో ఆకట్టుకునే లవ్, యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా కనిపించగా ఇతర కీలక పాత్రల్లో ఆడుకాలం నరేన్, కరుణాకరన్ తదితరులు నటించారు. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా పెద్ద క్రేజ్ ఏర్పడింది, వాటికీ థియేటర్స్ లో విశేషమైన రెస్పాన్స్ లభించింది. 

ఓవరాల్ గా ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న తండేల్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అనంతరం చిన్న సినిమాగా రిలీజ్ అయి ఆడియన్స్ ని అలరించిన మూవీ కోర్ట్. ఈ మూవీని నాని నిర్మించగా ప్రధాన పాత్రల్లో హర్ష్ రోషన్, శ్రీదేవి నటించారు. 

ఇతర కీలక పాత్రల్లో శివాజీ, శుభలేఖ సుధాకర్, రోహిణి, ప్రియదర్శి నటించారు. మంచి ఆకట్టుకునే కథ కథనాలతో కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ మూవీ బాగా విజయవంతం అయింది. ఫోక్సో చట్టం అంశం చుట్టూ తిరిగిన కోర్ట్ మూవీ ఓవరాల్ గా రూ. 50 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. 

ఇక కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత శోభన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అయితే రిలీజ్ అనంతరం అందరినీ విశేషంగా ఆకట్టుకున్న మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 70 కోట్ల గ్రాస్ అందుకుంది. 

బాక్సాఫీస్ & పబ్లిక్ టాక్

ఇక వీటి తరువాత నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 (Hit 3 The Third Case) మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీ థ్రిల్లింగ్ క్రైమ్ మూవీగా రూపొందింది. కాగా ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర లో నాని అద్భుత నట కనబరిచారు. 

మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈమూవీలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ పాత్ర పోషించారు. ఓవరాల్ గా ఏ రేటడ్ గా రిలీజ్ అయినప్పటికీ అందరినీ ఆకట్టుకుని హిట్ సాధించింది హిట్ 3 మూవీ. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 114 కోట్ల గ్రాస్ సొంతం చేసుకోవడం విశేషం. 

ఇక ఇటీవల శ్రీవిష్ణు హీరోగా యువ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన కామెడీ మూవీ సింగిల్ (Single). ప్రారంభం నుండి అందరిలో మంచి ఇంట్రెస్ట్ ఏర్పరిచిన ఈ మూవీ ఓవరాల్ గా సూపర్ హిట్ కొట్టింది. శ్రీవిష్ణు మార్క్ కామెడీ తో పాటు వెన్నెల కిషోర్ ఆకట్టుకునే నవ్వులు దీనికి పెద్ద విజయం అందించాయి. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో కేతిక శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) హీరోయిన్స్ గా నటించారు. మంచి ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించింది సింగిల్ మూవీ. ఇక ఇది ఓవరాల్ గా రూ. 35 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుని విజయం అందుకుంది.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow