Rajinikanth’s Coolie Movie Review – Action, Mass & Vintage Style

Read the complete review of Rajinikanth’s Coolie movie. Packed with action, style, and mass moments for fans.

Rajinikanth’s Coolie Movie Review – Action, Mass & Vintage Style

కూలీ మూవీ రివ్యూ (Rajinikanth Coolie Movie Review) : ఆకట్టుకునే మాస్ యాక్షన్ మూవీ

విడుదల తేదీ : 14 ఆగష్టు 2025

రేటింగ్ : 3 / 5

నటీనటులు : రజినీకాంత్, నాగార్జున అక్కినేని, శృతి హాసన్, సౌబిన్ షాహిర్, అమీర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర 

దర్శకత్వం : లోకేష్ కనకరాజ్ 

నిర్మాత : కళానిధి మారన్

సంగీతం : అనిరుద్ రవిచందర్ 

సినిమాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్ 

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ కూలీ. ఈ మూవీలో శృతి హాసన్ కీలక పాత్ర చేయగా దీని ద్వారా తొలిసారిగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. 

రజినీకాంత్ కూలీ మూవీ సమీక్ష – యాక్షన్, స్టైల్, మాస్ ఎంటర్‌టైనర్

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్సు ముందుకి వచ్చింది. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈమూవీ ఎంతమేర విజయం అందుకుంది, ఆడియన్స్ యొక్క అభిప్రాయం ఏమిటి అనేది ఇప్పుడు పూర్తి స్థాయి రివ్యూలో చూద్దాం. 

కథ : 

దేవా (Rajinikanth) టీమ్ తో కలిసి అజ్ఞాతంలో జీవిస్తూ ఉంటాడు. అయితే దేవా ప్రాణంగా ప్రేమించే స్నేహితుడు రాజశేఖర్ (Satyaraj) అనుకోకుండా చనిపోతాడు, అయితే అతడిది సహజ మరణం కాదని, హత్య ని దేవా కనిపెడతాడు. మరి ఇంతకీ అతడిని హత్య చేసింది ఎవరు, ఆ నిజం తెలుసుకున్న దేవా వారిని ఏ విధంగా పట్టుకుంటాడు, మరి మధ్యలో సైమన్ ఎవరు, అతడి పాత్ర ఏమిటి, అతడి బిజినెస్ లని దేవా ఏ విధంగా అరికట్టాడు, మధ్యలో దయాళ్ (Soubin Shahir)  ఎవరు, అతడికి రాజశేఖర్ మరణానికి ఉన్న శమందం ఏమిటి అనే అంశాలు అన్ని కూడా కూలీ మూవీ యొక్క వెండితెరపై చూడాల్సిందే.  

Coolie Movie Review in Telugu

ప్లస్ పాయింట్స్ : 

ముఖ్యంగా ఈమూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవా పాత్రలో తన మార్క్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు అని చెప్పకతప్పదు. గతంలో అనేక సినిమాల మాదిరిగా ఆయన ఈ మూవీలో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో పాటు ఎలివేషన్ సీన్స్ లో కూడా అదరగొట్టారు. ఇక ఆయన పలికిన డైలాగ్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. 

ఇక తొలిసారిగా తన కెరీర్ లో నెగటివ్ పాత్ర చేసిన కింగ్ నాగార్జున సైమన్ పాత్రలో అదరగొట్టారు అని చెప్పకతప్పదు. నిజంగా మొదటి నుండి కూలీ టీమ్ చెప్తున్న మాదిరిగా ఈమూవీలో నాగార్జున పాత్ర ఎంతో స్టైలిష్ గా ఉంది. ఉపేంద్ర తో పాటు అమీర్ ఖాన్ ల యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక యాక్షన్ విలన్ గా పలు కీలక సీన్స్ లో నాగార్జున పెర్ఫార్మన్స్ ఎంతో ఆకట్టుకుంటుంది. 

కథ, నటన, దర్శకత్వం విశ్లేషణ

ఇక కీలమైన ప్రీతీ పాత్ర చేసిన శృతి హాసన్ తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకోగా నెగటివ్ పాత్ర చేసిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కూడా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. సత్యరాజ్, ఉపేంద్ర తో పాటు ఇతర పాత్రధారులు అందరూ కూడ పరిధి మేరకు అలరించారు. 

Rajinikanth Coolie Public Talk

ఇక ఈ సినిమాకి మరొక కీలక ప్లే పాయింట్ దర్శకుడు లోకేష్ టేకింగ్ తో పాటు అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కీలక యాక్షన్ సీన్స్ తో తన స్కోర్ అదిరిపోయింది. రజిని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్సు కి కూడా ఈ సీన్స్ మంచి కిక్ అందిస్తాయి. మాస్ స్టైల్ లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ తోపాటు హీరో ఎలివేషన్స్ కూడా అదిరిపోయాయి. 

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు లోకేష్ తన గత సినిమాల మాదిరిగా హీరోని పలు సీన్స్ లో ఎలివేట్ చేసారు. ఫోటోగ్రఫి తో పాటు సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. పలు విజువల్స్ ఎంతో గ్రాండ్ గా ఉన్నాయి. జూనియర్ ఎంజీఆర్, మోనికా బ్లేస్సి, రుచిత రామ్ లతో పాటు ఇతర పాత్రధారులు కూడ ఆకట్టుకున్నారు. 

మైనస్ పాయింట్స్ : 

అయితే దేవా పాత్రని ఆ పాత్ర యొక్క గ్రాఫ్ ని బాగానే రాసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్, దానికి తగ్గట్లుగా స్క్రీన్ పై పాత్ర ట్రీట్మెంట్ రాసుకోలేదు. అలానే కూలీ కథ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, కొన్ని సన్నివేశాలు స్లో గా సాగడంతో పాటు మనకు ప్రత్యేకంగా కొత్తదనం ఉన్న ఫీల్ ని కూడా అంతగా అందించవు. 

Coolie Movie First Day Collections

ఫస్ట్ హాఫ్ బాగానే సాగిన కూలీ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసినట్లు అనిపిస్తుంది. తీసుకున్న పాయింట్ బాగున్నా దానిని ఇంట్రెస్టింగ్ నడిపే స్క్రీన్ ప్లే విషయంలో కొంత తడబడ్డారు. ఆడియన్స్ లో ఉత్సుకతని రేపే సీన్స్ అయితే రాసుకోలేదు. లోకేష్ దర్శకత్వం రేంజ్ ఆశించి వచ్చే ఆడియన్స్ కి కూలీ అంతగా అంచనాలు అందుకోదు అని చెప్పాలి. ఓవరాల్ గా మంచి ఎమోషన్స్, అక్కడక్కడా ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కూలీ మెప్పించదు. 

సాంకేతిక వర్గం : 

ఇక కూలీ మూవీలో చెప్పుకోవాల్సింది సాంకేతిక వర్గం గురించి. వారు తమ యొక్క పనిని అదరగొట్టారు, వారు ప్లస్ గా కూడా నిలిచారు. అనిరుద్ అటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ కూడా బాగా అందించారు. రెండు సాంగ్స్ చికిటు, మోనికా థియేటర్ లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. గిరీష్ గంగాధరన్ కూడా మూవీ విజువల్స్ విషయంలో ఆకట్టుకున్నారు. 

Rajinikanth New Movie 2025 Review

పలు యాక్షన్, ఎలివేషన్ సీన్స్ లో ఆయన ఫోటోగ్రఫి టాప్ నాచ్ లో ఉందని చెప్పకతప్పదు. ఎడిటింగ్ విభాగం యొక్క పని తీరు కూడా బాగుంది. అయితే అక్కడక్కడా రెండు మూడు సీన్స్ సాగతీతగా అనిపిస్తుంది. ఇక నిర్మాత కళానిధి మారన్ మూవీ యొక్క అవసరం మేరకు ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకుండా భారీగా పెట్టిన ఖర్చు యొక్క ప్రతి రూపాయి మనకు తెరపై కనిపిస్తుంది. 

తీర్పు : 

మొత్తంగా తొలిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీసిన యాక్షన్ మాస్ గ్యాంగ్ స్టర్ మూవీ కూలీ ఎవరేజ్ గా ఆకట్టుకుందని చెప్పాలి. రజినీకాంత్, నాగార్జున, సౌబిన్ ల యాక్టింగ్ తో పాటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ ల పాత్రలు కూడా బాగున్నాయి. అక్కడకెక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. 

తెలుగు ప్రేక్షకుల అభిప్రాయాలు & ఫ్యాన్ రియాక్షన్స్

దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్క్రిప్ట్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉండాల్సింది. ఓవరాల్ గా వీలైతే కూలీ మూవీని మీ సమీప థియేటర్ లో కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి. వీలైతే ఈ వారం మీ సమీప థియేటర్స్ లో ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి, చూసి ఆనందించండి. కాగా ఇటువంటి లేటెస్ట్ టాలీవుడ్ మూవీ న్యూస్, లేటెస్ట్ అప్ డేట్స్, గ్యాలరీస్, రివ్యూ కోసం ఎప్పటికప్పుడు మన Telugu Movie Media సైట్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow