Kingdom Review – Vijay Deverakonda’s Stunning Comeback or Just Another Spy Saga?

Kingdom review: Vijay Deverakonda delivers one of his best performances in this stylish action thriller. Strong visuals and background score save a familiar spy story. Rating & verdict inside.

Kingdom Review – Vijay Deverakonda’s Stunning Comeback or Just Another Spy Saga?

'కింగ్డమ్' రివ్యూ : ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ డ్రామా

తెలుగు మూవీ మీడియా డాట్ కామ్ రేటింగ్ : 3. 5 / 5

నటీనటులు : విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్, అయ్యప్ప పి శర్మ, కసిరెడ్డి రాజ్ కుమార్ తదితరులు 

దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి 

నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య 

సంగీతం : అనిరుద్ రవిచందర్ 

ఫోటోగ్రఫి : గిరీష్ గంగాధరన్, జొమన్ టి జాన్

ఎడిటింగ్ : నవీన్ నూలి  

Kingdom Review

కింగ్‌డమ్ మూవీ రివ్యూ – ప్రిన్స్ విజయ్ దేవరకొండ మళ్ళీ హిట్?

ఇటీవల ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన స్థాయి సక్సెస్ సాదించలేకపోయిన విజయ్ దేవరకొండ తాజాగా యువ దర్శకడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోజులే సినిమాస్ సంస్థలు నిర్మించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. అందాల యువ నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇటీవల రిలీజ్ అయి మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. దానితో మూవీ పక్కాగా విజయవంతం ఖాయం అని విజయ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా భావించారు. మరి నేడు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ ఎంతమేర అందరినీ అలరించింది ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంది అనేది మొత్తం కూడా పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథ :

1920 సమయంలో బ్రిటిష్ వారి పరిపాలనలో శ్రీకాకుళం ప్రాంతంలో గల ఒక తెగ నాయకుడు తమ వద్ద ఉన్న ఒక విలువైన ఖనిజం కోసం దాడి చేయడంతో ప్రజల కోసం పోరాడి చివరకు ప్రాణాలు వదులుతాడు. ఆ ఘటన అనంతం ఆ తెగ వాసులందరూ కూడా సరికొత్త నాయకుడి కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. కట్ చేస్తే 1991 సమయంలో అంకాపూర్ స్టేషన్ లో చిన్న కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సూరి (Vijay Deverakonda) కి ఇండియన్ స్పై ఏజెన్సీ వారు ఒక ఆపరేషన్ ని అందిస్తారు.

Kingdom Movie Review

కాగా తనకు చిన్నప్పటి నుండి ఎంతో ప్రాణమైన అన్న శివ (Satya Dev) ఉన్నాడనే కారణం చేత అతడు ఆ ఆపరేషన్ కోసం ఒప్పుకుని ఆ ప్రాంతానికి వెళతాడు. మరి అనంతరం ఏమి జరిగింది, అతడికి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఇంతకీ చివరికి అతడు అన్నని చేరుకున్నాడా, ఇంతకీ ఆ తెగ ప్రజలు ఎవరు, చివరికి మొత్తంగా కథ ఏవిధంగా ముగిసింది అనేది మొత్తం కూడా వెండితెర పై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా కింగ్డమ్ మూవీలో హీరోగా సూరి పాత్రలో తన అత్యద్భుత నటనతో విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ అదుర్స్ అని చెప్పకతప్పదు. పలు యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో అతడి యాక్టింగ్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ గా నటించిన (Bhagyasri Borse) పాత్ర యొక్క పరిధి మేరకు అందం అభినయంతో ఆకట్టుకుంది. అలానే శివ పాత్రలో నటించిన సత్యదేవ్ ఎప్పటిమాదిరిగానే తన పాత్రలో పరకాయప్రవేశం చేసారు. కీలమైన యాక్షన్ తో పాటు ఎలివేషన్ సీన్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. విలన్ గా నటించిన నూతన నటుడు వెంకటేష్ విలన్ గా నెగటివ్ పాత్రలో అదరగొట్టాడు. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్న ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు క్లైమాక్స్ సీన్స్ కూడా మంచి థ్రిల్ అందిస్తాయి. సెకండ్ పార్టీ ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. చాలా వరకు విజయ్ ఫ్యాన్స్ ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేస్తారు. 

యాక్షన్, విజువ‌ల్‌లు & సంగీతం – టెక్నికల్ అవుట్‌లుక్ ఎలా?

మైనస్ పాయింట్స్ :

వాస్తవానికి నాటి మగధీర నుండి ఇటీవల వచ్చిన కన్నడ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కెజిఎఫ్ వరకు కథానుసారం హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం చూసాం. అదే విధంగా కింగ్డమ్ మూవీ కూడా పలు యాక్షన్ సీన్స్ తో పాటు ఎలివేషన్స్ తో ఆకట్టుకుంటుంది. కొంతవరకు ఆ రెండు సినిమాల యొక్క జానర్స్ ని కలిపితే కింగ్డమ్ మూవీ పుట్టిందనిపిస్తుంది. అయితే జెర్సీ మాదిరిగా పెద్దగా కథలో కొత్తదనం లేకుండా ఎక్కువగా ఎమోషన్స్ తో ఈ కథని నడిపాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. వాస్తవానికి విజయ్ యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లో అతడి పెర్ఫార్మన్స్ అదిరిపోయినప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపిస్తుంది. అలానే ఎమోషనల్ సీన్స్ ని కూడా మరింత బలంగా హృద్యంగా రాసుకోవాల్సింది.

అయితే హీరో తన అన్నకోసం తెగించి ఎంతో కష్టపడే ఎమోషన్ తప్ప పెద్దగా ఎమోషన్స్ మనల్ని అంతగా కదిలించవు. ఇక కీలక అంశం ఏమిటంటే దివి అనే ప్రాంతంలో మగబిడ్డలను కన్నా తల్లులు వారిని చూసేవీలు ఉండదనేది ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడా పలు కుటుంబాల్లో మగపిల్లలు కనిపిస్తారు. అక్కడ కొద్దిగా లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే యొక్క పాత్రకు ఈ మూవీలో అంతగా ప్రాధాన్యత లేదు. ఇండియన్ స్పై ఏజెన్సీ జెపి తాను పంపించే స్పై లు ఏమైనా పర్లేదు అనుకుంటాడు కానీ దాని యొక్క కారణం మాత్రం అంత బలంగా అనిపించదు. కొంత అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రిపీటెడ్ గా అనిపిస్తుంది. 

Kingdom Public Talk

సాంకేతిక వర్గం :

ముఖ్యంగా కింగ్డమ్ మూవీలో మేకర్స్ పెట్టిన ఖర్చు మనకు కళ్ళకు కట్టినట్లుగా తెరపై కనిపిస్తుంది. ముఖ్యంగా విజువల్స్ ఈ మూవీలో అదిరిపోయాయి. దానికి సంబంధించి ఫోటోగ్రాఫర్స్ గిరీష్ గంగాధరన్, జొమన్ టి జాన్ ల పనితనం మనకు తెలుస్తుంది. అనిరుద్ యొక్క స్కోర్ థీమ్ బాగుంటుంది. ఇక ఎడిటింగ్ పరంగా వర్క్ బాగానే చేసారు, సినిమాలో సాంగ్ కట్ చేసి ఉండకపోతే ఒకింత లెంగ్త్ ఎక్కువ అనిపించేది, పైగా కథనం యొక్క ఫ్లో కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేది.

Kingdom Review Rating

ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గురించి చెప్పుకుంటే జెర్సీ మాదిరిగా ఈమూవీ కూడా ఎమోషనల్ అంశాలతో యాక్షన్ మిళితంగా కథని నడిపారు. వాస్తవానికి కథనం ఫస్ట్ హాఫ్ బాగుండి, సెకండ్ హాఫ్ నెమ్మదించినప్పటికీ ఎక్కడా కూడా ప్రక్కదారి పట్టదు, స్టోరీలో పరిస్థితులు ప్రకారం సాగె సన్నివేశాలు చక్కగా రాసుకున్నారు. కాకపోతే కథనంలో ప్రత్యేకమైన థ్రిల్ కలిగించే అంశాలు మాత్రం రాసుకోలేకపోయారు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, ఫైట్స్ వంటివి బాగున్నప్పటికీ సగటు ప్రేక్షకుడు ఆయన నుండి ఈ మూవీ ద్వారా ఆశించిన అంశాలు మిస్ అయ్యాయి. వాస్తవానికి కింగ్డమ్ ట్రైలర్ మనం పరిశీలిస్తే ఇది భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ మూవీ అనిపిస్తుంది. సినిమాలో కూడా అదే కథనం ఉన్నా కూడా పూర్తి స్థాయి సంతృప్తిని మాత్రం అందించదని చెప్పాలి. 

కథా కథనం, స్క్రీన్‌ప్లే & ప్రేక్షకులు ఏమంటున్నారు?

తీర్పు

మొత్తంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్ మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్సు ముఖ్యంగా ఎన్నో నెలల నుండి తమ హీరోకి మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఫ్యాన్స్ కి బాగానే నచుతుంది. అలానే సాధారణ ఆడియన్సు ని కూడా ఆకట్టుకునే ఈ మూవీలో విజయ్ దేవరకొండ అదిరిపోయే యాక్టింగ్, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొన్ని యాక్షన్ సీన్స్, గ్రాండ్ విజువల్స్ వంటివి మనల్ని అలరిస్తాయి. వీలైతే ఈ వారం తప్పకుండా మీ కుటుంబంతో సహా సమీప థియేటర్స్ లో కింగ్డమ్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి

Vijay Deverakonda Kingdom

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow