Khaleja Re-Release Sets New Records in Tollywood History
Mahesh Babu's 'Khaleja' re-release breaks records, becoming the highest-grossing Telugu re-release with ₹8 crore worldwide on Day 1.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా అందాల అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కించిన మూవీ ఖలేజా (Mahesh Khaleja). ఈ మూవీ 2010లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ;ఆదరణ అందుకోలేకపోయింది.
అంతకంకుండు సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి పలు కేంద్రాల్లో ఏకంగా సిల్వర్ జూబిలీ కూడా జరుపుకుంది. దానితో ఐదేళ్ల అనంతరం వచ్చిన ఖలేజా పై అందరిలో అంచనాలు తారా స్థాయికి చేరాయి.
మహేష్ బాబు ఖలేజా రీ-రిలీజ్ – టాలీవుడ్‌లో చరిత్ర సృష్టి
అయితే ఖలేజా మూవీలో సూపర్ స్టార్ మహేష్ ఎక్కువగా ఫుల్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ కథ, కథనాల్లో బలం లేకపోవడంతో ఆడియన్స్ ని అది అలరించేలేకపోయింది. ఇక అనుష్క శెట్టి ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు మెలోడి బ్రహ్మ మణిశర్మ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
అయితే థియేటర్స్ లో ఫెయిల్ అయినప్పటికీ కూడా మహేష్ బాబు ఖలేజా మూవీకి కల్ట్ క్రేజ్ ఉంది. ట్విస్ట్ ఏమిటంటే, కేవలం సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అన్ని వర్గాల ఆడియన్సు తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఈ మూవీ పై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తరచు పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు.
Khaleja re-release box office collection
ఇక టివిల్లో ఎప్పుడు ప్రదర్శితం అయినా మంచి రేటింగ్స్ ని మహేష్ ఖలేజా మూవీ అందుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల కొన్నాళ్లుగా తెలుగులో రీ రిలీజ్ ల యొక్క హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా మహేష్ బాబు నటించిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరితో ఈ హవా ప్రారంభం అయింది.
4K రీ-రిలీజ్‌తో మొదటి రోజు ₹8 కోట్లు వసూళ్లు
పోకిరి మూవీ రీ రిలీజ్ లో కూడా పెద్ద విజయం అందుకోవడం విశేషం. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఖలేజా మూవీని మళ్ళి థియేటర్స్ లోకి తీసుకువచ్చి రీ రిలీజ్ చేసారు. ఈ మూవీ యొక్క రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి.
అలానే ఈ మూవీకి సంబంధించి బాగానే ప్రమోషన్ కూడా నిర్వహించారు. ఫైనల్ గా మే 30న థియేటర్స్ లోకి రీ రిలీజ్ అయిన ఖలేజా మూవీ ప్రీ టికెట్ బుకింగ్స్ నుండే తన హవాను ప్రదర్శించింది. వాస్తవానికి ఇటీవల వచ్చిన పలువురు నటుల యొక్క రీ రిలీజ్ సినిమాలు బాగానే రెస్పాన్స్ అందుకున్నప్పటికీ అవి భారీ స్థాయిలో అయితే బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేకపోయాయి.
Mahesh Babu Khaleja 4K re-release
దానితో అందరూ రీ రిలీజ్ ల హవా ఇక అయిపోయినట్లే అని అనుకున్న తరుణంలో ఖలేజా మళ్ళి దానికి జీవం పోసింది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ బుక్ మై షో మొదలుకుని డిస్ట్రిక్ట్ వంటి యాప్స్ లో కూడా భారీ స్థాయిలో అన్ని ఏరియాస్ లో మహేష్ ఖలేజా టికెట్ బుకింగ్స్ జరిగాయి.
USAలో $100K దాటి, రీ-రిలీజ్‌లలో అగ్రస్థానం
ఇక తొలి రోజు ఈమూవీ రూ. 8.02 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని పెద్ద రికార్డు ని నెలకొల్పింది. వాస్తవానికి అంతకముందు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు మురారి మూవీ ఓవరాల్ గా రూ. 8. 02 కోట్లు కలెక్ట్ చేయగా ప్రస్తుతం ఖలేజా రీ రిలీజ్ లో దానిని జస్ట్ డే 1 లో కొట్టేయడం విశేషం. రెండవ రోజు కూడా ఈ మూవీ బాగానే ఆక్యుపెన్సీ ని పెట్టింది.
మరోవైపు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ల భైరవం మూవీ మంచి టాక్ తో కొనసాగుతున్నప్పటికీ కూడా రీ రిలీజ్ లో ఖలేజా మంచి కలెక్షన్ అనుకోవడం ఆ మూవీ పై అందరిలో ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అని చెప్పడానికి నిదర్శనం. ఇటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, నార్త్ తో పాటు అటు యుఎస్ఏ లో సైతం మహేష్ ఖలేజా తన హవాని చూపిస్తోంది.
Khaleja re-release records
ముఖ్యంగా అక్కడ ఈ మూవీ 100K డాలర్స్ ని దాటేసి అక్కడ ఆల్ టైం రికార్డుతో దూసుకెళుతోంది. అప్పట్లో సూపర్ స్టార్ మార్వలెస్ యాక్టింగ్ ని మిస్ అయిన పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా మహేష్ ఖలేజాని థియేటర్స్ లో చూసి విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
మొత్తంగా ప్రస్తుతం ఈ మూవీ రీ రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న తీరుని బట్టి చూస్తే ఓవరాల్ గా ఇది వరల్డ్ వైడ్ గా రూ. 15 కోట్ల మార్క్ వరకు చేరుకునే అవకాశం లేకపోలేదని అంటున్నాయి సినీ వర్గాలు. మరి మొత్తంగా మహేష్ ఖలేజా ఎంతమేర టోటల్ గా బాక్సాఫీస్ కలెక్షన్ రాబడుతుందో చూడాలి.
What's Your Reaction?






