Sandeep Reddy Vanga Responds to Deepika Padukone’s Remarks

Sandeep Reddy Vanga gives a strong reply to Deepika Padukone’s Reaction on Prabhas Spirit Movie. Read the full controversy, reactions, and public buzz

Sandeep Reddy Vanga Responds to Deepika Padukone’s Remarks

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఎంతో మంచి పేరుతో దూసుకెళ్తున్నారు. ఒకరకంగా తెలుగులో మాత్రమే కాదు హిందీ సహా యావత్ భారతావనిలో సినిమాలు చూసే ప్రేక్షకులో మంచి క్రేజ్ ఉంది. మొదటగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ఆయన తీసిన మూవీ అర్జున్ రెడ్డి (Arjun Reddy)

ఈ మూవీలో షాలిని పాండే (Shalini Pandey) హీరోయిన్ గా నటించగా అలనాటి టాలీవుడ్ సీనియర్ నటి కాంచన ఒక ముఖ్య పాత్ర చేసారు. ఇక ఈమూవీలో అర్జున్ రెడ్డి అనే డాక్టర్ పాత్ర చేశారు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా యువతతో పాటు మాస్ ఆడియన్స్ ని సైతం రిలీజ్ అనంతరం ఎంతో ఆకట్టుకుని అర్జున్ రెడ్డి మూవీ పెద్ద విజయం సొంతం చేసుకుంది. 

సందీప్ రెడ్డి వంగా – దీపిక పదుకొనే వ్యాఖ్యలపై స్పందన

ఇందులో అర్జున్ రెడ్డిగా నాచురల్ యాక్టింగ్ తో విజయ్ అదరగొట్టగా సందీప్ రెడ్డి స్టోరీ, టేకింగ్, సాంగ్స్ కి అందరి నుండి విశేషమైన స్పందన లభించింది. అనంతరం ఇదే మూవీని హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ (Kiara Advani)లతో కబీర్ సింగ్ (Kabir Singh) టైటిల్ తో రీమేక్ చేసారు సందీప్ రెడ్డి వంగా. 

అయితే ఆ మూవీ కూడా హిందీలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి నార్త్ లో కూడా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. అయితే దాని అనంతరం బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) లతో సందీప్ తీసిన లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఆనిమల్ (Animal)

ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియన్ మూవీ అతి పెద్ద సక్సెస్ సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్ వైడ్ గా రూ. 930 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని హీరోగా రణబీర్ కి హీరోయిన్ గా రష్మిక కి అలానే దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కి విశేషమైన క్రేజ్ తీసుకువచ్చింది. 

స్పిరిట్ సినిమాపై వివాదం – దర్శకుడి క్లారిఫికేషన్

ఇక త్వరలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ (Spirit) అనే మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నారు సందీప్ రెడ్డి. ఈ మూవీలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో ఈ క్రేజీ ప్రాజక్ట్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 

ఇక ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొనె (Deepika Padukone) హీరోయిన్ గా నటించనున్నారు అంటూ కొన్నాళ్ల క్రితం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా న్యూస్ వైరల్ అయ్యాయి. అలానే ఆమెకు ప్రత్యేకంగా కలిసిన దర్శకుడు సందీప్ స్టోరీ వినిపించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 

అయితే ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు గాని, కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఆమె స్పిరిట్ మూవీ నుండి తప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే సడన్ గా ఆమె తప్పుకున్నారు అని న్యూస్ వచ్చిన వెంటనే స్పిరిట్ మూవీలో స్టోరీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఆ మూవీలో కంటెంట్ ఈ టైపులో ఉంటుంది అంటూ ఒకటి రెండు జాతీయ మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచురితం అయ్యాయి. 

సోషల్ మీడియా లో రియాక్షన్స్ – ఫ్యాన్స్ స్పందన

అయితే స్పిరిట్ మూవీ నుండి దీపికా పదుకొనె తప్పుకోవడానికి కారణం అందులో ఆనిమల్ మాదిరిగా బోల్డ్ కంటెంట్ ఉంటుందని, అలానే ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ అడిగారని, పని గంటల విషయమై కూడా పొత్తు కుదరకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు ఆ వార్తల యొక్క తదుపరి సారాంశం. 

దానితో ఒక్కసారిగా వీటిపై తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందించారు దర్శకుడు సందీప్. వాస్తవానికి మనం ఒకరిని నమ్మి మన సినిమా యొక్క కథ చెప్తే దానిని గుట్టుగా ఉంచకుండా అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పడం ఎంతవరకు సబబు, ఈ విధంగా అన్ని లీక్ చేయడం కరెక్ట్ కాదు. 

సరే మీకు ఇష్టం అయితే మూవీ యొక్క పూర్తి స్టోరీ కూడా అందరికీ చెప్పుకోండి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ పోస్ట్ చేసారు. అయితే అది దీపికా ని ఉద్దేశించి సందీప్ రెడ్డి వంగా పోస్ట్ చేసినట్లు కొంతవరకు అర్ధం అవుతుందనేది నెటిజన్స్ యొక్క వాదన. దాంతో నిన్నటి నుండి సోషల్ మీడియా మొత్తం కూడా నేషనల్ వైడ్ గా ఈ న్యూస్ తోనే అట్టుడికిపోతోంది. 

కొందరేమో దీపికా కరెక్ట్ అంటుంటే, మరికొందరేమో సందీప్ కరెక్ట్ అంటున్నారు. ఏది ఏమైనా మొత్తంగా ప్రస్తుతం ఈ న్యూస్ విపరీతంగా ప్రచారం అవుతుండగా, పలు మాధ్యమాల వారు ఎవరికి తోచిన విధంగా వారు రాస్తున్నారు. 

పైగా స్పిరిట్ మూవీ నుండి దీపికా తప్పుకున్నారు అనే వార్త వచ్చిన వెంటనే మా మూవీ హీరోయిన్ గా ఆనిమల్ మూవీ ఫేమ్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri) అంటూ సందీప్ర్ రెడ్డి వంగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయడం పై కొంత మిశ్రమ స్పందన కూడా వస్తోంది. 

మొత్తంగా ఈ విధంగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ అన్ని విధాలుగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిందని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ విషయం పై ఎవరు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా స్పిరిట్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికోలో జరుపనున్నారు. అక్కడినుండి వేగంగా షూటింగ్ జరిపి దీనిని 2026 ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలుచేస్తున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow