Mahesh Babu Family at Akhil-Zainab Wedding Ceremony
Superstar Mahesh Babu and family attend Akhil Akkineni & Zainab Ravadjee’s wedding. See exclusive pics and inside moments from the grand event

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఏడాదిన్నర క్రితం గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహించారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మితం అయిన గుంటూరు కారం మూవీ మొదటి రోజు నెగటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ మాస్ కల్ట్ క్రేజ్, స్టార్డంతో ఫస్ట్ డే నుండి మంచి కలెక్షన్స్ అందుకుంది.
Mahesh Babu, Namrata, Sitara spotted at the wedding
ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పైగా షేర్ ని అలానే చాలా చోట్ల బ్రేకీవెన్ ని గుంటూరు కారం మూవీ సొంతం చేసుకుని మహేష్ బాబు క్రేజ్ ని మరొక్కసారి ప్రూవ్ చేసింది. అయితే దీని అనంతరం మహేష్ బాబు తాజాగా జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29.
మహేష్ బాబు ఫ్యామిలీ అఖిల్ – జైనబ్ పెళ్లి వేడుకలో పాల్గొన్న వేళ
దీని పై సూపర్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ఒక భారీ సెట్టింగ్ లో ప్రారంభం కానుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తుండగా పలువురు హాలీవుడ్ నటులు కూడా ఇందులో భాగం కానున్నట్లు టాక్.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈమూవీకి వి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇక మహేష్ బాబు ఈమూవీలోని తన పాత్ర కోసం ప్రత్యేకంగా క్రాఫ్ తో పాటు గడ్డం, బాడీని కొద పెంచుతున్న విషయం తెలిసిందే.
పెళ్లి వేడుకలో గ్లామర్ హంగులు – ఫ్యామిలీ మోమెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో ఎంతో గ్రాండియర్ గా రూపొందుతున్న SSMB 29 మూవీ 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి రానున్నట్లు సమాచారం. అయితే ఇటీవల కొన్నాళ్ల పాటు ఈ మూవీకి బ్రేక్ రావడంతో తన ఫ్యామిలీ తో కలిసి యూరోప్ కి ప్రత్యేకంగా ట్రిప్ కి వెళ్లి వచ్చారు మహేష్ బాబు.
దాదాపుగా ఆయనకు సంబంధించి ఎటువంటి పిక్స్ ని ఇతర విషయాలని లీక్ కాకుండా చూసుకుంటున్నారు జక్కన్న రాజమౌళి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వీడియో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగష్టు 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్నట్లు టాలీవుడ్ బజ్.
Akhil Akkineni marriage with Zainab Ravadjee details
అయితే అసలు విషయం ఏమిటంటే, ఇటీవల అక్కినేని నాగార్జున, అమల ల కుమారుడు అఖిల్ వివాహం జైనబ్ తో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న ఎంతో వైభవంగా జరిగిన వివాహం అనంతరం ఇటీవల వీరి యొక్క రెసెప్షన్ వేడుకని హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేయగా అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా ప్రత్యేకంగా తన ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించారు.
అతిథులు, ఫోటోలు, మరియు వేడుక హైలైట్స్
ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మధ్యమాల్లో విశేషంగా వైరల్ అవుతున్నాయి. మొదటి నుండి ఘట్టమనేని, అక్కినేని కుటుంబాలకు మధ్య మంచి సన్నిహిత్వం ఉన్న విషయం తెలిసిందే. మొత్తంగా అఖిల్ పెళ్లిలో తమ అభిమాన సూపర్ స్టార్ సందడి చేయడంతో ఆయన ఫోటోలని మరింతగా వైరల్ చేస్తున్నారు సూపర్ ఫ్యాన్స్. ఇటువంటి మరిన్ని తాజా తెలుగు మూవీ అప్ డేట్స్ కోసం మా తెలుగు మూవీ మీడియా సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.
What's Your Reaction?






