New Telugu Movies 2025 – Latest Tollywood Releases & Updates
Catch the latest updates on new Telugu movies releasing in 2025. From star-studded blockbusters to fresh OTT premieres – updated list and news

ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చాయి. అందులో కొన్ని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాగా మరికొన్ని ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా వాటిలో సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అనంతరం వచ్చిన మ్యాడ్ స్క్వేర్ తో పాటు తండేల్, ఇటీవల రిలీజ్ అయిన సింగిల్ వంటి సినిమాలు ఆడియన్సు ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం పలు భారీ తో పాటు చిన్న సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అవేంటి అనేది ఇప్పుడు చుద్ద్దాం.
2025లో విడుదలవుతున్న తాజా తెలుగు సినిమాలు
SSMB29
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే దీని యొక్క తదుపరి షెడ్యూల్ ని జూన్ మొదటి వారంలో జరుపనున్నారు. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనిని 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ చేయడానికి టీమ్ సన్నద్ధం అవుతోంది.
OG
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ మూవీ ఓజి. ఈ మూవీని సుజీత్ తెరకెక్కిస్తుండగా విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 26న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ (Priyanka Mohan) గా నటిస్తున్నారు.
Spirit
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ (The Rajasaab) తో పాటు మరోవైపు హను రాఘవపూడితో ఫౌజీ (Fauji) సినిమాలు చేస్తున్నారు. వీటిలో ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాది అలానే ఫౌజీ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటి అనంతరం అతి త్వరలో ఆనిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్పిరిట్. ఈ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తుండగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) లేదా శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) లలో ఒకరు హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.
AA 22
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ ఒకటి సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దీపికా పదుకొనె (Deepika Padukone), మృణాల్ ఠాకూర్ తో పాటు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్స్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026 చివర్లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.
టాలీవుడ్ నుంచి వస్తున్న కొత్త సినిమాల లిస్ట్
Peddi
మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ భారీ మూవీ పెద్ది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పెద్ది మూవీని 2026 మార్చి 27న థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
NtrNeel Movie (Dragon)
ప్రస్తుతం హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr), మరోవైపు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో డ్రాగన్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ మూవీలో కన్నడ అందాల భామ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్న డ్రాగన్ (Dragon) మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 జూన్ 25న అత్యధిక థియేటర్స్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
థియేటర్లలో విడుదల అవుతున్న మూవీలు మరియు OTT రిలీజ్‌లు
The Paradise
నాచురల్ స్టార్ నాని (Nani) ఇటీవల హిట్ 3 (HIt 3 The Third Case) మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసందే. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా శైలేష్ కొలను తెరకెక్కించారు. దాని అనంతరం త్వరలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ మూవీ చేయనున్నారు నాని. ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2026 మార్చి 26న విడుదల చేయనున్నారు.
Rowdy Janardhana
యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ కింగ్డమ్. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి తెరెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ జులై లో ఆడియన్స్ ముందుకి రానుంది. దీని అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన మూవీ చేయనున్నారు విజయ్ దేవరకొండ. ఈమూవీని గ్రాండ్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
What's Your Reaction?






