Akira Nandan Debut Movie: Director, Cast, Release Date & More

Akira Nandan Debut Movie Details టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో అటు సినిమాలతో రెండు విధాలుగా బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్

Akira Nandan Debut Movie: Director, Cast, Release Date & More

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం అటు రాజకీయాలతో అటు సినిమాలతో రెండు విధాలుగా బిజీ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ మరింత తీరిక లేకుండా కొనసాగుతున్నారు. ఆయన హీరోగా ప్రస్తుతం లైన్లో ఓజి (OG), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) సినిమాలు ఉన్నాయి. 

Akira Nandan Debut Movie – Official Updates & Latest News

ఈ మూడింటి పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో (Bro) మూవీలో నటించారు పవన్. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. ఇక పవన్ చేస్తున్న ఈ మూడు సినిమాల్లో ముందుగా మార్చి 28న హరి హర వీరమల్లు ముందుగా ఆడియన్స్ ముందుకి రానుండగా ఆ తరువాత ఓజి, ఆపైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రానున్నాయి.

Who is Directing Akira Nandan’s First Film?

కాగా ఇటీవల తన భార్య రేణు దేశాయ్ (Renu Desai) నుండి విడిపోయారు పవన్. ఇక ఆమె కుమారుడైన అకీరా నందన్ (Akira Nandan) కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంటున్నారు. తరచు తన కుమార్తె ఆద్య, కుమారుడు అకీరా కి సంబందించిన పలు పోస్ట్ లు సోషల్ మీడియా మాధ్యమాల్లో పంచుకుంటూ ఉన్నారు రేణు దేశాయ్. 

ఇటీవల ఆమె రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో హేమలత లవణం పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. మరోవైపు కొద్దిరోజులుగా తన తండ్రి పవన్ కళ్యాణ్ పలు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తుండడంతో ఆయన వెంటనే ఉంటూ దర్శన చేసుకుంటున్నారు అకీరా నందన్. 

Akira Nandan Movie Cast, Story & Genre Details

తాజాగా ఆయనతో కలిసి మహా కుంభమేళాలో భాగంగా ప్రయాగ్ రాజ్ లోని పుణ్య నదుల్లో స్నానం ఆచరించారు అకీరా. వాటికి సంబందించిన ఫోటోలు, వీడియోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. మొదటి నుండి అకీరాకి సంబందించిన ప్రతి చిన్న న్యూస్ కూడా మీడియాలో వైరల్ అవుతూ ఉన్న విషయం తెల్సిందే. 

తాజాగా తన తండ్రి పవన్ తో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుండడంతో అకీరా పై మీడియా ఫోకస్ మరింతగా పెరిగింది. అయితే ప్రస్తుతం తాను మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడికి ఇష్టం అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించలేండి రేణు గారి ఆలోచన అని టాక్. 

Akira Nandan Debut Movie Release Date & Production Status

మరోవైపు అకీరా అతి త్వరలో హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, టాలీవడ్ కి చెందిన ఒక యువ నిర్మాత తాలూకు పెద్ద బ్యానర్ లో అతడి ఎంట్రీ ఖాయం అయిందని అంటున్నారు. 2027 లో పట్టాలెక్కనున్న ఈ మూవీని పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన టాప్ డైరెక్టర్ అన్ని విధాలుగా పర్యవేక్షించనుండగా ఒక యువ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించనున్నారట. 

భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ కోసం త్వరలో అకీరా పూర్తి స్థాయిలో నటన, డ్యాన్స్ లు ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకునేందుకు సిద్దమవుతున్నారట. 

What to Expect from Akira Nandan’s First Movie? Fans’ Expectations & Buzz

మొత్తంగా అయితే అకీరా ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికర్మగా ఎదురు చూస్తున్నారు. మరి పక్కాగా అకీరా నందన్ ఎంట్రీ ఎపుడు ఉంటుంది, అతడి డెబ్యూ మూవీని ఎవరు తెరకెక్కిస్తారు, పక్కగా ఏ బ్యానర్ ఆ అవకాశాన్ని అందుకుంటుంది అనేటువంటి వివరాలు అన్ని కూడా వెల్లడి కావలి అంటే మరొక రెండేళ్లు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow