Hari Hara Veera Mallu Latest Update: Latest News and Release Buzz

Get the latest Hari Hara Veera Mallu latest update including release news, teaser info, and all the buzz around Pawan Kalyan's epic movie.

Hari Hara Veera Mallu Latest Update: Latest News and Release Buzz

టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ మూడు మూవీస్ లో పాన్ ఇండియన్ హిస్టారికల్ ఎంటర్టైనర్ మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగాన్ని రానున్న మే 9 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నారు. 

Hari Hara Veera Mallu Latest Update

ఈ మూవీలో అందాల యువ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా సీనియర్ నిర్మాత ఏ ఎం రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 

ఈ మూవీలో గజ దొంగ వీర మల్లు అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఇటీవల హరి హర వీర మల్లు నుండి రిలీజ్ అయిన మూడు గ్లింప్స్ టీజర్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. అలానే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. 

ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ యొక్క కొంత భాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా మరికొంత భాగాన్ని ఏ ఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి కావచ్చిన ఈమూవీ కోసం కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొద్దిపాటి పార్ట్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉంది. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలతో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు పవన్. అందుకే త్వరలో హరి హర వీర మల్లు తో పాటు మిగతా రెండు సినిమాలైన ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క బ్యాలెన్స్ షూట్ కోసం కాల్షీట్స్ కేటాయించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక హరి హర వీర మల్లు మూవీ పై పవన్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

Pawan Kalyan’s Role and Look Revealed

సినిమాల్లోకి ఇటీవల వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్, దానితో మంచి విజయం అందుకున్నారు. అనంతరం వచ్చిన భీమ్లా నాయక్ కూడా విజవంతం అయింది. అయితే అవి రెండు రీమేక్ లు కావడంతో వాటి అనంతరం స్ట్రెయిట్ పాన్ ఇండియన్ మూవీ హరి హర వీరమల్లు చాలా గ్యాప్ అనంతరం ఫ్యాన్స్ ఆడియన్స్ ముందుకి రానుంది. 

కాగా పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా తమ సినిమా ఆకట్టుకుంటుందని, ఆ విధంగా దర్శకులు ఇద్దరూ కూడా అద్భుతంగా తెరకెక్కించినట్లు నిర్మాత రత్నం ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. తనకు ఇష్టమైన పవన్ తో చాలా గ్యాప్ అనంతరం మూవీ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండ హరి హర వీర మల్లు మూవీ భారీ విజయం ఖాయం అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 

Release Date and Teaser Expectations

ఇక ఈ మూవీ నుండి త్వరలో మూడవ సాంగ్ రిలీజ్ కానుండగా ఏప్రిల్ చివరి వారంలో మూవీ నుండి అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారట. మొత్తంగా త్వరలో పవన్ ఫ్యాన్స్ కి హరి హర వీర మల్లు నుండి ఒక్కొక్కటిగా వరుసగా అప్డేట్స్ రానున్నాయి. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow