Penguin Movie Review – Keerthy Suresh’s Thriller Verdict
Penguin movie review: A gripping thriller led by Keerthy Suresh. Full analysis of plot, performance, direction, and whether it’s worth your watch

'పెంగ్విన్' మూవీ రివ్యూ : ఆకట్టుకునే సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్
మూవీ పేరు : పెంగ్విన్ (Penguin Movie Review)
విడుదల తేదీ : 19 జూన్ 2020
TeluguMovieMedia.Com Rating : 3.5 / 5
నటీనటులు : కీర్తి సురేష్, లింగా
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
నిర్మాత : కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం : సంతోష్ నారాయణన్
యువ నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ పెంగ్విన్. అంతకముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మొత్తంగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చింది. ఈ మూవీ ద్వారా అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన కీర్తి సురేష్ ఎంతమేర విజయం అందుకున్నారు, అసలు ఈ మూవీ ఎలా ఉంది, పూర్తి కథ, కథనాలు ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం.
పింగ్విన్ మూవీ రివ్యూ – కీర్తి సురేష్ శైలిలో థ్రిల్లర్
కథ :
అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన రిథమ్ (keerthy Suresh) తన మిస్ అయిన కొడుకు అజయ్ ని వెతికి కనిపెట్టే క్రమంలో ఆమె ఎటువంటి సమస్యలు సవాలు ఎదుర్కొంది, అలానే ఏ విధమైన మానసిక సంఘర్షణకు లోనైంది అనేటువంటి అంశాల కలయికలో ఈమూవీ సాగుతుంది. ఆకట్టుకునే థ్రిల్లర్ గా సాగిన ఈ మూవీలో అసలు అజయ్ ఎందకు తప్పిపోయాడు, మధ్యలో చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉన్న వ్యక్తి ఎవరు. ఇక తన కొడుకు తప్పిపోవడంతో మొదటి భర్త నుండి విడిపోయి రెండవ భర్త వలన మరొక బిడ్డకి ఆమె తల్లి కానుండడం, అనంతరం రెండవ బిడ్డ కూడా ప్రమాదంలో ఇరుక్కోవడం ఏంటి. అసలు ఇంతకీ ఎవరు తన బిడ్డని తీసుకుపోయారు, ఎవరైనా కిడ్నాప్ చేసారా, ఎవరు అతను అనేటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలు అన్ని కూడా మూవీలో చూడాల్సిందే.
Penguin movie Keerthy Suresh
ప్లస్ పాయింట్స్ :
ముందుగా ఈ మూవీలో రిథమ్ పాత్రలో ఒక తప్పిపోయిన కొడుకు కోసం వేదన పడే తల్లిగా, మరోవైపు గర్భవతిగా అనేక పాట్లు పడుతూ కొడుకు అజయ్ ని వెతుకులాట కోసం పడే తపన వంటి సన్నివేశాల్లో నటి కీర్తి సురేష్ నటన అత్యద్భుతం అతి చెప్పాలి. ముఖ్యంగా కీలకమైన ఎమోషనల్, యాక్షన్ సీన్స్ లో ఆమె మరింతగా ఆకట్టుకున్నారు. అలానే కథ ప్రకారం రాసుకున్న నటుడు లింగా తో పాటు ఇతర పాత్రధారుల యొక్క నటన, సందర్భాన్ని బట్టి వారు పాత్రలు సాగె తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు థ్రిల్లింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా కొడుకు అజయ్ మిస్ అయ్యాక డాక్టర్ వద్ద ఆమె నటించే సన్నివేశాలు బాగుంటాయి. ముఖ్యంగా ఇటువంటి పాయింట్ కి ఇంట్రెస్టింగ్ గా సాగె స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ ఎంతో బాగా వ్యవహరించారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఆయన రాసుకున్న కథనం, అనుకోకుండా తమ నుండి మిస్ అయిన ప్రతి తల్లికి బాగానే కనెక్ట్ అవుతుంది.
కథ, కథనం, మరియు ప్రేక్షకుల స్పందన
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ బాగానే ఇంట్రెస్టింగ్ గా సాగినప్పటికీ మధ్యలో మెయిన్ పాయింట్ కి వచ్చే సమయంలో కొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. అలానే అక్కడక్కడా మధ్యలో కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. మధ్యలో హీరోయిన్ కి ఇచ్చిన లాజిక్ లేని సీన్స్ కథనంలో లోపాలని ఎత్తి చూపుతాయి. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ చాలా వరకు కథ, కథనాలను బాగానే ముందుకి నడిపినా కమర్షియల్ అంశాల చిత్రాలు కోరుకునే ఆడియన్స్ కి ఇది పెద్దగా రుచించదు. మధ్యలో పలు ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సీన్స్ మాత్రం బాగున్నాయి, అలానే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ బాగా సాగిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మధ్యలో అక్కడక్కడ కొంత ఫ్లో అర్ధం కాక బోరింగ్ గా కొందరికి అనిపించవచ్చు.
Penguin movie OTT review
సాంకేతిక విభాగం :
ముఖ్యంగా పెంగ్విన్ మూవీ తక్కువ బడ్జెట్ తో రూపొందినప్పటికీ క్వాలిటీ అలానే విజువల్స్ పరంగా ఎంతో గ్రాండ్ గా దీనిని తెరకెక్కించారు. కొన్ని సీన్స్ అయితే ఎంతో రిచ్ గా అనిపించాయి. కెమెరా మ్యాన్ పనితనం గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన సాంగ్స్ బాగున్నాయి, అక్కడక్కడా కొన్ని ముఖ్య సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ కూడా బాగా వర్క్ చేసారు, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తో సహా అంతా బాగుంది.
నటన, టెక్నికల్ అంశాలు మరియు మా రేటింగ్
తీర్పు :
వైవిధ్యమైన కథ, కథనాలతో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా రూపొందిన పెంగ్విన్ మూవీ మొత్తంగా అయితే ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి. కమర్షియల్ అంశాలు కోరుకునే వారికి నచ్చనప్పటికీ చాలా సీన్స్ ఆడియన్సు కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. సెకండ్ హాఫ్ ఎంతో ఆకట్టుకునే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ మధ్యలో అక్కడక్కడా కొంత కన్ఫ్యూజన్ గా సాగడంతో పాటు కొంత బోర్ గా అనిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ యాక్టింగ్, గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడి టేకింగ్ వంటివి పెంగ్విన్ మూవీకి ప్రధాన బలాలుగా చెప్పవచ్చు. వీలైతే ఇప్పటివరకు దీనిని చూడని వారు అమెజాన్ ప్రైమ్ లో ఒక లుక్ వేయండి.
Penguin Telugu review
What's Your Reaction?






